www.thetelugus.com

ఎన్నిమాట్లు సందేశాలు  పంపించినా  తెలుగు పత్రికలు నరేంద్ర మోదీ పేరు మోడీ అనే రాస్తున్నారు. వారెవరూ రేడియొ కానీ టి‌.వి.  కాని వినరనుకొంటాను. హింది, గుజరాతీ, కన్నడమరాఠీ పత్రికలు ఏవి ఇలా రాయవు.

‘మోడీ’ పాత మరాఠీ లిపిపేరు. మనప్రధాని మోదీ.    కాని మన డింకర్, డినేశ్, డివాకర్ ఇంగ్లీషు వారు కదా … మోడీ అనే రాస్తారు మరి చండ్రశే    ఖర రాఓ అనీ రాహుల్ గాంఢీ (అసలు పేరు Ghandy,  Parsi version of Gandhi, as Sir Jehangir G. of  Tatas used to write) ఎందుకు రాయరు? పరివారానికి తోకలు ఊపే కుక్కలా ? 

లేక రాహ్-ఉల్-గాండీ (ముజిబ్-ఉర్-రహమన్, రెహ్మత్-ఉల్-ల్లా లాగ) అని రాయొచ్చుగా?  ఇరాన్ నుంచి మతపరమైన పీడనకి గురి అయిన పార్సీలు గుజరాత్  వలస వచ్చి వృత్తి నామాలు (Daruwala, Engineer, Watchmaker, etc.) కానీ,  అక్కడి (గుజరాతీ) పేర్లు  కానీ పెట్టుకున్నా spellings వేరు. పార్సీ గాంధీ Ghandy అనీ, Modi పేరు  Mody  (Piloo Mody, MP) అనీ Patel ని  Patell  (ఘులామ్ పటేల్, రుస్తమ్ పటేల్) అనీ రాస్తారు. రాహుల్ తాత పార్సీ అనీ పూర్వీకులు ముస్లింలనీ అంటారు. కాబట్టి Rah-ul-Ghandy అని రాయాలి లేకపోతే దినేశ్  ని డినేశ్ అనాలి. 

మన దేశంలో పేర్లు  రాసే  విధానాలు  ప్రతి  భాషాప్రాంతానికి  వేరు. తమిళులు చాలామంది ఊరిపేరుని ఇంటిపేరుగా వాడుకొంటారు… కోయింబత్తోర్  సుబ్రమణ్యం లా.  తెలంగాణ నుంచి చాలామంది తెలుగు వారు ఏ కరువు వల్లో, వ్యాపారానికో  మహారాష్ట్రలోని విదర్భ  ప్రాంతానికి తరలి వెళ్ళినప్పుడు  వారిని  ‘ఆడ్నావ్’  (ఇంటిపేరు)  అడిగితే  ఫలానా ‘వారు’ అని చెప్పినప్పుడు రికార్డు  పుస్తకాలలో  పేరుకి  ‘వార్’ చేర్చబడింది.  ఆ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి  మారోత్రావ్  కన్నంవార్,  యూ‌పి‌ఏ లో మంత్రి విలాస్రావ్  ముత్తెంవార్ ఇలాటి  వారే.  మనం  ఇంటిపేరు పూర్తిగా  వాడడం  ఇ ప్పుడే  మొదలెట్టాము. లోక నాయక్  బాపూజీ  ఆనే, RSS   సంస్థాపకుడు కేశవ రావ్  హెగ్డేవార్   తెలుగువారని చాలమందికి  తెలియదు.

ఉత్తరభారతమంతా ఇంటిపేర్లు పూర్తిగా  రాసుకుని, వారిపేర్లు పొడి అక్షరలుగా  రాసుకుంటాఋ. మరాఠీలో ఇంగ్లీషు పొడిఅక్షరాలు కాక వారి భాషలో ఎలా ఉచ్చరిస్తారో  అలా రాసుకుంటారు.  పురుషోత్తమ్  లక్ష్మణ్ దేశపాండె అనే గొప్ప రచయితని  ‘ఫుల’   అనే పిలిచేవారు, పి.ఎల్. కాదు.  తెలుగులో మాత్రo  పాములపర్తి వెంకట నరసింహా రావు  పీ. వీ. ఏ.  మారాఠి లో రెండవ అక్షరం తండ్రిపేరు ఉంటుంది. Y.B.Chavan యశ్వంత్ రావ్ బల్వంత్ రావ్ చవాన్. తండ్రిపేరు బల్వంత్. ఉత్తర  భారతీయులు రాసినట్టు తెలుగువారు తండ్రిపేరు రాయరు,

ఈ మధ్య తెలుగు దేశం నుంచి వచ్చి మరాఠీవారుగా మారినవారు పేర్లనుంచి ‘వార్’ తొలిగిస్తున్నారు  — అన్నంవార్ ఇప్పుడు  ఆణే, కన్నంవార్  కాణే, సున్కరవారు  సుంకర్, భాగవతులవారు భాగ్వత్, జోశ్యులవారు జోషిగా మారిపోయారు. ఇలా ఇంకా ఎందరో.

కర్ణాటకలో ఇంటిపేరూ, ఊరిపేరూ, తండ్రిపేరూ పొడి అక్షరాలుగా  వాడుతారు.  తెలుగు, కన్నడ, రాష్ట్రాలలో ఇంటిపేరు పూర్తిగా రాయడం వల్ల కొన్ని బాధలున్నాయి.  మైసూరు, బెంగుళూరు ఇంటిపేరున్నవారిని ఊరి పేరుతోనే  పిలవాలి – అంటే ఎం. విశ్వనాథ్  ఇప్పుడు వి. మైసూర్, బి. రామయ్య  ఆర్. బెంగులూర్ అయిపోయారనమాట. అల్లాగే పులి, నక్క, ఇంటిపేర్లు ఉన్న తెలుగువారు అలాగే  పిలవబడుతారు.  అది బాగా ఉండకపోవచ్చు.

 కర్ణాటకలో   కొందరు తండ్రిపేరు  ఇంటిపేరుగా  రాసుకుంటారు.   అలాటివారు  ఆదే పేరుగావాడితే  వారు చేసిన తప్పులకి వారి తండ్రులు తిట్లు తింటారనమాట!  

చాలా రాష్ట్రాలలో పేరునిబట్టి  కులం గుర్తించవచ్చు.  తెలుగురాష్ట్రాలలోనూ మహారాష్ట్రలోనూ రావ్  ఉత్త  గౌరవ   వాచకమే  కానీ కర్నాటకలో రావ్ అంటే  శాస్త్రి, శర్మా లాగ బ్రాహ్మడే.  బీహార్ లో ప్రసాద్ అన్నా  సింహా అన్నా  కాయస్థ కాబట్టే జయప్రకాశష్ నారాయణ్  పేరులో ప్రసాద్ తీసేసారు.  లాల్ర్  బహాదుర్ శ్రీవత్సవ్  (కాయస్త్) హాశిలో  ‘శాస్త్రి’  పరీక్ష పసాయి  ఎల్ . బి.  శాస్త్రీ  ఆయారు.  బర్మా (మైనమార్) లో ఒకె  మనిషి చిన్నప్పుడు ‘కొ’, ఎద్దయ్యాక  ‘మౌంగ్’  గొప్పస్థితిలో  ఉంటే ‘యూ”  అయినట్టు, మరాఠీ వారు వయసు రాగానే  పేరుకి రావ్,  భావు లాంటి పదాలు జోడిస్తారు. అంటే చిన్నప్పుడు ఉట్టి యశ్వంత్ పెద్దయ్యాక  యశ్వంత్రావు  అవుతాడు.  అలాగే  బంగాల్లో  ఉపాధ్యాయ్  జోడిస్తారు – అంటే  (బ్రహ్మలలో మాత్రం) చాటేర్జీ చత్తోపాధ్యాయ్, ముఖర్జీ   ముఖోపాధ్యాయ్, బనేర్జీ  బన్దోపాధ్యాయ్ అవుతారు.   

కొందరు  తెలుగు మీడియానే సమర్ధించి  గాంధీగారు d తరవాత h రాసుకునేవారని అంటున్నారు, గాంధీజీ ఇంటిపేరు  గాంధీ, గంది  కాదు.  లతా మంగేష్కర్ కి తెలుగులో latha (లథ)అని రాస్తున్నా  ఆవిడ తప్పుపట్టకపోతే అది సరికాదు.  తనపేరు  తనకికావలసిన విధంగా రాసుకోడనికి దినకర్, దినేష్, దివాకర్లకి  ఎంత అధికారం  ఉందో  మోదీకి  కూడా అంతే ఉంది.  దేశ ప్రధాన మంత్రి పేరుకూడా తెలియని వారు  మీడియా లో ఉండకూడదు.

భారత  దేశంలో  పేర్లు రాసుకునే   విధానాన్ని  మార్చడం చాలా  కష్టం.  కానీ ఈ దిశలో ప్రయత్నాలు  మొదలు పెట్టాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here