www.theTelugus.com

‘మడి’ అన్న concept తెలుగు వారికీ  కన్నడపు వారికి (కన్నడిగలు) మాత్రం పరిమితమైనదని నా అభిప్రాయం. అలాగే తెలుగువారి ‘అంటు’ కూడా.
తమిళులకి ఎంగిలి,  మాత్రం ఉందనుకుంటాను. నేను తప్పు అవొచ్చు.ఈ మడికూడా ఎన్నో శతాబ్థాలు అందరినీ తొక్కి పెట్టి  dominate చేసిన బ్రాహ్మలదేనేమో.  కాని రచనా ప్రపంచం లో వారి ఏకాథిపత్యం వల్ల తెలుగు జాతికే ఇది అంటగట్ట బడింది.


మడిలో ఉన్నవారికి తక్కిన అందరూ అస్ప్రశ్యులే. పూర్వం మడిబట్టలు ఆరేసుకోడానికి వేరే దండెం వుండేది,  ఒక మందబుధ్ధి.ముసలమ్మ దొంగలని దూరంగా ఉంచడానికి విలువైన వస్తువుల మీద మడిచీర కప్పితే అవీ, చీరా, రెండూ పోయాయని సామొత.వంటిల్లు, చల్లని గది వంటిల్లు,చల్లని వంట  గదిలో మడి నీళ్లు, ఊరగాయ జాడీలు, అందులో చింతకాయి, నిమ్మకాయి, దబ్బకాయి, ఆవకాయ, మాగాయి, మెంతికాయి, తొక్కుపచ్చడి, వడియాలు, అప్పడాలు, చల్ల మిరపకాయలు, వుండేవి. 
బాదం, కరివేపాకు, అరటి, మందారం, పారిజాతం, తులసి మొదలైన   చెట్లు అన్ని ఇళ్ళలోనూ ఉండేవి.
రెండు పెద్ద అరుగులు, ఎడమవైపు పోస్టాఫీసు గది, కుడి వైపు (ఒకప్పుడు కే కులానికి పరిమిత మైన) కరణీకం  గది, మధ్యలో మండువా, అటుా, ఇటూ గదులు, పెద్ద వసారా… అందులో ఆడపిల్లలు కుార్చునేవారు. ముట్టయితే లోనికి  రాకూడదనేవారు, ఆచారము, అంటు అని మాట మాటకి అనేవారు. ఇప్పుడు చాదస్తం అంటారు.


బయట తిరిగి వస్తే, కాళ్లు చేతులు కడుగుకొని, బట్టలు మార్చుకున్నాకే భోజనం.                             ఉదయం 10.30, సాయంత్రం 6 కల్లా భోజనం. మజ్జిగ అన్నంలో వేసవి కాలంలో మామిడి పళ్ళు,  తక్కిన రోజుల్లో అరటి పండ్లు.
ఉదయం చద్దెన్నం, చిన్న పిల్లలకు కాఫీ లేదు, మధ్యాహ్నం, జంతికలు, మిఠాయి, కొమ్ములు, చేగోడీలు, పుాతరేకులు.
శీతాకాలంలో, సీతాఫలాలు, జామకాయ, సపోటా, తేగలు, బుర్ర గుంజు, తాటి ముంజెలు, వేసవి కాలంలో  ఈత కాయలు, సీమ చింతకాయలు.


భోజనములో కంది పచ్చడి, పెసర పచ్చడి, మినప పచ్చడి, గోంగూర పచ్చడి, కొబ్బరి కాయ పచ్చడి, వంకాయ పచ్చడి, పచ్చి పులుసు, మెంతి మజ్జిగ, చల్లపులుసు, కందిపొడి, నువ్వులపొడి, పొట్లకాయపెరుగు పచ్చడి, పాలు పోసి ఆనపకాయకూర, ఆవ పెట్టి పనస, అరటి, కంద బచ్చలి, కూరలు, తెలగపిండితో కూరలు, గుత్తి వంకాయ, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు (టమోటా తక్కువ), తోటకూర, బచ్చలికూర, గోంగూర,పప్పు పులుసు, పెండలం కుార, వేపుళ్ళు, బంగాళదుంప ఉప్మా కుార… ఇది వంటకం. తెలుగు వంటల వచైవిధ్యత. రుచీ ఎంత ప్రఖ్యాతంటే కర్నాటకలో చాలా హోటళ్ళలో  మామూలు వంట లోనే ఎక్కువ కారం వేసి బోర్డ్  మీద ‘ఆంధ్ర భోజనం’ అని రాస్తారు. తెలుగు వారికి కారం తివడంలో ఎవరూ సాటి రాలేరు కదా.


ఇంక తద్దినం భోజనము సరేసరి. ఆలస్యమయినా అమోఘం. మధ్యాహ్నం 2 దాక వేచి చూసే వాళ్ళం.  మధ్యలో అడిగితే, ‘బ్రాహ్మల భోజనాలు అవుతున్నాయి, అరగంట ఆగండి”,  అనేవారు.
గారెలు, అప్పాలు, పరవాన్నం, నువ్వు పచ్చడి లేక పొడి, అల్లప్పచ్చడి, పులుసు వుండదు, చారు, పెసరపప్పు  తీపి కూర, ఆవపెట్టిన కూర, ఇంకో కూర. అనకూడదు కానీ, తద్దినభోజనం తలుచుకుంటే ఎటువంటి వారికైనా నోట్లో నుంచి చొంగ కారాల్సిందే! ఇంక శనివారం, ఆదివారం నాడు ఫలహారంగా దిబ్బరొట్టి  తినేవారం.
శుభకార్యాలలో, బూరెలు, బొబ్బట్లు, మైసూరు పాక్. పఃతరేకులు, బూంది లడ్డు, గుమ్మడి కాయ దప్పళం, పనస పొట్టు కూర, స్పెషల్.


అత్తరు సాహెబ్ సెంటు, famous. అత్తరుకి వచ్చినప్పుడు కంటికి సుర్మ పెట్టే వాడు.
తలకు రాసుకోవటానికిి టాటా, స్వస్తిక్ సువాసనగల నూనె, ఆడవాళ్ళు జుట్టు ఊడకుండ ‘రీట’ రాసుకునేవారు.
అప్పట్లో తిలకం పెట్టుకునే వారు, స్టిక్కర్లు లేవు. మగపిల్లలు కూడ తిలకం పెట్టుకుని బడికి వెళ్ళే వారు.ఆడపిల్లలు క్లాసుకి ఒకరిద్దరే.  పడుకునేటప్పుడు  రాత్రి   కథలు మామూలు.
‘నాగరికత’ పేరున ఇవవ్నీ పాతతరం  చిన్నప్పటి జ్ఞాపకాలలో మాత్రం  మిగిలాయి. కరోనాతో జీవన విధానం పూర్తిగా మారిపోయింది. “చిన్నతనం గుర్తుకి  వచ్చింది” అని typical braminical  ద్రిష్టికోణంతో  ఒక మిత్రుడు పంపిన సందేశం ఇది.  ప్రగతికి మార్పు  అవసరం అని కొందరు మరిచిపోతారు.  గత కాలం స్మ్రుతులు  కొందరికి మధురం… nostalgic. మరికొందరికి అవి చేదు  నిజాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here