www.theTelugus.com

కావాలి… ‌.‌ ‌మరో రెండు మ్యూసియములు

ఎన్నోఏళ్ళగా  నేను  నేను ఒక ప్రాతిపదికమును ఎందరో అధికారులకి పంపుతున్నాను. మామూలుగానే  అది చెత్తకుప్పలో చేరుతున్నది.. ఐదేళ్ళకొకసారి వోటు వెయ్యడం తప్ప మసకి మన కోరిక తెలపడానికి మరో మార్గం లేదు కదా. అప్పడుకూడ ఇది చెప్పడానికి MLAని కలవాలి .  అది అసాధ్యం.

ఆ కోరిక: విగ్రహాలమీద కోట్లు ఖర్చు చేసే మన ప్రభుత్వం మరో రెండు museums (సంగ్రహాలయాలు) నెలకొల్పాలి – ఒకటి దేశం బానిసత్వం నుంచి ముక్తి పొందడానికి జరిగిన పోరాటం లోని  తక్కిన దేశానికి తెలియని స్థానిక ‌‌‌సంగటనల గురించి.. రెండవది దేశ సమైక్యత  విషయం మీద మరోటి.

మనం భారతీయులుగా ఉండేది Aug.15, Jan.26 రోజులనాడు మాత్రం –తక్నినరోజులు తెలుగు వారిమో, తమిళులమో, బిహారీలమో…..        అందులో కూడా మతం, కులం, శాఖ, భాష మనని వేరుచేస్తాయి. 

ఈమధ్య నేను ఉల్లాల్ రాణి అబ్బక్క మహాదేవి  పోర్చ్చూగీసు వారిని ఎలా ఓడించిందో రాస్తే అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆమె కథ దక్షిణ కర్నాటక బయట ఎవరికీ తెలియదు. అలాగే సంగొల్లి రాయన్న పేరు బెంగళూరు రైలు స్టేషన్ కి పెడితే కిట్టూరు బయట తక్కువ మందే ఆ పేరు విన్నారు.  మన అల్లూరి సీతారామరాజు గురించి బయటి వారికి తెలియదు. మారతికాన్ఖోజే ప్రవాసభారత ప్రభుత్వంలో (Gadara Per Government of India in exile)  మంత్రి అనీ, స్వాతంత్ర సమరయోధుడనీ అతన్నీ, అతని Belgian  భార్యను, కూతుళ్ళు సావిత్రి, మాయని బాగా ఎరిగిన నాకు తెలిసినా, విదర్భ బైట ఎవరికీ తెలియదు. ఇలాంటివి వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి ప్రాంతం లో పోరాటాలు జరిగాయి… కాని ఆవి బయటికి తెలియవు. నౌకర్లు తయూరుచేసే మన విద్యా విధానం వల్ల ఆ రాష్టాలలో కూడా అందరికీ తెలియదు.  మనని బానిసలను చేసి మన సంస్కృతి ని నాశనం చేసిన మొగల్. ఆంగ్ల పాలకుల గురించి వందల పేజీలు మనం చదివాం  కాని నిజాం పాకిస్థాన్ చేరే ప్రయత్నాలని ఎదిరించి నందుకు అతీక్రూరంగా రజాకార్ లు  చేతులు నరికి చంపిన షోయబుల్లా ఖాన్  గురించి ఏమీ చదవలేదు. హైదరాబాద్ లో ఎన్నోఏళ్ళున్నా ఎవరూ చెప్పలేదు.

అందుకే స్వతంత్రతా పోరాటం గురించి ఒక museum పెట్టాలి. దాంట్లో మధ్య ఒక పెద్ద హాల్  లో దశ వ్యాప్తమైన ఉప్పు సత్యాగ్రహం లాంటి మీద exhibits ఉంచి అదే హాల్ చుట్టూ ఉన్న గదుల్లో ఒకొకటి  ఒక్కో రాష్ట్రానికి ఇవ్వాలి, అక్కడ జరెగిన విషయాలు చెప్పడానికి. మద్య హాలు చుట్టూ 30 గదులు కట్టడానికి చాలా పెద్ద జాగా అవసరం. అందుకే కింద అంతస్థు అంతా national events కి వదిలి తక్కిన అంతస్థుల్లో గదులు ఒకొక రాష్ట్రానికి ఒకటి ఇవ్వాలని కోరుతున్నాను.  రెండో సంగ్రహాలయం గురించి మళ్లీ వారం.

మీసలహా ఏమిటో రాస్తారా?


Leave a Reply to Anonymous Cancel reply

Please enter your comment!
Please enter your name here