www.theTelugus.com

దేశ సమైక్యత కీ ఒక సంగ్రహాలయం ఉండాలి

కిందటి వారం మన దేశం లో స్వతంత్రత  సమరంలో  జరిగిన  ప్రాంతీయ పోరాటాల గురించి తక్కిన ప్రాంతాల్లో ఎలా తెలియదో  చర్చించాం. అవి ఎందుకు తెలియాలి అని కూడా కొందరు అడగ వచ్చు. దేశవ్యాప్తం గా జరిగిన ఈ చిన్న చిన్న పోరాటాలు అన్నీ కలిపితేనే ఒక ఉద్యమం అయి దాని వల్లే దేశం బానిసత్వం నుంచి విముక్తి  చెందినది కాని కొన్ని దళాల  నేతలు చెప్పినట్లు ఒకే కుటుంబం వారు వెళ్ళి సంపాదించి తేలేదు. భ్రష్టమైన మన విద్యా విధానం లో ఇవేమీ  చెప్పబడ లేదు. 

అలాగే చాలామందికి తెలియని మరో విషయం ఉంది. ఎన్నో భాషలు మతాలు కులాలు, శాఖలుగా విభజించబడిన మన దేశానికి ఒక common సంస్కృతి, ఒకరినొకరు బోధపరుచుకుని, గౌరవించి, కలిసి జీవించడమనే సంప్రదాయం కూడా ఉన్నది. దీన్ని చూపించి దేశ సమైక్యత బలపరచడానికి కూడా ఒక museum ఉండాలని నేను ఎన్నోఏళ్ళగా రాస్తున్నా. ఎవరూ పట్టించుకోవడం లేదు.   

ప్రతి ‌సర్ర్గవజనిక పూజకు శా‌స్త్రోక్తంగా అతి అందమయిన  దుర్గా ప్రతిమలు మడిగా భక్తి తో చేసే   కోల్‌కాతా లోని కుమార్తలా కళాకారులు చాలా మంది ముస్లింలు. అలాగే రాజ‌స్థాన్ లోని మక్రానా పాల రాతి విగ్రహాలు మీరు చెప్పిన ‌సంస్కృత శ్లోకం లో వర్ణించబడ్డట్టే classical  styleలో చెక్కే  శిల్పులూ,  ముంబయి థారావి మురికివాడల్లో (Dharavi slum) ఉండి పురాణములలో చెప్పిన విథంగా గణపతి బొమ్మలు  తయారు చేసే కుంభార్ లూ (కుమ్మరి వారు) కూడా ముస్లింలే.

కొన్నేళ్ళకింద ఇండియన్ ఐడల్ స్పర్ధలో ఒక ముస్లిం పిల్లల గుంపు హనుమాన్ చాలీసా  న్రుత్యం రూపం లో ప్రదర్శించి  ప్రశంసలు  అందుకొన్నారు. తెలుగు రాష్టాల లో శిరిడీ సాయిబాబా ని చాలామంది అనుసరించేవారున్నారు. సాయి భగవానుడు ఒక మసీదు లో ఉండే వారనీ, దాని పేరు ద్వారకామాయి అని అందరికీ తెలియకపోవచ్చు. హిందీ ధార్మిక కవులలో తులసీదాస్ తరవాత వచ్చే పేర్లు కబీర్, రహీమ్లవని అందరికీ తెలుసు. ఇలాటివి వందలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒకే చోట ఒక సంగ్రహారంలో చూపించాలని  నా ప్రస్తావన.

కోట్లు  ఖర్చు తో కొత్త మందిరాలూ, మసీదులూ. చర్చిలూ నిర్మాణం ఆవుతున్నప్పుడు,  వాటన్నిటి నుంచి డబ్బు తీసుకొని ఈ museum నిర్మించవచ్చు. 

మీరేమిటంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here