Photo Credit- Wikimedia Commons (Anumakonda Jagadeesh)

గాభరా పెట్టే గణిత శాస్త్రం

గణిత శాస్త్రంలో వేల సంవత్సరాలక్రింద బాణ భట్ శూన్యం ఒక సంఖ్యగా ప్రతిపాదించిన సమయం నుంచి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. శ్రీనివాస రామానుజం infinityకే కాకుండా భగవంతడికే ఒక లెఖ్ఖ రూపం ఇచ్చీ, శకుంతలాదేవి computer కన్నా వేగంగా గుణించి దేశానికి గర్వకారణం అయ్యారు . వారిద్దరి గురించి అందరికీ తెలిసిందే.‌ కాని వారిని మించిన  తెలుగువారు ఇద్దరు ఉన్నారని ఈమధ్య సామాజిక మాధ్యమాల్లో  viral అయ్యే   వరకూ చాలా మందికి తెలియదు.

 వీటిప్రకారం  కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు లో  1907 లో జన్మించిన  డా. లక్కోజు సంజీవరాయశర్మ తొలిసారి 1928 లో గణితావధానం నిర్వహించారు. అప్పటినుంచి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి, ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు లో పలు ప్రదర్శనలను ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్  మహాసభలు 1928లో నంద్యాలలో జరిగినపుడు, ప్రధాన ఆకర్షణ శ్రీసంజీవరాయశర్మ గారి గణితావధానమే.

ఇంత‌ మేధావి పుట్టుకతోనే అంధుడని చాలామందికి తెలియదు. పుట్టిన తేదీ ఇస్తే, అది ఏ వారము అయిందో చెప్పడం ఇలాటి ప్రదర్శనలలో  మామూలే. సంజీవరాయశర్మ  ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవారు.  ఇది శకుంతలాదేవి కూడా  చెయ్యలేేేేక పోయేవారు.   హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదికపై 2 power 103 ఎంత అంటే దానికి సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు.  ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులు చాలా గంటలు  తీసుకునే వారు.

అలాగే జొన్నలగడ్డ  భానుప్రకాశ్   అనే 20 ఏళ్ళ హైదరాబాద్ యువకుడు London లో Mind Sports  Olympiad గెలిచాడనీ, ఐదేళ్ళప్పుడు జరిగిన ప్రమాదం వల్ల ఒక ఏడాది స్కూలు మానేసి,  సమయం గడపడానికి మొదలెట్టిన లెఖ్ఖలు  అతన్ని ఈ రంగంలోకి తెచ్చాయనీ తెలిసింది.  Maths genius కోసం వెతికీతే ఇతనే కాక చాలా మంది mathsలో ప్రవీణులు ఉన్నారని తెలిసింది.

కాని మనదేశంలో అన్ని రాష్ట్రాలలో స్కూల్ ఫైనల్ పరీక్షల్లో అందరి కన్నా ఎక్కువ లెఖ్ఖల్లోనూ,  గ్రామీణ విద్యార్థులైతే లెఖ్ఖలూ,  ఇంగ్లీషు లోనూ ఫైయిలవుతారనీ, లెఖ్ఖలంటే భయం లేనివారు తక్కువనీ అందరికీ తెలుసు.  దీనికి ప్రధానమైన కారణం ఈరెండిటినీ మన పాఠశాలల్లో నేర్పే విథానం. గణితశాస్త్రం  శాస్త్రాలన్నిటిలోనూ ముఖ్యమైనదనీ,  చాలా చక్కనిదనీ, ఇది తర్కశాస్త్రం (philosophy) లో భాగమనీ పిల్లలకు తెలియదు.

A square + B square నేర్చుకోడం దండగ అనీ, జీవితంలో  దాని ఉపయోగం ఏమీలేదు అనీ అందరు భావిస్తారు. దాన్ని నేర్పే విథానం అందరికీ (నాకు కూడా) గుండె దడ పుట్టిస్తుంది. గణితంలో  BAపై డిగ్రీలు ఒకప్పుడు philosophy డిగ్రీలుగా ఉండేవి. రామానుజం ప్రకారం గణీతంతో దేముడిని కూడా తెలుసుకో వచ్చు. ఆటపాటలతో గణితం నేర్ప వచ్చు. ఇప్పటికే మనం గణితంలో అమెరికన్ కన్నా ముందు ఉన్నామని ఆ దేశంలో నమ్ముతున్నారు.

లెఖ్ఖలు నేర్పే విధానం మీద కొత్త పరిశోధనలు చేసి గణిత శాస్త్రం మీద ఆసక్తి పెంచి ఆ చదువుని ప్రోత్సహిస్తే మనదేశం తిరిగి అగ్రస్థానం కి చేరవచ్చు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here