www.theTelugus.com

పెన్యురీ పట్నం- 3 By Someswar Bhagwat

సుమారు 40 ఏళ్ళకింద.మైసూరు పత్రకారితా విభాగం (journalism department) లో మాట్లాడమంటే రెండు శీర్షికలు తీసుకున్నాను:  (1) ‘పత్రకారులు దివి నుంచి దిగి వచ్చారా?’ (2)భారతీయ సంస్కృతి వైపు మన ప్రయాణం’ (‘Are journalists made in heaven?’ and ‘Towards a culture of Indian journalism’).

జర్నలిస్టుల స్వర్గంలో పుట్టలేదు, కానీ వారు ఇలాటి  విభాగాల్లోనూ తయారు కాలేదు’. అవి  ఒకవేపు కొత్త విద్యార్ధిని వేస్తే మరోవైపు పత్రకారులని పంపించే మిషన్లు కావు.   మన దేశఫు పత్రికా  రంగానికి ఒక గొప్ప చరిత్ర‌,  సంస్కృతి ఉన్నాయి. 

ఒకప్పుడు అర్ధాకలితో ‘పెన్యురీ’ (బీదరికం)లో ఉండి కూడా స్వతంత్రతా సంగ్రామంలో ముందుండే పత్రకారులు  ధన వ్యామోహంలో పడి ఇప్పడు  నైతిక విలువల్ని మరిచిపోయే దశ వచ్చిందనీ, వారి కొత్త సంస్కృతిలో  ‘news is sacred, comment is free’ అనే మౌలిక సూత్రం కను మరుగవుతున్నాదని చాలామంది అంటున్నారు. కానీ ఈ నైతిక పతనం ఈ రంగానికి పరిమితం కాదు.

అన్ని రంగాల్లోనూ విలువలు పడిపోయి వినియోగదారువాదం(cosumerism) వ్రజ్వలిస్తున్న విషయం  అందరూ ఒప్పుకుంటారు. పత్రకారులు మాత్రం ప్రవాహానికి ఎదురీత ఎలా చెయ్యగలరు?    వారు కూడా ఈ సమాజంలో ఒక భాగమే కదా?    . దానికి ఒకటే.జవాబు. ఎంత ఒత్తిడి వచ్చినా‌ సమాజం ఏ  ప్రలోభాలు  చూపించినా వాటిని ఎదుర్కోడం పత్రకార్లకి చాలా అవసరం. కారణం పత్రికావ్యవసాయం‌.

విద్యా వ్యవస్థ రెండు మనసుల మీద తిన్నగా ప్రభావం చూపించి తద్వారా సమాజం ప్రయాణించే దిశనే మారుస్తాయి. . వీటివల్ల జనం ఆలోచించే విధానం, ‌ తద్వారా వారి చేతలు.మారవచ్చు. రెండో శీర్షిక కూడా ఈ విభాగాల గురించి ఆలోచించే విధానం మీదే. మన జనమాథ్యమ విభాగాల్లో ఇంగ్లీషు పత్ర ప్రపంచంగురించి చాలా నేర్పుతాం.

మన విద్యార్థులకి Washington Post   గురించి తెలుసు.New York Times తో  Herald Tribune ఎలా విలీనం అయిందో తెలుసు. అమెరికాలోని  ఏ ఊరి పేరు చెప్పినా  అక్కడి ముఖ్య పత్రిక పేరు చెప్పగలరు.  Philadelhia లో Observer, Boston లో Globe. Alantaకి Joural Constitution ఇలా కాని ఒడిసాలోనేనా.  మలయాళం భాషలోనైనా ప్రముఖ దినపత్రికల పేర్లు తెలియవు.- Mary Baker-Eddy    Christian Science Monitor స్థాపించిన విషయం తెలసు‌, కానీ ఆంథ్ర పత్రిక ఎవరు, ఎక్కడ మొదలెట్టారో ఆంథ్రలోనే.తెలియదు.

హైదరాబాద్ లోనే షోయబుల్లా ఖాన్ 20  ఏళ్లకే సంపాదకుడై  నీజాం రాష్ట్రం (ఇపుడు తెలంగాణ) పాకిస్థాన్  లో కలపడానికి  వేసిన రజాకార్  (ఇప్పటి MIM) కుట్రని  వ్యతిరేకిచింనందుకు దారుణంగా హత్య చెయ్యబడ్డాడని‌,  చేతులు రెండూ ఖండించబడ్డాయని నేను.ఆ ఊరిలో ఎప్పుడూ వినలేదు. ఆలాగే C. Y. Chintamani 18 ఏళ్లకే ఒక పత్రిక సంపాదకుడు ఐన విషయం మన జనసంవాద విభాగాలలో చెప్పరు.

అన్ని రాష్ట్రాలలో ఈ విభాగాలు ఉన్నాయి. వాటిని నియంత్రించి బాగు పరచాలని .ఎన్నో సార్లు రాసినా  ఎవరూ.పట్టించుకోలేదు.షోయబ్ శత వార్షికోత్సవం 2020లో  వచ్చినా ఏరకం ఉత్సవం లేదు – రాజకీయాల వల్ల (MIM అధికార పార్టీకి మద్దతు ఇస్తూ  ఉండడం వల్ల). ఉస్మానియా జనసంవాద విభాగంలో ఒక పారితోషకం ప్రొ. బషీరుద్దీన్  నెలకొల్పారు.

చాలా విభాగాల  పాఠ్యక్రమం (syllabus) మరో విభాగం..కార్బన్ కాపీ.. ఇంజనీరింగ్ చదువు AICTE నియంత్రణలో ఉంది.. అలాగే జన మాథ్యమ విభాగాలకి షోయబ్.పేరున ఒక నియంత్రణ సంఘం (అతను సంపాదకుడిగా హత్య చెయ్యబడ్డాడు) ఎందకు నియమించరు?

(నా పుస్తకం A TOWN CALLED PENURY-The Changing Culture of Indian Journalism ఒక భాగం అనువాదం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here