www.theTelugus.com

‘పెన్యురీ’ అనే పట్నం -21

 By Someswar Bhagwat

తోబుట్టువులు అరుదు; తమ పిల్లలు ఇంకా తక్కువ-2

అన్నతమ్ములు ఒకే వృత్తిలో ఉండడం గురించి రాస్తూ ఉంటే హెన్రీ సెసిల్ (Henry Cecil) హాస్య పుస్తకం  Brothers in Law ఎలా మనసులో కదులుతుందో అలాగే నంఢూరి రామ మోహన్రావు అతని తమ్ముడు పార్థ సారథి జ్ఞాపకం వస్తారు. తెలుగు పాఠకులకు రామమోహనరావు వల్ల మార్క్ ట్వైన్‌, ఆర. ఎల్. స్టీవెన్సన్ వంటి గొప్ప రచయితలు, science fiction, మన సంస్కృతి వంటి చాలా విషయాలు ఎన్నో దశాబ్దాల ముందే తెలుసు. మంచి అనువాదకుడూ. రచయితే కాక ఎన్నో తెలుగు పత్రికలలో పనిచేసి ఆంధ్లజ్యోతి దినపత్రిక సంపాదకుడుగా రిటైర్ అయారు. నాకు పరిచయం ఉన్నప్పుడు పార్థసారథి ఆంధ్రప్రభ  విషేష సంవాదదాత. ముందః ఎక్కడో తరవాత ఎక్కడో.


అలాగే ఆరోజుల్లో మరికొందరు అన్న తమ్ములు పత్రికలలో పనిచేసేవారు. ముగ్గురూ ఒకే పని చెయ్యడం ఇంకా ఆరుదు – TV పరశురాం వాషింగ్టన్ లో TheIndianExoressప్రతినిధి ఐతే  తమ్ముళ్ళు TVV, TVS, వార్తాసంస్థలు PTI, UNIలలో ఉండే వారు..


ఈ సంస్థల్లో మొదటి రోజునుంచి రిటైర్ అయేవరకు వ్రతి పత్రికర్తా తమపేరి పొడి అక్షరాలు మాత్రమే వాడుతుంటారు. TVV పేరు వెంకటెశ్వరన్ ఆనీ,TVS అంటే సత్య నారాయణన్ అనీ వారే మరిచిపోయి  ఉండవచ్చు. భాగవతుల సోమేశ్వర్ రావ్ అంటే ఎవరికీ తెలియదు కాని  BSR  ఆంటే కొందరికేనా తెలిసి ఉండవచ్చు.

ఈ సంస్థల్లో  ప్రతివార్తా takesలో  ఉంటుంది – చిన్నదైతే  ఒకటి పద్దదైతే ఎన్నో.  ప్రతి  take  ఆఖరినీ కొన్ని పొడి ఆక్షరాలుంటాయి. మొదటి మూడూ రాసిన వారివి. తరువాత మూడూ ఎడిట్ చేసిన మనిషి. ఆ తరువాత మూడు అది పంపిన వ్యక్తివి. (పాత రోజుల్లో teleprinter operator వి‌. ఈ రోజుల్లో కంప్యూటర్ ఆపరెటర్ వి  ఐ ఉండవచ్చు. కొందరు రెండే  అక్షరాలు వాడతారు). మీరు దినపత్రికలో చేరి ఏజెన్సీ వార్త చూస్తే ఎవరు రాసేరో ఇలా తెలుసుకోవచ్చు. 


అన్నతమ్ముల లిస్ట్ ఇంకా ఉంది. R.K. Karanjia ఒకపత్రిక Blitz నడిపే వారు అతని తమ్ముడు బి. కె.కరంజియా Filmfareలో ఉండి సంపాదకుడు కూడా అయారు. కార్టూన్ పత్రికారుడు RK Puri, Hindustan Tumes లో assistant editor Rakshat Puri  అన్నతమ్ములు. అప్పుడు The Statesman ఫొటోజర్నలిస్ట్ Raghu Rai అన్న TheIndian Express ఛౌఫ్ఫొటోగ్రాఫర్ S Paul. ఆజ్  వారనాసి (అప్పుడు  బెనారస్) సంపాదకుడు విద్యొభాస్కర్ తమ్ముడు నాగపూర్ లోనినవభరత్ అసలు  సంపాదకుడు (పేరుకి యజమాని సంపాదకుడు) భీష్మ్ ఆర్య అన్న తమ్ముళ్లు. ఈ విద్యాభాస్కర్  తెలుగువాడని ఎవరికీ తెలియదు.

సాధారణంగా దక్షిణ  భారతీయులు సఝమ్యులు‌, ఎవరతజనూ తగాదా పడరు. ఆజ్  అప్పుడు హిందీలో ముఖ్య పత్రిక.  దాని  యజమాని ఒక సేఠ్జీ. ఐతనికి ఇతను ఏదజరాస్తే కోపం వచ్చిందట. ఓరోజు ఆయన ఆఫీసుకి వస్తే అతని కుర్చీ జాగాలో లేదుట. అక్కడి చప్రాసీ గది ఊడవడానికి తీశాడేమో అనుకుని అతన్ని పిలిచి అడిగితే చెప్పాడుట.

“సేఠ్జీ కోపం మీద ఉన్నారు.. మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించానని.నన్ను కుర్చీ తీసెయ్యమన్నారు‌,” అని. పాపం ఆ తెలుగగు బ్రాహ్మడు శాంతంగా ఇంటికి వెళ్లారు  ఆసంగతి నిమిషాల్లో ఊరంతా పాకిపోయి ఊరిలోని కొందరు పెద్దలు సేఠ్ కి ఫోన్ చేసారుట. “ఆజ్ ఒక కిరాణా కొట్టుకాదు. ఇప్పుడు హిందీ లో ప్రముఖ  పత్రిక. ఈ విషయం పెద్ద చర్చలకి దారితీస్తుంది.. అందరూ.మీది తప్పు అంటారు,” అని.


అప్పుడు ఆ సేఠ్ అతని ఇంటికి వెళ్ళి, నచ్చ చెప్పి ఆఫీసుకి తీసుకెళ్లారని అంటారు. నాకు ఈవిషయం గురు తుల్యులైన భీష్మగారినుంచే తెలిసింది. ఏ పుస్తకం లోనూ లేకపోడం ఆశ్చర్యం.
జర్నలిసం తెలియడానికి ఇలాటివన్నీ తెలియాలి. లేకపోతే దాని art and craft మాత్రం తెలుస్తాయి‌ దాని సంస్కృతి,  spirit, కాదు.


అందుకే ఈ పుస్తకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here