నేను అత్యావశ్యక పరిస్తీతి (ఎమర్జెన్సీ) వల్ల మొదటిసారి (అప్పటి) ఆంధ్ర ప్రదేశ్ వచ్చి ఒక హైదరాబాద్ ఇంగ్లీషు పత్రికలో రోజల్లా పనిచేసి, కొద్దిగా తలనొప్పివల్ల ఎంతో దూరం ఏదేనా మాత్ర కొనుక్కుందామని నడిచి వెళ్ళాను, మందుల దుకాణంలో కోసం. కానీ నాంపల్లి నించి అబిడ్స్ వరకూ ఎంతదూరం వెళ్లినా “మందు” (liquor) దుకాణాళే కాని మందుల దుకాణాలు కనిపించలేదు –. కొన్ని ఏళ్ల తరవాత టి. అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చెన్నై పత్రికవాళ్లు రాయమంటే అతని వ్యాఖ్యమీద ఒక వ్యాసం రాసేను: Andhra’s Kallu Munta Economics అని. మధ్య నిషేధం మంచిదే కాని దానివల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం వస్తుందని, excise duty లేకపోతే రాష్ట్ర ఆర్ఠవ్యవస్థ దెబ్బతింటుందనీ ఆయన అన్నారు. కళ్ళు అమ్మడవల్ల వచ్చే ఆదాయం మన రాష్ట్రానికి ఎంతముఖ్యమో అతను చెప్పారు. అప్పటినుంచి ఇప్పటివరకూ మన అర్థ వ్యవస్థలో ఏమీ మార్పు రాలేదు. కోవిడ్-19 మహామారి వల్ల మూతపడిన కళ్ళు దుకాణాలు మళ్ళీ తెరిచినప్పుడు కనపడిన దృశ్యాలు మరపురానివి. తెలంగాణ, ఆంధ్ర, ఢిల్లీ, కర్ణాటక, మహార్ష్ట్రలలో మూతపడిన కళ్ళు దుకాణాలు తెరిచినప్పుడు సామాజిక దూరం ఎవరూ పాటింకుండా, వేల సంఖ్యలో, ఆ దుకాణాల ముందు ప్రజలు బారులు తీర్చారు. అందులో స్త్రీలు కూడా కనిపించేరు. నేను 1967లో బొంబాయిలో పనిచేస్తున్నప్పుడు ఒక సహసంపాదకురాలు (lady Assistnat Editor) నేనుండే గది దగ్గరే ఉన్న ఒక వయిన్ షాపలో రోజూ ఒక సీసా కొనుక్కుని వెళ్ళేది. కానీ ఆపని ఎంతో దొంగతానంగా ఎవరూ చూడకుండా చేసేది. అంటే ఒకప్పుడు తాగడమంటే తప్పు అనే భావన ఉండేది. ఇప్పుడు అది ఏమాత్రం సిగ్గుపడవలసిన విషయం కాదనమాట. కల్లుదుకాణాల ముందు ఉన్న తోపుడు, వేలమంది గుమికూడడం, అందరూ దూరం పాటించకుండా కలియపడటం వల్ల కొన్ని ఊళ్ళలో దుకాణాలు మళ్ళీ మూయవలసి వచ్చింది. అంతేకాదు. తాగుడువల్లే అర్థవ్యవస్థ మళ్ళీ పుంజుకుంటున్నదని కొందరు రాసేరు. అంటే మనదేశంలో ఏదేన మంచి కార్యక్రమాలు (ముఖ్య మంత్రికి నెలకి 4.5 లక్షలు జీతం ఇవ్వటం లాంటివి) చెయ్యాలంటే తాగుడు ఇంకా ఎక్కువ అవాలనమాట. స్కూలు పాఠ్యపుస్తకాలలో వేరు వేరు మందులపేర్లు, వాటి విశేష గుణాలూ నేర్పించమని కూడా కొందరు సలహా ఇవ్వొచ్చు. కల్లు, అలాగే తక్కిన లీకర్ల తయారీ గురించి కొత్త చదువులు కూడా మొదలెట్ట వచ్చు. ఎవరు ఎన్ని పెగ్గులు తాగగలరో అని పోటీలు పెట్ట వచ్చు. సినిమాల్లో, నాటకాల్లో, తాగుపోతు వేషాలు బాగా వేసీన వారికి బహుమతులు ఇవ్వవచ్చు. ఆలోచిస్తే ఇంకా చాలా ఇలాటి విషయాలు తట్టవచ్చు. మద్ధ్య నిషేధం గాంధిగారికి చాలా ప్రీతి. స్వతంత్రతా సంగ్రామంలో కళ్ళు దుకాణాల ముందు picketing కూడా చేసేవారు. ఇప్పుడు ‘మహాత్మా గాంధీ వైన్ షాప్’ తెరిచే సమయం వచ్చింది. ఒక్క రాబడికోసమే కల్లుని ప్రోత్సహించితే అదే విధంగా సంపాదన ఎక్కువ చెయ్యడానికి ఇంకా దార్లు వెతక వచ్చు. తాగుడు ఎంత చెడ్డదయినా కొన్ని హాస్య సన్నివేశాలని కూడా కూడా సృష్టించుతుంది. మరాఠీలో ఒక గొప్ప రచయితా, నాటకకారుడూ, సినీ నేర్దేశకుదూ, ప్రద్ధ్యాపకుడూ, కవీ అయిన పీ. కె. ఆత్రే తక్కిన మరాఠీ వారిలా తనపేరు రాసుకోరు. మరాఠీలో ఇంగ్లీషులోలా కాక ప్ర. కే. ఆత్రే అని రాయాలి, ఎందుకంటే అతని పేరు ప్రహ్లాద్ తండ్రిపేరు కేశవ్ కాబట్టి. అలాగే పురుషోత్తమ్ లక్ష్మణ్ దేశపాండె పు . ల. అనే రాసుకుంటారు. ఆత్రే మాత్రం ఇంగ్లీసులోలా P.K. అనే రాసుకుంటారు. అత్రే గారికి తాగుడు బాగా అలవాటు. పీకే అంటే తాగిన అని అర్ధం. తనాపేరుమీదే జోక్ వేసుకుంటూ “తాగినా అత్రే, తాగకపోయినా అత్రే” అని చెప్పునేవారు, అతని పేరుపడ్డ నాటకం ‘ఎకచ్ ప్యాలా’ (మరొక్క ముంతడు). తాగుడు అలవాటయిన ప్రతిమనిషీ అడిగేది ఓకటే – మరొక్క పెగ్గు. విషాద గీతాలకి పేరు పొందిన కన్హయ్యా లాల్ సెహగల్ తాగుడు లేకపోతే అతని గొంతులో అంత మధురిమ ఉండేది కాదేమో. తాగుపోతు వేషాలవల్ల కేస్తో ముఖర్జీ వంటి సినీ నటులు పేరు గణించుకున్నారు. తాగుడు లాగే దొంగతనాలూ, హత్యలూ తక్కిన నేరాలూ కూడా డబ్బు కడితే చేయనివ్వవచ్చు. “పోలిసు స్టేషన్లో రెండు లక్షలు కడితే వారంరోజుల్లు ఎప్పుడేన ఎవరినేన చంపవచ్చు” అనికానీ “లక్ష కట్టు, దొంగతనం చెయ్యి” అనీకానీ ప్రకటనలు చేసే రోజులు రావొచ్చు. అలాచేస్తే జనాభా తగ్గుతుంది, పోలీసువాళ్లకి నేతలముందు తోకలు ఊపడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. ఇప్పుడు కొంతమంది పోలీసులు చేసే పని అదే కదా. |