ప్రతిజ్ఞ
సూర్య దేవ అభివందనములు
మహాదేవ సాష్టాంగ ప్రణామములు
సకల దేవతలారా వందనములు
ప్రకృతి మాతకు
పాదాభివందనములు
మానవ లిఖిత జీవితమందు సంతుష్టుడనైతి మధురానుభూతులనెన్నో పొందితి
కష్ట నష్టముల అనుభవించితి
ఎన్నో పరీక్షల ఉత్తీర్ణుడనైతి
ఉన్నతశిఖరములనెన్నో అధిరోహించితి
జన విజ్ఞాన సంపద మెండుగానొందితి
ప్రకృతి నుండి దూరమైతిని
వికృత జీవనానికి బానిస నైతిని
కనువిప్పు గాంచితి
ప్రకృతి వైపే ప్రయాణము బూనితి
నీవే తోడని నీవే సర్యమని
నిన్నే తలచి ముందుకు పోవుదు
భారము నీపైనే ప్రకృతి మాతా
ప్రకృతి లోనే శేష జీవితము గడుపుదు
హరిత వనఁబుల అభివృద్ధి చేయుదు
వ్యవసాయమున మెలకువ నేర్చుదు
మానవాళిని ఉత్తేజ పరచుదు
ప్రకృతి వైపే పయనింప చేయుదు
మనమున దృఢ సంకల్పం నింపితి
మానవ కల్పిత వాయు కాలుష్యము
భయంకరమైన పోగలతో నిండెను
ఆకాశమంత వణికించు ప్రకంపములు
విద్యుత్ అయస్కాంత తరంగములూ
నీటినంతా ప్రమాదకరమైన రసాయములతో నింపెను కుళ్ళనంతా నీటిలో కలిపెను
భూమిలోని ఎన్నోపోరలలో కలుషితమైన మందులు నింపెను
భూగోళ మంతా వేడిమి పెంచెను
ప్రకృతిలోని జీవులన్నిటిపై రాక్షతత్వమును ప్రదర్శించెను
ప్రకృతిలోని వికృత జీవిగా మనుజుడీనాడు అవతరించెను
ప్రకృతిలోని వికృతినంతా
నశింపచేసే ప్రతిన బూనితిని
దారి చూపి లోక కళ్యాణంబునకు
నను వినియోగించి జన్మసార్ధకతను చేకూర్చవమ్మ ప్రకృతి మాతా.
ఇట్లు
నీ పుత్రుడు
ప్రకృతి ప్రియుడు
రాళ్లబండి కృష్ణ మోహన్ రాజు