ప్రకృతి వైద్యం పరమ సౌఖ్యం సర్వరోగ నివారణ క్షేత్రం
సరళమైన ఆహార నియమం సహజమైన చికిత్స నిలయం
యోగాసన ముతో నిత్యం ఆరంభం
మర్దనతో నొప్పులు మటుమాయం
ఆవిరి స్నానం అవయవ క్షేమం
మట్టి స్నానము తో మలినము సూన్యం
వేప స్నానం చర్మ సౌందర్యం
తోటి స్నానము తో ఉదరము పదిలం
వ్యాయామ చికిత్స అద్భుత ఫలితం
శుద్ధ ప్రక్షాళన ప్రత్యేక ఫలితం
అధిక బరువు అవలీలగా తరుగు
రక్తపోటులో తగ్గును ధీటు
మధుమేహులకు పరిధిలో మధురం
మూత్రపిండములు పూర్తిగా శుభ్రం
పక్షవాతానికి శాపవిమోచనం
గుండె వ్యాధుల గూగుల్ ఇక మాయం
ఊపిరితిత్తుల శక్తిక మెరుగు
కీళ్ల నొప్పులు తప్పక కరుగు
చర్మవ్యాధులకు చెల్లును చీటీ
నడుము నొప్పులు నశించు నశించు
వ్యాధి నిరోధక శక్తిగా పెరుగు
ఒత్తిడి అంతా పూర్తిగా తొలగు
మొత్తంగా తనువంత భద్రం భద్రం ఆరోగ్యవంతం.
మనసంతా సంతోషం ఆహ్లాద వంతం.
ఇట్లు
మీ ప్రకృతి ప్రియుడు
భట్రాజు
రాళ్ళబండి కృష్ణమోహన రాజు