visual exp
Ashram

కొవ్వొత్తి ఆర్పకు, దీపం వెలిగించు 

వ్రుధ్ధాశ్రమంలో పుట్టినరోజు ఒక పండుగ  కాదు.  అది తిరుగులేని, త్వరలో రాబోతున్న అంతానికి. ఒక సూచన. కాబట్టే అలాంటి చోట్ల ఆసంబరాలు అరుదు. కాని ఈమధ్య ఒక  ఆశ్రమంలో ఒకటి కాదు, రెండు కాదు, పది పుట్టినరోజులు చాలా ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి.

రమణ మహర్షి   ఆశ్రమంలో కొత్తగా చేరిన ఒక  విశ్రాంత  సైనిక అథికారి  పుట్టినరోజు అది. ఆశ్రమం నడుపుతున్న శ్రీనివాస రెడ్డి గారికి తట్టింది — దేశంకోసం  ప్రాణాలు అర్పించే వీరుల  త్యాగాలకి నివాళులర్పించడానికి ఇది ఉత్తమ తరుణం అని.  అదీ కాక కోవిద్ మహామారి వల్ల మూడు నెలల్లో ఏ పుట్టినరోజూ జరగలేదు.  కాబట్టి ఆనెలలో వచ్చిన మరో తొమ్మదిని కలిపి పదిమందికి ఒకే సారి శుభాకాంక్షలు తెలపాలని అనుకుంటున్నారు.

ఆ ఆశ్రమం తక్కిన చాలావాటిలా  చావుకి విచారంగా ఎదురుచూస్తూ ‌ బతికే జాగా కాదు, ఆఖరి రోజులు ‌సంతోషంగా అందరితో  సఖ్యంగా నవ్వుతూ హాయిగా ఉండాలని ఆ రమణమహర్షి భక్తుడు కట్టించి నడుపుతున్న చాల అందమయిన భవనం. అందుకే సామూహికంగా ఆ పండుగ జరిపారు.ఇంగ్లీషు వారిని అనుకరిస్తూ పుట్టిన రోజునాడు కొవ్వొత్తులు ఆర్పడం మనదేశంలో అలవాటు. మన నంస్కృతిలో దీపం ఆరిపోడం చావుకి సంకేతం.  మన సినిమాలలో ఎప్పుడూ మ్రుత్యువుకి ఇదే సంకేతం వాడతారు. మనం ఏదేనా శుభకార్యం మొదలు పెట్టాలంటే దీపం వెలిగిస్తాం.

రమణమహర్షి కన్నా ఎక్కవ భారతీయ సంస్కృతికి ప్రతీక మరెవరూ లేరు.అందుకే ఆరోజు ఆ పదిమంది వ్రుధ్ధులూ కొవ్వొత్తులు ఆర్పలేదు. రెడ్డి గారు ఆ పుట్టినరోజు పండుగకీ స్వయంగా రావడమే కాకుండా పదిమందిచేతా cake కోయించి అందరికీ ఖరీదైన పూల గుత్తులు ఇచ్చి పది  పెద్ద ప్రమిదలలో దీపాలు వెలిగింప జేసేరు. ప్రతి ప్రమిదలో 101 వత్తులు ఉండేవి … అందరూ నూరేళ్ళకన్నా ఎక్కువ జీవించాలనే శుభేఛ్ఛ వ్యక్తం చేస్తూ. మన సంస్కృతి ఇంకా బతికే ఉందని బెంగళూరులో  ఉండే ఒక తెలుగు వ్యక్తి చూపించారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here