ప్రకృతి నివాసం
By R.K.M.Raju
ప్రకృతి నివాసం ప్రశాంత జీవన వాసం
సకల మత సమ్మిళితం సర్వభాషా నివాసితం
నగరానికి కొంత దూరం ఆత్మీయతలు అలరు
అలల తీరం
సకల ఫల పుష్ప జీవరసం అన్ని జీవులకిదియే ఆవాసం
అల్లిబిల్లి కలతలతో రోజువారీ జీవితం
కానీ కలిసి కట్టుగా దిట్టైనా సహవాసం
ఆరు వందల కుటుంబాల ఈ అరుదైన వనవాసం
ఇస్తోంది వేయి ఏనుగుల బలమైన ఆత్మ విశ్వాసం
సర్వ దేవతా విశిష్ట పూజా ప్రదేశం సకల దేవతల కృపా కటాక్ష రక్షిత క్షేత్రం
సకల వసతుల సమ్మిళితం ఇది ప్రపంచానికే తలమానికం
ఇదే నా ప్రకృతీ నివాసం