Photo Credit: SOBHA

మా తెలుగు తల్లికి మల్లె పూ దండ

ఓ మొన్న ఆగస్టు10వ తారీఖున శంకరంబాడి సుందరాచార్య  గారి  జయంతి.  ఆ తేదీన 1918లో ఆయన పుట్టారని  దిన పత్రికలలో  ఓ మూల చిన్న అక్షరాల్లో పడిన అతి చిన్న వార్త చదివిన వారికి మాత్రం తెలుస్తుంది కాని అతనెవరో చాలా తక్కువ మందికి తెలుసు.

ఢిల్లీ పత్రకారుడిగా నేను మొదటి మాటు హైదరాబాదు మొదటి ప్రపంచ తెలుగు మహాసభ కి 1975 ఏప్రిల్ లో వెళ్ళక ముందు ఢిల్లీ లో ఒకటి రెండు సార్లు చూడ్డం వల్ల ముఖ పరిచయం ఉండేది. మహాసభ కి ముందు రాత్రి విద్యాశాఖ మంత్రి మండలి క్రిష్ణారావు మాకు  సభ తయారీ లు చూపించడానికి లాల్ బహాదుర్  స్టేడియం  చుట్టూ   తిప్పుతూ ఉండగా నేను అడిగాను,  ” ఎప్పుడైనా  మీరు  ‘మా తెలుగు తల్లికి మల్లె పూ దండ’  పాట విన్నారా?”  అని.  అతను నవ్వి ఆ పాట తెలియని తెలుగు వారు  ఉండరు,  అన్నారు. మహా సభలు ఆ పాట తోటే ప్రారఃభమవుతాయనీ, ఆ పాట పాడ డానికి లండన్ నుంచి టంగుటూరి క్రిష్ణకుమారిని చాలా ఖర్చు పెట్టి తెప్పించినాము  అని  కూడా చెప్పారు. మరి ఆ పాట రచయితని రేపు సత్కరిస్తున్నారా? అని ఎవరో అడిగారు. సత్కరింపబడే వారి జాబితా లో అతని పేరు లేదు.

“అతను బతికే ఉన్నారా? పోయారనుకున్నాం,”  అని మండ అని అంటే,  “లేదండి. అదుగో ఆ చెట్టు కింద పడుక్కున్నారు,” అని ఒక బీద బట్టల లో ఉన్న వ్యక్తిని చూపిస్తే మంత్రిగారు ఆశ్చర్య పోయారు.  ఆతరవాత  అతని పేరు జాబితా లో చేర్చబడింది.  జర్నలిస్టులు మరొకరికి ఎవరికీ ఎక్కువతెలుసని ఒప్పుకోరు కదా, ఒక స్థానిక పత్రకారుడు అడిగాడు; “మీకెలా తెలుసు?””

అప్పుడు చెప్పాను,  “అతను ఆర్థికంగా చాలా దీనస్థీతిలో ఉన్నా చాలా ఆత్మాభిమానం కలవాడు.  ఉట్టినే డబ్బులిస్తే తీసు కోడు.  అతని బంధువు ఒకరు National Physical Laboratory (NPL) లో మాబంధువుతో  కలిసి పని చేస్తున్నారు. కాబట్టి అతను ఢిల్లీ  వచ్చినప్పుడు తెలుగు వారు అందరూ చందాలేసుకుని సత్కారం పేరున అతనికి బహూకరించారు,” అనీ, అందుకే అతన్ని పోల్చాననీ.

ఈ మధ్య ఎవరో నాకు ఒక article పంపారు. దానిలో  వేరేగా ఉంది. ఆ పాట అవుతున్నప్పుడు అందరికీ వెనక మాసిన బట్టల తో అతను నిలబడి  ఉన్నారని. జరిగినది పత్రికల్లో రాకపోడంవల్లే తెలియక పోవచ్చు. ఉద్యోగం కోసం వెళ్లిన  ఆ అభ్యర్థిని  “నీకు తెలుగొచ్చా” అని అడిగితే, “ఏం మీకు తెలుగు రాదా” అని జవాబిచ్చి ఉద్యోగావకాశం  పోగొట్టుకున్న మహానుభావుడు.

 ఆ ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి ‘దేశోద్ధారక’ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా ఎదురు ప్రశ్నించింది శంకరంబాడి సుందరాచారి. ఒక ఉన్నతాధికారి తిరుపతి వచ్చి చేతి సంచి  ఇతన్ని మొయ్యమంటే.నేను  ఆఫీసు జవాను కాదు  అని వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆత్మాభిమానం కలవాడు. దేనికోసం — ఉద్యోగం కోసం, హోదా కోసం, పేరు కోసం —  ఎప్పుడూ ఎవరినీ యాచించని  మనిషి. 

తిరుపతి లో కమలమ్మ, రాజగోపాలాచారి దంపతులకు ప్రథమ సంతానం గా పుట్టి, తిరుపతి దేవస్థానం ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, అనీబిసెంట్ గారి మదనపల్లె బెసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చేశారు. తిరుపతి  ఆంధ్రపత్రిక కార్యాలయంలో పనిచేశారు.  ఆంధ్ర పత్రికలో కళావని శీర్షిక అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. చిత్తూరు బోర్డు హైస్కూలులో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రెండేళ్లు సెలవు పెట్టి చిత్తూరు నాగయ్య ప్రోత్సాహం తో ‘దీన బంధు’ చిత్రానికి మాటలు, పాటలు రాశారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌ పదవిని   విద్యాశాఖ డైరెక్టర్ చేతి సంచి అందించి అవమానించినందుకు నిరసనగా  రాజీనామా చేసేరు. 

పన్నెండో ఏటనే తెలుగులో కవిత్వం రాయటం మొదలెట్టి గేయ, గీత, బుర్రకథ, నాటక, ఖండ కావ్య, కథలు,   ఉపన్యాసాలూ రాసేరు.   నాస్వామి, గీతాంజలి.   కెరటాలు, సుందర సుధాబిందువులు, గాలిమేడలు, అరాచకం , బుద్ధగీత, ఏకలవ్యుడు, శాంతి దూతలు, రంగిరాస్యం రచించారు, కాని పెరుపొందినది  ‘మా తెలుగు తల్లికి’ పాట మాత్రం. అతని చివరిరోజులు చాలా దుర్భరం గా గడిఛాయి. తిరుపతి లో  భికారిలా  తిరుగుతూ బతికేరు.

నేనింతకి ముందు రాసినట్టగా ‘మాతెలుగు తల్లికి’  చాలా గొప్ప పాట. తెలుగు వారు మూడు తరాలు ఈ పాట వింటూ పెరిగారు. అందులో ప్రతి పదం చాలా సరిగా పడింది. వేల సభలు ఆ పాటతో మొదలయాయి. 

రెండు మూడు తరాల  లక్షలమంది కి అక్కయ్య, అన్నయ్యా ఐన న్యాపతి దంపతులు రేడియో బాలానందం progrrame లో వందల మంది పిల్లలచేత ఈపాట పాడించే ఉండా‌‍లి.  ప్రతి తెలుగు రేడియో స్టేషన్ ఈపాటని రోజు కి కనీసం ఒకసారేనా  ప్రసారం చేసింది. కృష్ణకుమారి ఈ పాట రాయాల్టీలమీద ఎంతో ఆర్జించి లండన్లో స్థిర పడ్డారు. కాని సుందరంచార్య మాత్రం శాలువ కొబ్బరికాయ  ఇచ్చి సన్మూనం చేస్తే త్రుప్తిపడి రాయల్టీ లు వదులుకని చాలా దీన పరిస్థితుల్లో ఏప్రిల్  8, 1977 న మరణించారు.

‘దేశ భాష లందు తెలుగు లెస్స’ అని, తెలుగులో ఆముక్తమాల్యద వంటి మహా గ్రంధం రాసిన చక్రవర్తి శ్రీక్రృ‌‌‌‌‌‌‌ష్ణ దేవ రాయలు  కన్నడ భాషీయుడనీ, మన తెలుగు తల్లికి ఇంత మంచి మల్లెఫూదండ అర్పించన  సుందరాచార్య  తిరుపతిలో స్థిరపడిన   ఒక తమిళ ఆయ్యంగార్. అనీ చాలా మందికి తెలియక పోవచ్చు. ఈ జయంతి సందర్భంగా అతనికి కోటి కోటి నమస్సులు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here