ధ్యానం
By R.K.M.Raju
ధ్యానమె జ్ఞానము భోగము యోగము సర్వ సౌఖ్యము
శాంతి దాయకము తృప్తి దాయకము
శక్తి దాయకము ముక్తిదాయకము
సర్వ రోగముల దివ్యౌషధము
నేటి మానవ దేహం ప్రకృతి దూరం
వింత రోగముల ప్రత్యేక నిలయం
ధ్యానముతోనేప్రకృతికనుసంధానం
ప్రకృతి ఒడిలో తనువంతా పరవశం
సులువైన మార్గం జీవిత గమ్యం
ఏకాగ్రతతో ధ్యానమే మార్గం
లేదే మంత్రం లేదేతంత్రం
ధ్యానమే ధ్యానం దిన దిన ప్రవర్ధమానం