By R.K.M Raju
ఆయుర్వేదం అద్భుత వైద్యం
ఆయుర్వేదం అద్భుత వైద్యం వనమూలికలతో లేహ్యం చూర్ణం రుగ్మతలన్నీ చిటికలో మాయం ఆరోగ్య మైన జీవన విధానం
ప్రాచీనమైన పవిత్ర వేదాల సారం
ఋగ్వేద సహిత అధర్వణ వేదం
బ్రహ్మ వాక్క గా ధన్వంతర మూలం
సుశ్రుత సంహిత చరక సంహితం
చూర్ణ వైద్యం లేహ్య వైద్యం
కట్టు వైద్యం మర్దన వైద్యం
ఆవిరి వైద్యం ప్రకృతి వైద్యం
చెట్టు వైద్యం నాటు వైద్యం
అన్నింటికీ ఆయుర్వేదమే మూలం
అనాదిగా మన రక్షణ కవచం
భారతీయుల ఆరోగ్య మంత్రం
శాస్త్రీయతల తలదన్నే వైద్యం
ప్రపంచానికే ఆదర్శవంతం తలమానికం