ఇవాళ, ఆగస్టు 29వ తారీకు ‘తెలుగు దినోత్సవం’ అని అందరికీ తెలుసు. ఆరోజు ఎవరు ఎందుకు నశ్చయించేరో ఎవరు ఎక్కడ ఎలా జరుపుకుంటారో దీనివల్ల ప్రయోజనం ఏమిటో మాత్రం చాలామందికి — నాకు కూడా — తెలియదు. అది తెలుసుకోవాలని Google చేస్తే 30 కన్నా ఎక్కువ sitesకి లింక్ లు కనిపిస్తాయి. ఓపిక, సమయం ఉంటే చూడండి.
బయటి రాష్ట్రంలో పుట్టి పెరిగిన నాకు మాత్రం ఒకే ధ్యేయం కనిపిస్తుంది – ఈ అవకాశాన్ని ఉపయోగించి ప్రవాసాంధ్రులు తెలుగు నేర్చుకోవాలని ఒక ఉద్యమం నడప వచ్చు. రెండురాష్ట్రాలూ కలసి కొద్ది ఖర్చుతో వార్ధా రాష్ట్రభాషా ప్రచార సమితి హిందీకీ నడపుతున్నట్టుగా పరీక్షలు పెట్టి. తెలుగు నేర్నిపడానికి కి ఒక సంస్థని నెలకోల్పాలి. ఇప్పుడు తెలుగు పరీక్షలు ఉన్నా అవి దేశవ్యాప్తంగా ప్రచలితం కాదు.
ఇది కాక వ్యక్తిగత ధ్యేయం మరొకటి ఉంది – ఎన్నో దశాబ్దాల కింద ఝార్ఖండ్ (ఇప్పుడు. అప్పుడు బిహార్)లో ‘ప్రవాసి’ అనే పత్రిక ఉండేది. అప్పుడు ఝార్ఖండ్లోని జంషెడ్పూరులో తెలుగు వారు చాలామంది ఉండేవారు. అలాటిదే digital పత్రిక ఒకటి నడపాలని నాఆశ. దీని గురించి ఎన్నిసార్లు ఎన్నో చోట్ల రాసినా, కొందరీకి e-mail చేసినా ఎవరూ స్పందించలేదు. కలిసినప్పుడల్లా ఇంగ్లీషు, లేక హిందీ కాని ప్రాంతీయ భాషలో కాని మాట్లాడే ప్రవాసాంధ్రులకీ ఇది సహజమే కదా? అమెరికాలో లక్షలమంది IT ఇంజనీర్లున్నా తెలుగులో కంప్యూటర్ English keyboard మీద రాయడం కష్టం.
తెలుగు భాషగొప్పదనం గురించి ఎన్నో పేజిలు రాయవచ్చు. ఉడతా భక్తిగా ఇంట్లో నేర్చుకున్న వచ్చీరాని తెలుగు లో బ్లాగ్ లూ, ఇంగ్లీషులో (as most Telugus can’t read Telugu)తెలుగు ప్రపంచం అనే శీర్షిక నూ రాస్తున్నాను.
నా కోరకలు రెండూ నాకు మిగిలిన కొద్ది నెలలో తీరేట్లా లేదు.