Photo Credit- Satya

దినపత్త్రికలు: ఎవరిని నమ్మడం?

ప్రపంచ వ్యాప్తంగా దైనిక సమాచార ప్రపంచానికి ఒక చావు బతుకుల సమస్య వచ్చి పడింది. పాఠకులందరిలోనూ పత్రికా రంగం మీద నమ్మకం పోతోంది. కలంకార్మికుడీగా 16ఏళ్ళ వయసులో ప్రవేశించి 65 ఏళ్ళుగా రాయడమే జీవనోపాధిగా బతికిన నాకూ, నాలాటివారు చాలా మందికీ, పత్రకారూలమని చెప్ఫుకోడానికే సిగ్గుగా ఉంది. ఎఃదుకంటే ఈ రోజల్లో ఏ పత్రికనీ నమ్మలేము.‌

ప్రపంచంలో  రమారమి అన్ని పత్రికల circulation పడి పోతున్నది. చాలా పత్త్రికలు సిబ్బంది తక్కువ చెయ్యడం వల్ల  ఎంతో మందికి ఉద్యోగాలు  పోయాయి. ప్రకటనలు మీద వవ్చే రాబడి కూడా పడిపోయింది. ప్రకటన ఆదాయం ఇప్పుడు TV చానెల్స్, యూట్యూబ్ మాత్రమే కాకుండా  Instagram, blog platforms, digital marketing లాటి ఇంకా ఎందరితోనో పంచుకోవలసి వస్తున్నాది. ‘మందెక్కువైతే మజ్జగ పలచన’ అంటారు కదా‌.  

అగ్రగణ్యులైన Manchester  Gaurdian, New York Times వంటి  పత్రికలు ప్రజలను విరాళాలు ఆడుగుతున్నాయి. నమ్మకం పోడానికి ఒక ముఖ్య కారణం దినపత్రికలు electronic mediaతో పోటీ పడటమే. TRP కోసం పోటేపడి వార్తలకి రంగులు పూసి, సంచలనాత్మకం అవి చేస్తూ ఉంటే వాటిని పత్రికలు అనుకరిస్తున్నాయి. రెండవ కారణం పార్టీలు పత్రికలు పెట్టడం, లేక పత్రికాధిపతులు పార్టీలలో చేరడం, డబ్బుకి పత్రకారులు అమ్మడు పోవడం వల్ల ఏ పత్త్రికా నిష్పక్షపాతంగా  నిజం రాయకపోడం. 

TVతో పోటీలో పత్రికలు కూడా వాటిలాగే కరీనా కొడుకు తైమూర్ అలీ ఖాన్ diapers మార్చినప్పుడల్లా వారి ఇంటికి పరిగెత్తి ఆందులో ఏముందో ఫొటోలతో సహా ప్రచురిస్తున్నాయి.  ఆవి ఈ ఏడాదే ఆగస్టు 2న ఒక  20 ఏళ్ళ తెలుగు యువకుడు,  జొన్నలగడ్డ భానుప్రకాశ్ లండన్ లో Mental Sports Olympiad లో 39 మందితో (కొందరు 57 ఏళ్ళ వారయినా) పోటీ పడి సువర్ణ పథకం గెలిచాడన్న వార్తకి అందులో పదవ వంతు కూడా జాగా ఇవ్వలేదు. 

పత్రిక అధిపతి ఆదేశాల ప్రకారం వార్తలని వక్రీకరించడమో, తొక్కి పెట్టడమో చేసే పత్రకారులు లక్షాధికార్లు అవుతున్న ఈ రోజుల్లో ఒక పెద్ద ప్రశ్న: ఎవరిని నమ్మాలి??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here