The Telugus

పాత కుండలో రాముని తోక

www.theTelugus.com

పాత కుండలో రాముని తోక

కొన్ని నెలల కింద నేను WordPress లో రాసిన ఒక తెలుగు బ్లాగ్ కి వచ్చిన  ఒక ‘Iike’ (సమర్ధన) చూసి నేను ఆశ్చర్య పోయాను. ఆ రచన ఒక ‌ స్త్రీ కి నచ్చింది కాని ఆ పేరు చూస్తే తెలుగు పేరు కాదు. ఆమె ఆమెరికా నివాసి.

ఈ రోజుల్లో వింత పేర్లు పెట్టుకోవడం మాములే. అది కాక ఆమె ఒక తెలుగు మనిషిని వివాహం చేసుకొని ఉండ వచ్ఛు –ఇంగ్లీష్ నవలారచయిత్రి  ‘చిత్రా బెనర్జీ దివాకరుని’ లా. అమెరికాలో (ఇప్పుడు ఇక్కడ కూడా) ఇంటి పేరు ఆఖరి పేరుగా రాసే అలవాటు కదా?

ఉండబట్టక కమెంట్ లో ఆడిగాను, “మీకు తెలుగు వచ్చా,  లేక చదవకుండానే like కొట్టిరా?” ఆని.‌ జవాబులో నాప్రశ్నాకి సమాధానం 

లేకుండా తను రాస్తున్న రచనలను ఎవరేనా హీందీ లోకి ఆనువదిస్తే బాగుండును, ఆని ఉంది.   నేను హిందీలో  రాసిన కొన్ని రచనలు చూసి  చదవకుండానే, తన రచనలు నేను చదవాలని అలా చేసిన విషయం బోధపడీంది.

ఆకధ అంతటితో ముగిసింది అనుకున్నాను. కాని ఆ జవాబు చదివి మరొక ఆమెరికా దేశీయుడైన పాఠకుడు రాసేడు, గూగుల్ లో తర్జుమా చేసే సౌకర్యం ఉందనీ, దాన్ని వాడుకోవచ్చు అని. వెంటనే అతను రాసిన రచనలు చూస్తే తెలిసింది… అతనొక మతప్రచారకుడనీ, రాసినవన్నీ ఏసు ప్రభువు మీదా, ‘వవిత్ర గ్రంధం’ మీద అని. 

నాకు వెంటనే జ్ఞాపకః వచ్చింది. “దేవా నీవుత్త  ముండవు, నేను  పాత  కుండను” ఆనే పాతరోజులలో క్రైస్తవ ప్రచారకుల తెలుగు. ,,(ఇప్పడు వారు చాలా చక్కటి తెలుగు రాస్తున్నారు. గుర్రం జాషువా పదాల ఎంపిక ఎంత చక్కటిదో చెప్పఖ్ఖరలేదు.)  అలాగే బి. డి. జట్టీ  మొదటి ప్రపంచ తెలుగు మహాసభ ప్రారంభ వ్యాఖ్యనం ఆమోఘంగా ఉన్నా ఒకటిరెండు చోట్ల అందరూ గొల్లున నవ్వడం గర్తుకొచ్చింది. తెలుగులో  హ్రస్వానికి  బదులు దీర్ఘం వాడినా, ఆనవసరంచోట space  పెట్టినా అర్థం మారి పోతుంది. 

అప్పుడు ఈరెండిటినీ కలిపి రాసిన రచనే “పాత  కుండలో   రాముని తోక” (రామునితో కపివరుండిట్లనియే అన్న వాక్యం  తప్పుగా విరిస్తే). మెషిన్లు తర్జుమా చేస్తే ఇలాగే ఉంటుంది. ఈమధ్య కెనడా నుంచి ఒకరు పంపేరు, తను తెలుగు లో రాసిన దాని గూగుల్ అనువాదం: “ప్రపంచం లో ఉన్న 7 బిలియన్  మనుషులలో ఏ కోటికో ఒకడు వెధవ పని చే్స్తే అతను సిగ్గుపడాలి కాని పూర్తి సభ్య సమిజానికే  తలవంపు ఎలాగౌతుంది?”  గూగుల్ ప్రకారం ఇంగ్లీషు లో ఇది “of the 7 billion parrots, one million Kotiko is a widow….”  (ఇందులో చిలకలు ఎలా దూరాయో తెలియదు.)

గూగుల్ అనువాదంతో రాముడి తోక కుండలో పడే ప్రమాదం ఉంది. ప్రతి భాషకీ ఒక  idiom కాక ఓక native genius ఉంటుంది. అది పట్టడం చాలా  కష్టం. మూలం కన్నా బాగా ఉండే  ఎడ్వర్డ్ ఫిట్జ్జరాల్డ్  యొక్క  రబయ్యత్ వల్లే  ఓమర్ ఖయాం కి పేరు వచ్చింది. కాలీపట్నం  రామారావు గారి ‘యజ్ఞం అనువాదం చెయ్యడానికి అప్పుడు ఎందుకు  భయపఢ్డానో ఇప్పడు తెలిసింది..   

అనువదించడం అంత సులభం కాదు. గొప్ప  అనువాదకులకు  జోహార్లు.

Exit mobile version