అత్తలేని కోడలు ఉత్తమురాలు…
ఏ భాషలోనూ లేనన్ని సామెతలున్న తెలుగు భాషలో సామెతలన్నీ ఆ భాషా ప్రజల సంస్కృతికీ, జీవిత సత్యాలకీ దర్పణాలు.
ఈ మధ్య ఒక వ్రధ్ధాశ్రమంలో ఒక కోడలిని చూసి ‘అత్తలేని కోడలు ఉత్తమురాలు’ అన్న సామెత మదిలో కదిలింది. ఎందరో వయసొచ్చిన , వైధవ్యం ప్రాప్తించిన స్త్రీలు పిల్లలున్నా అలాంటి చోట ఉండటానికి కారణం చాలామటుకు ఒకటే ఉంటుంది… కోడలితో పడకపోడం.
ఒక చిన్నవయసు స్త్రీ అలాంటి ఆశ్రమంలో చూసి ఆశ్చర్యం పట్టలేక అడిగాను. మాటలలో తేలిన విషయం చాలా ఆశ్చర్యకరం. ఆమె చెప్పిన ప్రకారం తను అమెరికాలో స్థిరపడిన ఒక భారతీయ మహిళ. తసు ఉత్తర దేశీయురాలయినా అక్కడ మరో భారతీయుడిని వివాహం చేసుకోడమే కాకుండా ఇక్కడి భాష కూడా అనర్గళంగా మాట్లాడం నేర్చు కున్నది.
ఈమధ్య ఇక్కడే ఉండే తన అత్త గారికి చాలా చికాకు చెయ్యడం వల్ల ఇక్కడి ఆస్పత్రిలో పెద్ద ఆపరేషన్ చేయించి, ఆతరవాత కొన్ని నెలలు
కోలుకోడానికి ఉండాలంటే ఆమెని ఈ ఆశ్రమంలో ఉంచి తను కూడా ఆమెకి సపర్యలు చేస్తూ తనతోనే ఉంది. అత్తగారు పూర్తిగా కోలుకుని వారిద్దరూ వదిలి వెళుతూ ఉంటే వీడ్కోలు ఇచ్చే అందరి కళ్ళూ చమర్చేయి.
మన సభ్యతలో ఎక్కడ వివాహం జరిగినా పిల్ల తల్లీతండ్రులు అప్పగింతల్లో పిల్లని స్వంత కూతురిలా చూసుకోమని అత్తమామలని కోరతారు. కాని 100కి 99మంది ఆమెను పరాయిగానే చూస్తారు. అత్తా కోడలూ తల్లీ కూతుళ్ళలా అన్నొన్నతతో కలిసిమెలిసి ఉండడం చాలా వరకు పుస్తకాలలో మాత్రమే.
వేరుప్రాంతీయులు, వేరు కులాలు. సభ్యతలూ కాదు ఒకే పరివారపు మేనరికాలలో కూడా ఇది అరుదే. (అసలు మేనరికాలు పుట్టినదే అందుకైనా). అత్తాకోడళ్ళ సంబంధాలమీద నవలలూ. సినిమాలూ వచ్చాయి. అత్తా ఒకప్పుడు కోడలే. కోడలు కూడా అత్త అవొచ్చు.. కాని ఇద్దరికీ ఇది తట్టదు. కోడళ్ళని వేధించే అత్తలూ, అత్తగారిని వృధ్ధాశ్రమం పంపో మరెలాగో యాతన పెట్టే కోడలూ రెండూ నిజాలే...ఇద్దరూ మంచి వారైనా. ఇది తరాలు వేరవటం (generation gap) వలనేమో.
అందుకే పుట్టింది కాబోలు, ఈ సామెత