అసత్య వార్తల సమస్య
Fake news…అసత్య వార్త లు… ఈ రోజు ఒక పెద్ద సమస్య. మీ కంప్యూటర్ లో virus వచ్చినదంటే అదేదో జబ్బు చేసే క్రిములవల్ల కాదు. అది ఒక కంప్యూటర్ లు తెలిసిన, ‘చదువు’ ఉన్న మనిషి రాసిన ప్రోగ్రామ్. అలాగే మీ మైలు లో వందలకొద్ది spam messages వస్తే ఎవరో ఒక ‘తెలివి’ కల మనిషి చేసిన పనే.
అదే విధంగా మీకు WhatsApp లో కాని Facebook మీద కానీ Fake news వస్తే దానికి రెండే కారణాలు: ఎవరో ఒక కంప్యూటర్ లేక స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం తెలిసిన – అంటే చదువుకుమ్మ్న తెలివియైన మనిషి అవి రాసి ఉండాలి, చదివి కూడా బుద్ధి లేకో, చదవకుండానే బుద్ధి ఉపయోగించకుండా దానిని మరొక తెలిసిన వ్యక్తి మీకు forward చేసి ఉండాలి, మరి చదువుకున్న, తెలివైన, బాధ్యత కలిగిన మనిషి అలా చేయడం ఎందుకు? దీనీకి జవాబు మీ దగ్గరే ఉంది.
ఎన్నిసార్లు మీకు వచ్చిన post ని ఆలోచించకుండా, సత్యాసత్యాలు కనుక్కోకుండా, అనాలోచితంగా మీరు మరి ఒకరికి పంపించారు? ఎవరో ఒక గాడిద అమర గాయకుడు బాలు మరణించినప్పుడు అతని కుటుంబానికి ఆర్ద్ధిక సమస్య వచ్చిందనీ, ఆస్పత్రి బిల్లు కట్టలేక బాధ్హ పడ్డారనీ వారిని సంప్రదించకుండానే రాసి తనేదో ఘన కార్యం చేశానని తన వీపు తనే తట్టుకున్నాడు . ఆ బిల్లు కట్టడానికి ఎవరు ధన సహాయం చేసేరో కూడా ఊహించు కున్నాడు,, వారిని కూడా అడగకుండానే, అది చదివి చాలామంది బాధ పడ్డారు.
అందరూ బాలు అభిమానులే. “అయ్యో, అలాగా?” అనుకుని ఒకొకరూ కనీసం పదిమందికి forward చేశారు. అందరూ మంచి ఉద్దేశంతోనే ఈ పని చేశారు. ఎవరూ నిజం గురించి ఆలోచించ లేదు. మర్నాడు బాలు కొడుకు అది నిజం కాదని చేసిన ఖండన మొదటి అసత్య వార్త చదివిన చాలా మంది చూసి ఉండరు. అది చదివిన చాలా మందికి అలాటి అపవాదు పుట్టినదని కూడా తెలియక పోవచ్చు.
“నిప్పు లేకుండా పొగ ఎందుకొస్తుంది? ఏదో ఉండే ఉంటుంది,” అనుకొనే వారు అందులో చాలామంది ఉండ వచ్చు.
అది అసత్య వార్త అని forward చేసిన వారు ఖండన పంపి ఉండరు. తన తప్పు ఎవరూ ఒప్పు కోరు కదా? అలా ఒక అబద్ధము నిజం అయిపోతుంది.
న్యూజిలాండ్ ప్రదాని సంస్కృత శ్లోకం చదివిన video చూసి వెంటనే Google మీద వెతికి ఆవిడ imposter అని తేల్చే ఓపిక ఉన్న వారు కూడా బాలు గురించి అసత్య వార్త అందరికీ పంపించుతారు, నిజమో కాదో కనుక్కోకుండానే. అది సంచలనం పుట్టించే వార్త. ఆవిడ ప్రధాని కాక పోవచ్చు, కానీ ఒక విదేశీ వనిత మన శ్లోకం చదువుత్న్నదనే విషయం మరుగున పడి పోతుంది.
ఇలాగే Fake news పుడుతుంది. దానిలో మనం అందరం భాగస్వాములమే. చదవకుండా నిజానిజాలు కనుక్కో కుండా forward చెయ్యడం మానుకో వాలి. మన ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ అంత కన్నా నిజం ముఖ్యం