www.theTelugus.com

ప్రళయం రాబోతున్నదా?

కొంద‌రు సనాతన క్రిస్టియన్ లు ప్రపంచంలో ప్రళయం వచ్చి మానవ జాతే అంతం అయిపోతుందని నమ్ముతారు… హిందూ సనాతన ధర్మ అనుచరులు ఎన్నో నమ్మినట్టే.

ఇంగ్లండ్ లోనూ మరికొన్ని  క్రిస్టియన్ దేశాలలోనూ  దేహానికీ ఇరువైపులా ‘ప్రపంచం అంతం కాబోతోంది, కావున దేముడి ముందు లొంగిపో‌,’ అని రాయబడిన  బోర్డులు తగిలించుకుని రోడ్డుపైన కనిపించడం ఒకప్పుడు (ఇప్పుడు కాకపోయినా) సామాన్యమే.

ఆంధ్ర తెలంగాణాలలో ఇప్పుడు పడుతున్న వానలు చూస్తే ఇది జ్ఞాపకం వస్తుంది. హైదరాబాదు లో రెండు రోజులలో సుమారుగా 35 సెంటీమీటర్ల వర్షం పడి, రోడ్లపై నదులలా నీరు ప్రవహించి రెండు రోజులు సెలవు ప్రకటించడం, 32 కన్నా ఎక్కువ మరణించడం చూస్తూంటే నిజంగానే ప్రళయం (deluge) వస్తోందేమో అని అనుమానం పుడుతుంది.

ఒకవైపు కరోనావైరస్ ప్రకోపం‌‌, మ్సరొక వేపు జలప్రళయం. ఇవి చూసి తనేదో ప్రకృతి మీద పెద్ద విజయం సాధించి వశపరుచుకున్నానని మానవుడు అనుకోడం ఎంత దురహంకారమో తెలుస్తోంది. 

ఈ పరిస్థితుల నుంచి మానవుడు నిరంకార ప్రవృత్తి (humility) నేర్చుకోవాలి. తనెంత బలహీనుడో, ప్రపంచానికి తనే అధిపతిని అనుకోడం మనిషి తెలుసుకుని తెలియని మానవాతీత శక్తి ముందు తలవంచితే ఈ ప్రకోపం సాధించిన ఒక గొప్ప విజయం అవుతుంది. ఐన్స్టైన్, న్యూటన్ వంటి మహానుభాలు ఇది ముందే గ్రహించేరు. మనం ఎప్పుడు నేర్చుకుంటామో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here