దసరా సరదాలు, తెలుగుతనం
సోమేశ్వర్ భాగవత్
ఒకప్పుడు ఆంధ్రదేశంలో దసరా పండుగకి చాలా ప్రత్యేక స్థానం ఉండేది.ఇప్పుడు ‘చదువు’కున్న, ‘ఆధునిక’ తెలుగు వారందరికీ హెలోవీన్, క్రిస్మస్, తెలంగాణ వారయితే ఈద్, ముహర్రం గురించి తెలిసినంత దసరా గురించి తెలియకపోవచ్చు. తమనితామే కించపరుచుకోడం మరొకరిని అనుసరించడం తెలుగు వారి ప్రత్యేకత కదా?
అయినా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు సంస్క్రతి బతికే ఉండటం వల్ల వేడుకలు జరుగుతాయి – బెంగాలంత పెద్ద ఎత్తున కాకపోయినా. బెంగాల్ లో కమ్యూనిస్టులు మతం అంటే నమ్మకం లేక పోయినా ‘పూజో”ని మాత్రం అరికట్ట లేకపోయారు.
పూర్వం ‘దసరా సెలవులు’, దసరా పాటలూ స్కూలుపిల్లల జీవితాలలో చాలా ముఖ్యమైన మజిలీలుగా, బాల్య జ్ఞాపకాలుగా ఉండేవి. ఇప్పటి ఇంగ్లీషు మీడియం పిచ్చి, అమెరికా చదువు కలల వల్ల అవి పట్నాల్లోఉండవేమో – నాలాటి రాష్టేయ ఆంధ్రులకి తెలియదు. దసరా ఇప్పుడు అభివాదనలకీ, శుభాకాంక్షలు చెప్పడానికి పరిమితం అయిపోయిందా?
దసరా దుర్గాదేవి పూజ సమయం ఆనీ, స్త్రీ శక్తి స్వరూపిణి ఆని మనకి మరోసారి తెలియజేస్తుందని అందరికీ తెలిసిందే. ‘దసరా’ పదం అసలు రూపం సంస్కృతభాషలో ని ‘దశ హరా’ ఆని ఒక పరిభాష. దశ అంటే పది, హరా అంటే నిర్మూలించడం. మానవుని మనసులో ఉండే పది దుర్గణాలని రూపుమాపాలని బోధిస్తుందని ఒక interpretation. ఈపది చెడు గుణాలు అహంకారం (ego), ఆమానవత (cruelty),అన్యాయం, కామవాసన, క్రోథం, లోభం, మదం, మాత్సర్యం, మోహం (attachment) మరియు స్వార్ధం.
ఈ దశ దుుర్గగణాలనీ జయిస్తేనే విజయదశమి సరిగా పాటించిినట్టు.