www.theTelugus.com

ఆనందం, సంతోషం, సుఖం,  ఓకటేనా ?

ఒక  రచయిత సెక్సు గురించి రాస్తూ  అది చాలా సంతోషం, ఆనందం కలిగిస్తుందనీ, జీవితంలో చాలా ముఖ్యం , కాబట్టి దానిగురించి ఎవరూ మాటలాడకపోడం సరి కాదని రాస్తే చదివాక  నాకొక సందేహం వచ్చింది ఆనందం, సంతోషం, సుఖం,  ఓకటేనా ? ఈ మూడూ వేరు వేరు అర్ధాలున్న పదాలైనా  వాటిని ఒకదానికి బదులు మరొకటి మనం తప్పుగా వాడుతున్నమా అనిపిస్తున్నది.

నా బుద్ధి ప్రకారం సుఖం భౌతిక మైనిది, సంతోషం మానసికమైనది ఇంకా ఆనందం ఆధ్యాత్మికమైనది. చాలామంది సంతోషం, ఆనందం, సుఖం మూడూ ఒకటే అనుకుని రాస్తూన్నారనిపిస్తున్నది.  సెక్స్ వల్ల సుఖం కలగవచ్చు, కొంత సంతోషం కూడా. మరొకరికి మంచి చెయ్యడం, మంచి పుస్తకం చదవడం  వల్ల ఎంతో సంతోషం  కలగవచ్చు.  కానీ ఆనందం మాత్రం ఆధ్యాత్మికమైనదని నా అభిప్రాయం. అందుకే మన హిందూ సంస్కృతిలో ‘తీర్థ’,  ‘ఆనంద’ ధర్మానికి జీవితం అర్పించిన వారి  పేర్లకి  చేర్చుతారు. అవి సాంప్రదాయాలు. ఉ:  స్వామి వివేకానంద, రామానంద తీర్థ లా.  ఇలాటి.వాటిలో ఇవి ప్రముఖమైనవి. ఏ సంప్రదాయం.పేరుకీ ‘సుఖ:చేర్చబడలేదు.

ఈ మూడింటికీ ఉన్న వ్యత్యాసాన్ని  తెలుసుకోవడం అసలైన జ్ఞానం  అనీ,  సుఖం నుంచి సంతోషానికీ, అక్కడినుంచి ఆనందానికీ  జరిపే ప్రయాణామే మానవుడి మానసిక ఎదుగుదల (evolution) అని నేను అనుకుంటున్నాను. దుఃఖంనుంచి దూరంగా, సుఖానికి దగ్గరగా  వెళ్ళడానికి  ప్రయత్నించడం  ప్రతి జంతువుకీ   సహజం.  మనిషి కూడా ఒక జంతువే  కదా?

మానవుడు కూడా మృగమే కానీ  అంతకు మించి  ఎదిగే  శక్తి  ఒక్క  మానవుడికే ఉందని నా అభిప్రాయం.  అందుకే  సుఖంనుంచి సంతోషానికీ. దానినుండి ఆనందానికీ ఎదగాలని ఒక్కమానవుడే ఆనుకుంటాడు. మరే జంతవూ కాదు్.
మరి మీరేమిటంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here