www.theTelugus.com

కరోనా నేర్పుతోంది ఎన్నో పాఠాలు

పడక పోడం కాదు, పడిిినా  లేవడం గొప్ప’ అని ఎందరికో గురువులు చెప్తారు. అలాగ విజయంతో  ఇగో (ego) పెరగడం, విఫలంతో విజ్ఞ్నానం వికసించడం ఖాయం అన్నది కూడా నిజమే. ఇప్పుడు ప్రజ్వలిస్తున్న కరోనా మహామారి కూడా మానవ జాతి జీవన విధానాన్ని పూర్తిగా మార్చే పాఠాలు నే్ర్పి మన ఆలోచనా సరళినే ఎంతో ప్రభావితం చెయ్యడం  చూస్తున్నాం. 


కరోనా వ్యాధి వల్ల కూడా కొంత మంచి జరుగుతుందని కొందరు భావిస్తున్నారు మొదటిది జీవితం ఎంత బుద్భుద ప్రాయమో, అశాశ్వతమైనదో‌‌, ఇప్పడు మానవజాతికి తెలుస్తోంది. ఎవరి ప్రాణం ఎప్పుడు అంత మవుతుందో తెలియని మనకి దీనివల్ల ఆత్మపరీక్షణ, లోతుగా ఆలోచించడం అలవాటైతే మంచిదికదా?

అలాగే మన సంస్కృతి లోని కొన్ని మంచి అలవాట్లు కూడా మరోసారి మనకి తెలుస్తాయి. పాతకాలం తెలుగు పరివారాలలో ఎవరేని ఇంటికే వస్తే వెంటనే మంచినీళ్ళు ఇవ్వడం, భోజనానికి లెమ్మనడానికి “కాళ్ళూ చేతులు కడుక్కోండి” ఆనడం మాములే. శూభ్రత‌‌, కడుక్కోడం‌‌, ఎంత ముఖ్యమో  ఇప్పుడు తెలుస్తోంది. అలాగే‌‌, దూరంనుంచో నమస్కారం చెయ్యడం, అనవసరంగా అన్నిటినీ ముట్టుకోక పోవడం, అస్ప్రుశ్యతకీ,‌ జాత్యహంకారానికీ కాక శుభ్రత కోసమనీ ఇప్పుడు తెలుస్తున్నది. కొన్ని మంచి అవాట్లు కూడా అనాలోచితంగా వక్రీపించబడి అర్ధంలేని చెడు రీతులు  (meaningless rituals) గా మారతాయి.. 

( To be continued in next part)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here