BJP ప్రచారం OK,ద్వేషం, అబద్ధం not Ok
రైతు సంఘాల ఆందోళన మొదలైనప్పటి నుంచి BJP, ఆ పక్షం సమర్ధకులూ, social media మీద దాన్ని వ్యతిరేకిస్తూ చాలా సందేశాలు పంపుతున్నారు. పురోగమనానికి వ్యతిరేకులూ , రూఢివాదులూ, పాతకాలం వారూ అని పిలవబడే ఈ పక్షం, విదేశాల్లో చదువుకున్న ‘ఆధునిక’ యువ నేత, అతని విదేశీ తల్లీ నడిపే పక్షం కన్నా సామాజిక సాధనాలు ఎక్కువ బాగా వాడి వారి కుటుంబవాదాన్నీ, తృష్టీకరణనీ బయటపెట్టడంవల్లే మోది అధికారంలోకి వచ్చారని అందరూ ఒప్పుకుంటారు.
RSS ముసలాళ్ళ చేతిలో మోది రిమోట్ ఉందని వాపోతున్న పురాతన పార్టీ ఎన్నో త్యాగాలు చేసిన, విద్వాంసులైన పెద్దలకన్నా చదువుకోని ఈ దేశమే తెలియని ఒక విదేశీ వితంతువు చేతిలో రిమోట్ ఉండటం ఎలా గొప్పో చెప్పలేక పోయారు. ఆమె ఒక ఉత్తుత్తి ప్రధానిని పెట్టి నడిపిన రాజ్యం తీరు చూసిన తరవాతే ప్రజలు మోదీని ఎన్నుకున్నా, ఆ తీర్పుని కుటుంబవాదులు మన్నించడం లేదు. ఆలాటప్పుడు ఈ ప్రచారం సబబే.
కానీ ప్రచారానికి కొన్ని హద్దులూ నాగరిక విధానాలూ ఉన్నాయి. కోపమొస్తే బూతులు మాట్లాడడం
సంస్కారం కాదు. అలాగే నెహ్రూ, షేక్ అబ్దుల్లా, జిన్నా సవతి పిల్లలని అక్రమ సంతానమనీ అనేముందు రుజువు, ప్రమాణం చూపించాలి. తను హిందూగా పుట్టినా తన సంస్కారాలు ఇంగ్లీషు వారివని నెహ్రూ అన్నదాన్ని వక్రీకరించడం తప్పు. అబధ్ధ సమాచారాన్ని కల్పనలనీ ప్రచారం చెయ్యడం more loyal than the king సమర్ధకులో, బజరంగ దల్, రామ్ సేవ లాంటి సంస్థలో చేసినా బిజెపి ఐటి సెల్ దే దోషం అంటారు.
నెహ్రూ అన్నా గాంధీ అన్నా తడు అభిప్రాయం కొందరికి ఉంటే అది రాజకీయ పరమచ ఉండాలి. ఇలాటి వార్తలు పుట్టడానికి అసలు కారణం 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో కలిగిన “రాజకీయ ప్రత్యర్ధి శత్రువు’ఆనుకునే సంస్క్రతే.
ప్రచారం సరే. ద్వేషం తప్పు.