రైతుల పోరాటం: వ్యవస్థ మార్పు అవసరం లేదా?
వజ్రాలు, బంగారం తిని మనుషులు బతక లేరు. భోజనం, మరే ఆహారం, లేకుండా ఎన్ని రోజులు బతక గలరు? ఎన్నో దశాబ్ధాలనుంచి వస్తున్న ఈ వ్యవస్థలో బతకడానికి కావలసిన అన్నధాన్యాలు పండించే రైతులు పస్తులుండి, అప్పులపాలై, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, బంగారం, వజ్రాలూ అమ్ముకునే వ్యాపారులు కోటీశ్వరులు అయిపోతున్నారు — అంతకంటే తక్కువ అవసరం ఉండటమే కాకుండా హాని కూడా చేసే
మధ్యపానాలు తయారు చేసే వారిలా కల్లు ముంత నుంచి వచ్చిన రాబడి మీద బతికే రాష్ట్ర ప్రభుత్వాలు అవి నడిపే రాజకీయ నాయకులు (కొంత రోజురోజుకీ పెరిగే వారి జీతాలతోనూ, దానితోకూడా ఆకలి తీరక అవినీతి తోనూ) మింగగా మిగిలిన డబ్బు వోట్లు రావడంకోసం populist పథకాలు అమలుపరచడం కోసం మాత్రం వాడడం వల్ల బికారులై అత్యవసర వనరుల కోసం ముష్టి చిప్ప తో కేంద్రానికి పరిగెడుతున్నై… డబ్బు దోరకాక పోతే కేంద్రాన్ని తిట్ట వచ్చుననీ, దొరికితే సగం జేబులో వేసుకో వచ్చనీ. కానీ ఈ వ్యవస్థ మార్చడానికి ప్రయత్నం చేస్తే వెంటనే రైతులని మభ్యపెట్టి వారి ఆందోళని కొందరు నాయకులు ప్రారంభించారు.
ప్రస్తుత వ్యవస్థ బాగుందనీ , రైతులు ఆకలితో చచ్చిపొడమే మంచిదనీ వీరి ఉద్దేశమా? రైతులకంటే దళారూలూ, మధ్యవర్తులూ, ఎక్కువగా గణిస్తున్నారని వారికి తెలియదా? చెరుకు పండించే రైతులు వారికి నిశ్చయించబడ్డ చక్కర కార్ఖానాకే అమ్మాలని, తక్కినవారు మర్కేటు యార్డు లోనే అమ్మాలని నిర్భందం చేసే ప్రభుత్వాలు, దుకాణాలు ఎవరికి అమ్మాలో ఎవరికి అమ్మకూడదో ఎందుకు నిశ్చయించవూ? చెరుకు రైతులకి కోట్లరూపాయలు బకాయీ పెట్టె కార్ఖానాలన్నీ రాజకీయ నాయకుల చేతిలోనే ఉన్నాయన్నది నిజం కాదా? ప్రభుత్వం నుంచి దొరికే కనీస ధర డబ్బు లంచం లేకుండా ఎప్పుడూ దొరకదని ఈ నాయకులకి తెలియదా? వారిలో ఎవరైనా కోటీశ్వరుడు కాని నాయకుడు ఉన్నాడా? ఒకరికేనా నిజం బీద రైతు కష్టాలు తెలుసా?
ఎన్నో ప్రశ్నలు జవాబుకోసం ఎదురు చూస్తున్నాయి. చర్చలలో వీటిని అడుగుతారనే కాబోసు వారు చర్చలు జరగనివ్వరు. వ్యవస్థ మారడం వీరికి ఇష్టం లేదా? కేంద్ర చట్టాలు దోషపూరితం కావచ్చు. కానీ వాటి బదులు మరేమైనా ఇప్పటి సమస్యలు లేకుండా చెయ్యడానికి మార్గం అన్వేషించాలి.