ప్రభుత్వం డబ్బు ప్రజలది కాదా?
“మాకు ఐదు నెలల నుంచి జీతాలు లేవు ” అని ఒక కరోనా వ్యాధి నివారణకి తన ప్రాణాలు ఒడ్డి పనిచేస్తున్న వైద్యుడు నాతో అన్నాడు. అది చెప్పినది కరోనా నివారణ సిబ్బంది తొడుక్కునే ప్రత్యేక దుస్తులు (PPE) త యారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసిన ఒక కంపెనీ యజమాని తనకి 45 రోజులలో ఇవ్వవలసిన డబ్బు 93 రోజులయినా ఇవ్వడం లేదనీ తను మరో రాష్ట్రం నుంచి వచ్చి విజయవాడలో మూడురోజులయి ప్రయత్నం చేస్తున్నాననీ నాతో చెప్పిన విషయం చెప్తే .
ఏ ప్రభుత్వం నుంచీ లంచం ఇస్తేకాని నిధులు దొరకవని అందరికీ తెలుసు. పై రాష్ట్రం నుంచి విజయవాడ రాడానికీ, ఎన్నోరోజులు హోటల్ లో ఉండడానికీ, లంచానికీ. కంపనీ అధికారి తన జేబులోంచి ఖర్చు చెయ్యాలి. తన ఫెక్టరీలో పని చేస్తున్న కార్మికులకి జీతాలు, ఎన్నో ప్రభుత్వ శాఖలకి లంచాలూ ఇవ్వాలి. అవినీతి లేకుండా ఎవరైనా అంత డబ్బు గణించ గలరా? జీతాలు కానీ, ఇవ్వవలసిన వారికి డబ్బుకానీ ఆపడానికి రెండే కారణాలు ఉనతాయి (1) లంచం రాబెట్టుకోడానికీ , (2) ఆడిట్ లో తాము తప్పుగా డబ్బు ఇచ్చినట్టు objection వచ్చి తమ జేబులోంచి పెట్టుకోవలసి రాకుండా ఉండటానికి.
చదువుల్లో చాలా ముందుండి మంచి స్థానం పొందినవారందరూ ఇంజనీరింగు, లా, సియ్యే వంటి వృత్తుల్లోకి పోతారు. ఎందుకూ పనికిరాకుండా మిగిలినవారు , పనిచెయ్యకుండా జీతం కావాలనుకునేవారూ ప్రభుత్వ పనివారు అవుతారు. అలాటివారు తప్పులుచెయ్యడం సహజం.
అది కూడా అవలేనివారు చదువుచెప్పే మాస్టర్లూ అవుతారు. వారు తమకంటే తక్కువ తెలివికలవారిని తయారు చేస్తారు. ఏ అర్హతా, చదువూ, సంస్కారం లేని వారు, కేవలం డబ్బు, కులం మీద ఆధార పడిన వారు రాజకీయాలలోకి పోతారు. వేలకోట్లు సంపాదించిన ముఖ్యమంత్రి కొడుకు ఆ డబ్బు పెట్టి ముఖ్యమంత్రి అవుతాడు, అలాటి వాడే మరొక ముఖ్యమంత్రి తనకొడుకుని ముఖ్యమంత్రి చెయ్యడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ వ్యూహంనుంచి తప్పుకోడం చాలా కష్టం. ప్రభుత్వం పని చేస్తూ తమ మీది రాజకీయ నాయకులకి వంత పలుకుతూ ఏ పని చెయ్యకుండా ఉద్యోగం చెయ్యడం వల్ల ఏ తప్పులూ జరగవు – పని చేస్తే కదా తప్పు చెయ్యడానికి? ఏమేనా తప్పు పట్టుపడితే రక్షించడానికి రాజకీయ నాయకుల అడుగులకి మడుగులేత్తితే చాలు.
ఇలాటి నేపధ్యంలో ప్రభూత్వాధికార్లు జీతాలూ, ఇవ్వవలసిన డబ్బూ నిలిపేయడం మామూలే. గవర్నమెంటు ఉద్యోగాలకోసం తాపత్రయ పడటం, బుద్ధిలేని గాడిదలని ఎన్నుకోడం ప్రజలు చేస్తున్న తప్పు. దీని బాగుచెయ్యాలంటే సరయిన రాజకీయ సంస్కృతి రావాలి. ఒకే పరివారం ఎన్నో దశకాలు పాలించి ఈ దూషిత సంస్కృతి పుట్టించింది . ఇది తుడిచిపెట్టడానికి సమయం పడుతుంది. కొత్త పక్షంకూడా పాత సంస్కృతినే అవలంబిస్తే ఈ కుసంస్కృతిని పూరు మాపడం కష్టం. ఇది జరిగి అవకాశం కూడా ఉన్నాది…. కొంతవరకూ జరుగుతున్నది కూడా.
రెండు రకాల తప్పులు ఉంటాయి – దురుద్దేశంతో (లంచం కోసం కానీ, తనవారికి లాభం కలిగించడానికి కానీ) చేసినవి, నిజాయితీగా చేసినా ఏదో లోపం వల్ల జరిగినవీ. సరయిన ఆడిట్ కానీ, సియ్య కాని ఈ రెండిటికీ మధ్య ఉన్న వ్యత్యాసం కనిపెట్టాలి. సరయిన రాజకీయ సంస్కృతే దీనికి మందు.