సంక్రాంతి శుభాకాంక్షలు
ఎందుకు చెప్పాలి?
డూ డూ బసవన్న అంటే తల ఊపే గoగిరెద్దులు తెలుగువారి సంక్రాంతి కి చిహ్నం
సంక్రాంతి మళ్ళీ వచ్చింది. శుభాకాంక్షలు అందరూ తెలిపి ఉంటారు ప రిచయం ఉన్న ప్రతివారికీ, కొన్నిమాట్లు లేనివారికి కూడా. శుభాకాంక్షలు చెప్పనివారు శత్రువులే అనుకోడం పరిపాటే. గంగిరెద్దులు ఆడించేవారూ, ఇంటిముందు ఎన్నో ముగ్గ్లుపెట్టేవారూ నువ్వులపప్పు లడ్డూలు పంచేవారూ తెలుగు వారి సంక్రాంతికి చిహ్నాలు . అందుకీ దీన్ని తిలసంక్రాంతి అని కూడా అంటారు. ప్రతిఏడాదీ అన్నిపండుగలూ వేరు వేరు (ఇంగ్లీషు) తారీఖులలో వస్తాయి కానీ సంక్రాంతి ఒకే ఒక పందుగ ఎప్పుదూ Jan 14 నే వచ్చేది. దారినికి కారణం తక్కినవి అన్నీ చాంద్రమాన (lunar calendar) తిత్తుల ప్రకారం అయితే ఇది ఒక్కటీ solar calendar ప్రకారం జరుపుకుంటాం – కారాణం సూర్యుడు ఈ రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం లో ప్రవేశిస్తాడు కనక. అందుకే మహారాష్ట్రలో సంక్రాంతిని ఉత్తరాయణం అనికూడా అంటారు. మహారాష్ట్రలో నువ్వుల ఉండలు ఒకారికొకరు ఇచ్చుకుని ’til gud khaa ani god god bola’ – అన్టే నువ్వుల-బెల్లం ఉండాలు తిని తియ్యగా మాట్లాడు అని అర్ధం. పిజ్జాలూ బర్గర్లూ తినే ఈ రోజులలో ఎవరూ నువ్వులు, బెల్లం తినకపోయినా ఈ విధoగా తిని ఆరోగ్యానికి అవికలిగించే లాభాలు పొందుతారు. ఆంధ్రా, తమిళ్ నాడు, మహారాష్ట్ర, కర్ణాటకలలో ఇది ముఖ్య పండుగ ఐనా గుజరాత్.లో.ఈ.రోజు ఉత్రాణ్ గా. గిలిపటాల రోజుగా జరుపుకుంటిర. ఈ రజు.అహమదాబాద్ లో ఒక గాలి పటాల అంతర్దేశీయ స్పర్ధ జరిగేది. పంజాబ్లలో ఇది లోహ్రీ. మన దసరాపాటల లాగే లోహ్రీ పాటలు కూడ ఉన్నాయి. అసోమ్ లో ఈరోజు బిహూ. దేశమంతా వేరువేరు పేర్లతో జరిగే పండుగ ఇది. నేపాల్ లో, పాకిస్తాన్ లోని సింద్ రాష్ట్రం, బాంగ్లా దేశ్, భారతీయులు ఉండే ప్రతి దేశం లోను ఈ పండుగ జరుపుకుంటారు.
అమెరికాలోని తెలుగు సంస్థలు ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తారు.
ఉత్తర ప్రదేశాలలో దసరా, దివాలీ వంటి సామాజిక ఉత్సవాలకి ఎక్కువ ప్రాధాన్యం ఉన్నా దక్షిణాదిలో మాత్రం సంక్రాంతి లాటి మన సంస్కృతికీ, వ్యవసాయానికీ సంబంధించిన పండుగలే ముఖ్యం.