మన భాషల
గొప్పతనం
ఎన్నో భాషలు ఉండటం వల్ల మన దేశానికి చాలా సమస్యలు కలుగుతున్నాయని చాలా మంది అంటారు. ఇలాటి దేశాలు అరుదే. రెండు భాషలతోనే కెనడా కుస్తీ పడుతోoది అలాటిది మనకి 22 ముఖ్య భాషలేకాక ఎన్నో dialects, చిన్న భాషలు ఉన్నాయి. దానివల్ల పత్రికలకీ పుస్తకాలకి వితరణకి చాలా కష్టం అవుతున్నది.
వోట్లు రాబెట్టుకోడం కోసం రాజకీయ నాయకులు భాష మీద ఉద్రేకాలు స్వంత లాభం కోసం పుట్టిస్తున్నారు. కర్ణాటకలోని బెళగాం మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి పిచ్చిమాటలతో తన రాష్ట్రం ‘మహా’ సంకుచిత భావాలదని తెలియజేస్తూ ఉంటే, ఒడిసా ఏకంగా మన విజయనగరం లోని గ్రామాల్లోనే చొరపడుతున్నది.
కర్ణాటకనీ, కన్నడ భాషనీ “రక్షించడం” పేరుతో కొందరు దౌర్జన్యంతో డబ్బు చే్సుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకే భాషతో విభజించబడిన రెండు రాష్ట్రాలు ఎడముఖం, పెడముఖం పెడుతున్నాయి. భాషా రాష్ట్రం కోసం 50 ఏళ్ళు ఆందోళన చేసి అందరికన్నా ముందు సాధించిన రాష్ట్రం ఆ భాషనే తొలిగించి ఒక విదేశీ భాషలో పాఠాలు చెప్పాలని నిర్భభందిస్తున్నది.
ఇలాంటి నేపధ్యంలో మన భాషలన్నీ ఎంత ఒకటికొకటి దగ్గరగా ఉన్నాయో, పక్క ప్రదేశాల నుంచి ఎన్ని పదాలు దిగుమతి చేసుకుంటున్నాయో చెప్తే ఎవరేనా వింటారా?
ప్రతి భారతీయ భాషా తక్కిన వాటితో ముడిపడి ఉంది. అన్నీటిలో చాలా సామరస్యతా పోలికలే కాకుండా వాటిలో ఆలోచనా విధానం కూడా ఒకటి. ఎవరి గురించి మాట్లాడుతున్నామో వార అక్కడికి వస్తే ఏ భారతీయ భొషలో నైనా “వందేళ్ళు బతుకు” అంటాం. అదే ఇంగ్లీష్ లో ఐతే ఆ మనిషిని దెయ్యం (devil) అంటాం.
మన భాషలన్నిటి లోనూ శుభం కోరుతాం. అదే మన భాషల గొప్పతనం. అన్నీ మంచివే. అన్నీ మనవే.