www.theTelugus.com

మోసం  చేస్తేనే లాభం ఆనుకోడం ఆధునికతా?

దినపత్రికలలో రమారమి ప్రతిరోజూ ఎందరో మూర్ఖులు   వంచించబడ్డ వార్తలు వస్తాయి.   డిస్కౌంట్  అమ్మకాలు,  Ponzi స్కీమ్స్, నిమిషాలలో డబ్బుని  రెండింతలు చెయ్యడం, వస్తువులని బంగారంగా మార్చడం, ఇంస్టాల్మెంట్ మీద అమ్మకంలో ప్రతినెలా లాటరీ వేసి, గెలిచినవారికి వస్తువ ఇచ్చి  తక్కిన నెలలు కట్టడం మాఫీ ఇలాటివి ఎన్నో చదువుతూ ఉంటాం.

ప్రధానమంత్రి  సంక్షేమనిధికి కూడా  బోగస్  బేంక్ ఎకౌంట్లు పెట్టి విరాళాలని కాజేస్తున్నారంటే వీటి వెనక బేంక్ ఆఫీసర్లు, పెద్ద ఘరానా వ్యక్తులు, ఉన్నారన మాట. లేకుంటే ఇది  సాధ్యం కాదు. ఈమధ్య SBI శాఖ పేరుతో దొంగ బేంకు పెట్టి ధనంతో మాయం అయిన సంగతి కూడా  బయట  పడింది.

ముడుపుల పేరుతో దేముడికే లంచాలిచ్చే మన సంస్కృతిలో  లంచగొండితనం ఒక తప్పు కాదు. దానికి సామాజికంగా ఒప్పుకోలు  (social  acceptance) కూడా ఉంది. పైకులంలో పెళ్ళికి వెలివెసే మనం అననీతికి వెలి వెయ్యం. ఈ సమాజమే  corrupt.  మనని మూర్ఖులని చెయ్యడం చాలా సులభం.

 ఇలాటి ఇంస్టాల్మెంట్ స్కీమ్ ఒక ఊళ్ళోపెట్టి ప్రతినెలా లాటరీ. మొదటి ఒకటి రెండు  నెలల వందల ఇంస్టాల్మెంట్ల  మీదే  ఖరీదైన ఫ్రీజ్ లాంటివి  ఇచ్చి ఆ తరవాత  పారిపోడం జరిగింది.  అప్పుడు  పోలీసు కమిషనర్  Tamil Naduకి చెందిన IPS ఆఫేసరు. ఆ రాష్ట్రంలో ఒక చిన్న ఊరిలో  రమారమి అందరికి ఇలాటి  మోసాలే వృత్తి అనీ, ఎన్నో లక్షల  రూపాయలు కట్టినది చాలామంది పోలీసులేనని, లంచం  డబ్బు అవడంవల్ల  నోరుమూసుకు  ఊరుకున్నారని  తెలిసి ఆ ఊరు వెళ్ళి మోసంచేసినవాళ్లని  పట్టుకోడం (50 ఏళ్ళ కింద) జరిగింది .


ఈ  మోసాలన్నిటి వెనక ఉన్న మనస్తత్వం కష్టపడకుండా ఉట్టినే  డబ్బు గణించాలనే  ఆశే. ఇంగ్లీష్ లో ఒక  నుడిఉంది: “ఉచితంగా భోజనం  ఎక్కడా   దొరకదు” అని  (There  is no such thing as a free meal).  చాలా మందికి ఏదో  మాయవల్ల తమకి కోట్లరూపాయలేనా‌,  బంగారమేనా దొరుకుతాయని  ఆశ. ఎక్కడేనా డీస్కౌంట్  సేల్ అని బోర్డు  పెడితే కొట్టు తెరవక ముందే అక్కడ   వేలమంది క్యూలో ఉంటారు.  గుప్త నిధులకోసం వెతికే  వారు ఎందరో.

తక్కువధరలో ఎక్కువ  విలువ ఉన్న సామాను మానవుడు కోరుకోడం సహజం. “నూటికి 60 శాతం డిస్కౌంట్”  అనీకాని  “సగంధరకే వస్తువులు అమ్ముతాం” అనీకాని  ఎవరెనా  ప్రకటిస్తే ఎంతోమంది పరిగెత్తి కొనడం   మామూలే.  మొట్టమొదటి  ఆలోచన రావలసింది, “అయితే ఆ వస్తువు  ధర చెప్పినకంటే నాలుగో వంతో ఇంకా  తక్కువో అనమాట;15 % లాభం వేసుకున్నా కూడా సగంకన్నా తక్కువకి అమ్మొచ్చు” అని. ఏ వ్యాపారీనష్టం మీద వ్యాపారం చేసి తన ఆస్తిని  దానంగా పంచి పెట్టడు.  అతనికి లాభం లేకపోతే  వ్యాపారమే చెయ్యడు.

ఏ  వ్యాపారి అయిన, “దీని ఖరీదు రెండు వేలు, మీకు మాత్రం వెయ్యకి ఇస్తాను,” అని  చెపితే మీరు అడగవలసిన మొదటి ప్రశ్న: “ఎందుకు? నేనేమయినా  ముష్టి వాడిలా/దానిలా  కనిపిస్తున్నానా?  నామీద  అంత దయ ఎందుకు?” అని. ఆ వ్యాపారి మీకేమేనా బంధువా?  బంధువులకైనా ఎవరూ  నష్టం మీద అమ్ముతారా?

ప్రతి డిస్కౌంట్  సేలు  మీ నమ్మకాన్నే డిస్కౌంట్ చేస్తున్నది.  ఈ తగ్గింపు ధరలు, ఒక పైసా తక్కువచ్చేసి రెండురూపాయల వస్తువు ధర  1.99 రాయడం  అమెరికా  కనిపెట్టిన మార్కెటింగ్ చిటుకులు.  వీటివల్లే ఆర్థికంగా  ప్రపంచంలో మొదటి స్థానంలో  ఉంది. విలువ 100కి బదులు 99 ఆని  రాయడం తక్కువ  అనే భ్రాంతి కలిగించడానికే.

అమెరికా లో ప్రతి ఊళ్ళో డాలర్ దుకాణాలు , 99సెంట్  దుకాణాలు ఉంటాయి – ఆంటే అన్నివస్తువులకి  ఒకటే విలువ. ఇక్కడ ప్రతి 5 వస్తువల్లో ఒకటి మాత్రం డాలరుకన్న ఎక్కువ ఖరీదు చేసేది ఉంటుంది. తక్కిన నాలుగూ డాలరులో సగంకన్న తక్కువ  ఖరీదువై ఉంటాయి  అంటే ఒకదానిమీద కొద్దిగా  నష్టపోయినా  లాభం తక్కిన నాలుగింటిమీద 100 శాతం  లేక ఇంకా ఎక్కువో లాభం!  ఏదో చిన్న లోపం ఉన్న వస్తువయినా, చాలా పాతపడిపోయిన సరుకయినా  స్టాకు  అవకొట్టడానికి  (క్లియరెన్స్) అయినా  ధరలు తగ్గించినా  అది  తక్కన వస్తువులమీద  ఎక్కువ  వేసి  ‘నష్ట’ పరిహారం చేసుకోడం మామూలే. ప్రతి వ్యాపారీ చేసేదిదే.

ఈ మానవ  లోభత్వం వల్ల ఒక మంచి కూడా జరిగింది. పాశ్చాత్య దేశాలలో  విగ్యానానికి పునాదు  పూర్వపు alchemistలు. వారు  వస్తువులనీ బంగారంలోకి మార్చడానికి  చేసిన  ప్రయోగాలతోనే science  పుట్టినది.    ఆరోజుల్లో  వైగ్యానికుల ప్రయోగాలకి బంగారం మాత్రమే లక్ష్యం.

అమెరికా వంటి దేశాలకి రాను రాను మిగిలిన ఒకే  ఒక  దైవం లాభం.  ప్రతి కంపెనీ తమ షేర్లు కొన్న వారికి ఎక్కువ  dividend ఇస్తేన  అమ్మడుపోతాయి.   సంస్కృతి, విలువలూ  అన్నీ లాభం మీదే ఆధారపడి ఉంటాయి. Corporate  morality లాభానికి  బానిస. భోపాల్ గేస్ దుర్ఘటన ఒక ప్రయోగమే  అయినా ఆశ్చర్యం లేదు..  బీద దేశాలకి  ప్రాణ నష్ఞం జరిగినా  వారికి బాధ లేదు,  ఎలకలమీద, గినీ  పిగ్స్ మీద ప్రయోగాలలా   ఇవి మనిషి మీద.  ఈ దేశాల మనుషులకీ గినీపిగ్ పాటి విలువ లేదు.
 మనిషి  సాంకేతికంగా  పెరిగినా   లాభంకి  బానిసై ఆధ్యాత్మికంగా పెరగలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here