www.theTelugus.com

రేపటి  ప్రపంచంలో పుస్తకాలు ఉండవా?

“82ఏళ్ళ మనిషి,‌ జీవితమల్లా ఉద్యోగం చేసి ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలుపెట్టడం ఏమిటి?”
తమ పుస్తకాలు తామే ప్రచురించినవారు వాటిని అమ్మలేక‌, పెట్టిన ఖర్చులు తిరిగిరాక, పడే తాపత్రయం చూసి, అవి online అమ్మడానికి ఒకే website పెడదాం అంటే ఒక యువ MBA ఇచ్చిన జవాబు ఇది.


 Amazon, Flipkart. Snapdeal ఆన్నీ పుస్తకాలతోనే మొదలెట్టి పెద్ద ప్రపంచ  సంస్థలుగా ఎదిగాయికదా, బట్టలు, జోళ్ళు, అమ్మేచోట పుస్తకాలు కొనడం ఇష్టం లేని వారు కొందరు ఉండవచ్చు. స్వీయప్రచురణలకి వేరే సైట్ ఎందుకుండకూడదు అని అడిగితే అతని జవాబు: “పుస్తకాలరోజులు పోయేయి. ఇప్పడు.వాటిని ఎవరూ చదవరు. అందరూ ద్రశ్యకావ్యాలే కోరుకుంటారు. ఈనాటి  ద్రుక్పథం మారిపోయింది. కొన్నేళ్ళకి పుస్తకాలు ఉండనే  ఉండవు. రచనలన్నీ విడియోగా కాని ఆడియో రూపంలో కాని ఉంటాయి.” 

రాబోయే ప్రపంచం ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఒక interior decorator మాటలు గుర్తొచ్చాయి. “ఈ బీరువాలో కనీసం రెండు ఇంచిలు ఉన్న నల్ల అట్టల దుక్క పుస్తకాలు 15 ఉండాలి. ఆపక్క….”.  పుస్తకం హస్త భూషణం అని విన్నాను. ఇప్పుడు గదికి భూషణాలు అవుతాయా? వాటి లోపల ఏముందో అనవసరం — ఎలాగా చదవరు కదా?


మరి పుస్తక విక్రేతలూ‌, ముద్రించే వారూ, ప్రకాశకులూ‌ ,    గ్రంధాలయాలూ ఏమవుతాయి?  “ఫిల్మ్  కెమేరాల జాగాలో డిిిజిటల్ కెమేరాలూ‌, పాత ముుద్రణ.యంత్రం బదులు ఆఫ్ససెట్  యంత్రాలూ రాాలేేేదా? అలాాాగే వాటిికిి బదులు  మరేవో వస్తాయి.,” అని జవాబు.


“ఒక నాగరికతను చంపాలనుకుంటే ప్రజలను చదవకుండా ఆపండి” అని అన్నారు.ట ఎవరో.
 అంటే ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు.  మనం ఇచ్చే గొప్ప బహుమతులలో పుస్తకం ప్రథమ స్థానంలో ఉండేది.  పుస్తకాలతో, కధలు‌,చరిత్ర, తత్వశాస్త్రం  నవల ఏదేనా చదివగలం.   చదివే అలవాటు  చాలా మంచిదని అని యువతరానికి ఎలా చెప్డడం?


నావి పత్రకారుల కోసం మూడు  పుస్తకాలు వెలువడిన తరవాత తెలిసింది పత్రకారులు చదవరనీ, వారిలో చాలా మంది నిరక్షరాస్యులసీ. .  అందుకే ఆవిషయం వదలి తెలుగుజాతి.గురించీ‌ వ్రుధ్ధాశ్రమం  గురించి పుస్తతకాలు రాసి  వ్యాఖ్యలు  పంపమని net    మీద ఎందరికో  పంపితే ఒక్కజవాబు కూడా.లేదు  ఎవరూ చదవకపోడం వల్ల.   అందరూ చెెప్పడం ఒకటేే — ఏ ప్రకాశకులూ తమకి తెలియదు అనే.
మన దేశంలో  పుస్తక ప్రచురణ బంద్  చేయాలేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here