www.theTelugus.com

తెలుగువారు పేకాట ష్రియులా‌ ,ఆట బానిసలా?

ఈ దేశంలో అందరికంటే తెలుగువారికీ  పేకాట ఎక్కువ ప్రియం. ఇద్దరు తెలుగువారు కలిస్తే ఇంగ్లీషులోనో హిందీలోనో మాట్లాడుకుంటారు. ఆలాగే.ముగ్గురు ఏ పెళ్ళిలో నో కలిస్తే ముహూర్తం కూడా మరిచి పోయి పేకాటలో కూర్చుంటారు – ఒకే ఒక. ‘పట్టు’ అనుకున్నా  ఆట ఆపడం మరిచిపోతూ ఉంటారు.

“ఆటల్లో మేటి పేకాట, చేతికి పని, మెదడుకి పదును దీని వల్ల కలిగే లాభాలు  ఎన్నో…పరిచయస్తులుని  ఆప్తమిత్రులు చేస్తుంది 

ఎన్నో ముక్కలు, ఎన్నెన్నో చిక్కులు, మరెన్నో ట్రిక్కులు,”  అని ఒక మిత్రుడు పేకాటని పొగుడుతూ  రాసేడు. నిజమే. కానీ ఏదైనా మితిమీరితే వ్యసనంగా మారటమే కాక హానికరం కూడా.

పేకాట మిత్రులు ఆటకి మాత్రమే. పేకాట నిజజీవితంలో ఎలా ప్రయోగ పడుతుంది? తెలివితేటలు పేకాట వల్ల పదును  పడతాయా‌ లేక తెలివైనవారికే పేకాట సులభం అవుతుందో చెప్పడం కష్టం. కాని దానికి  కొందరు బానిసలవడం మాత్రం నిజం. 

ఒకే చోట పేకాట  కోసం గంటల తరబడి కూర్చోడం వంటికి మంచిది కాదు. కొందరికి పేకాటలో మోసం చెయ్యడం అలవాటు అయి జీవిత విలువలు కూడా మారిపోతాయి. అందరూ కాకపోయినా కొందరేనా చేస్తారు.

ఎన్నో రకాల ఆటలలో బుద్దికి బాగా పని కలిగించేది ఒక్క bridge మాత్రమే. చాలా రకాల ఆటలు ఉట్టి అద్రుష్టం మీదే ఉంటాయి. ఇలా ఆడి ఆడి luck మీద నమ్మకం ఎక్కువ అయి fatalistగా  మారుతారు. అలాగే కొన్ని ఆధారంలేని మూఢ నమ్మకాలు కూడా మొదలవుతాయి. పేకాటలో అదృష్టం లేకపోతే మరిదేనిలోనో (eg. ప్రేమ) లాభం ఉంటుంది అని కొందరు నమ్ముతారు. ఇది మూఢ నమ్మకమే. ఇలా ఇంకెన్నో.

బెంగాల్ లో పనిచేసిన ఒక తెలుగు టెలికాం ఇంజనీర్ , నాకు చెప్పారు ఒక చదువుకోని బెంగాలీ lineman కూడా ప్రపంచ స్థాయి బ్రిజ్ ఆడుతాడని. అందుకే తెలుగువారికీ పూర్తిగా luck మీదే  ఆధారపడి ఉండే  ‘మూడుముక్కలాట’ ఎక్కువ ప్రియమైతే, బెంగాలీలలో బ్రిజ్ ఎక్కువ ప్రచురితం.

దేశంలో చాలా భాగాలలో  పేకాట ముదిరి జూదంగా తయారవుతున్నది. జాదరికి జీవితమే ఒక జూదంగా మారుతుంది. జూదం వల్ల ఎంత ముప్పో  మహాభారతం వల్ల తెలుస్తున్నది. 

పేకాట మిమ్మల్ని జూదరి చేస్తున్నదా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here