www.theTelugus.com

పెన్యురీ పట్నం- 2 By Someswar Bhagwat

అనగనగా ఒక కాలంలో,  పుస్తకాలు చదివే మసుషులుండేవారు. ఆశ్చర్యంగా ఉందా? ఔను‌ అప్పుడు ఇంటర్నెట్, వెబ్సైట్, గూగుల్, యూట్యూబ్, స్మార్ట్ ఫోన్, ఏమీ ఉండేవి కాదు. ఆ పురాతన, అనాగరిక కాలంలో పుస్తకాలు చదివేవారు.  తాము అవి చదవలేని జంతువులకన్నా చదువు రాని మూర్ఖులకన్నా గొప్ప అని గర్వపడేవారు. కొందరు ‘పుస్తకం హస్త భూషణం’ అని నమ్మి గొప్పగా కనపడే.పుస్తకాలను  తీసుకుని తిరీగేవారు.

ఆ తరవాతి కాలంలో బాగా కనిపించే పుస్తకాలు (లోపల ఏమీ లేక పోయినా వారు చెప్పిన దళసరీ,  రంగులూ ఉన్నవి) ఇంటిని అలంకరణ చేసేవారి సొత్తు అయ్యాయి.

ఈ జ్ఞానం అంతా రెండు పుస్తకాలు రాసి ప్రచురించిన తరువాత.నాకు వచ్చింది. రెండో పుస్తకంలో అది రాయడానికి సాయపడిన ఐదుగురికీ‌ దిద్దిన (ఎడిట్  చేసిన) మిత్రుడికీ ధన్యవాదాలు తెలిపాను.వారికీ కూడా వారి తప్పు తెలిసి ఈ ఐదేళ్ళలో అందరూ ( ఒకరు తప్ప)  మాటవరసకైనా ఫోన్ కూడా చెయ్యరు.  ఫోన్ ఎత్తరు.

పుస్తకం అట్ట మీద కార్టూన్ ఎందుకు? రాయడం పూర్తి అవుతుండగా R.K లక్ష్మన్, రాజీందర్  పురీ మరణించడం‌, కేజ్రీవాల్ vs బిజెపి ఎన్నికల్లో.  కార్టూన్ల తోనే ప్రచారం జరగడం‌, అంత ముందు చార్లీహెబ్డో పత్రిక కార్టూన్  విరోధంగా  నరవధ  జరగడం వల్ల నాకు కార్టూన్ ని ఒక పాదకీయంగా పరిగణించాలని అనిపించింది.,

నేను సంపాదికుడిగా పనిచేసిన. ఒక దినపత్రిక కార్టూనిస్టు పెద్ద.స్థాయిలో.ఉన్నా సమయం ఇచ్చి online  పంపిన కార్టూన్ వాడి ముఖ పుష్టం.తయారు చేసేను డిసైనర్ ని పెట్టుకోలేక.

పుట్టుకతోనే  ఆ కళ రావాలి, దాన్ని నేర్ప బడదు అనేవారితో ఏకీభవించను .కాని జర్నలిస్టులు పుట్టాలి, వారిని తయారు చెయ్య లేము, అన్నది కూడా నిజం కాదు. రాయడంలో రుచి ఉండి, ‌ ప్రతీ విషయం తైలుసుకోవాలన్న కోరిక,  రాత్రి పగలూ  శ్రమ పడడానికి సంసిద్ధత, ఉంటే వారికి శిక్షణ ఇచ్చి కొంత అనుభవం తరవాత వారిని పత్రకారులుగా రూపొందించ వచ్చు. 

పుట్టుకతోనే ఎవరూ కళాకారులు అవ్వలేరు. కాని అవ్వడానికి కావలసిన అభిరుచి, మనస్తత్వం (mindset) ఉండాలి.. ఇది ఉట్టికళ కాదు,  ఆలాగే సాంకేతిక పధ్ధతి (technic) కూడా కాదు. రెండూ కలియాలి. నా పుస్తకంలో ఇదే విడమరిచి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ‌ ఈ దేశపు పత్రికా ప్రపంచపు ఎలా మారిందో చూపడానికి ప్రయత్నం చేసేను. బైటి ప్రపంచానీకి ఈ వృత్తిని పరిచయం చెయ్యడం కూడా ఒక ధ్యేయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here