www.theTelugus,com

పెన్యురీ పట్నం-5 By సోమేశ్వర్ భాగవత్

మరొకరు రాసినదాన్ని దిద్దడంలో సబ్ ఎడిటర్ చూడవలసినది ఒక్క  వ్యాకరణం, శుద్దలేఖనం  (దీర్ఘం‌, హ్రస్వం, పదాల మధ్యజాగా, వాక్యాలు ఎక్కడ విరవాలో, మొదలైనవి) మాత్రమే కాదు. హ్రస్వానికి బదులు దీర్ఘం రాస్తే తెలుగులో ఐతే అర్ధమే మారిపోతుంది – కని అంటే (పిల్లలు) పుట్టించడం, కాని అంటే but (ఐనా). అలాగే లేఖ, లేక. 

ఒక వాక్యం ఎలాగ ‘విరీచి’నా వేర్వేరు అర్ధాలు వస్తాయి. “రామునితో కపివరుడు…” అంటే రాముడూ, హనుమంతుడూ అని అందరికీ తెలుస్తుంది. అదే ‘రామునితోక పివరుడు” అంటే నవ్వుల పాలై రాముడికీ తోక ఎలా వచ్చిందో, ఆ పివరుడు ఎవరో చెప్పుకోలేక ‘తల  ప్రాణం తోకకి’ వస్తుంది.

 దేవా‌, నీవుత్తముండవు‌. నేను పాతకుండను’ అని  గ్రాంధిక భాష వాడే రోజులలో చర్చి ప్రార్ధనలలో అనేవారు. అదే “దేవా.”నీవుత్త  ముండవు నేపాత  కుండను” అంటే ఆపాతబడిన కుండని ఏ ముండ తలపై బద్దలు కొట్టడమో తెలియక దేవుడినే తిట్ట వలసి వస్తుంది. ప్రేమ ‘లేఖ’ తో మొదలైన దాంపత్యం, ప్రేమ ‘లేక’ విడాకుల కి దారి తియ్యవచ్చు. ఇలాంటి  ఉదాహరణలు కోకొల్లలు. ప్రతి భాషలో ఉంటాయి.

సరైన పదాల వాడిక‌, కఠిన పదాల పర్యాయాలు, పత్రిక ద్రుష్టి కోణం (policy), ఆవార్త నేపథ్యం (context) అన్నీ సబ్ చూడాలి. ఆ  వార్తని వత్రికలో ఏ జాగాలో పెట్టాలో నిశ్చయించేది  కూడా

సబ్ ఎడిటర్ కానీ అతని మీది వారు కానీ చేస్తారు. ఈ రాసేవారు అందర్నీ కలిపీ ఇంగ్లీషు పత్రికలలో బ్యూరో అనీ, అలాగే‌ ఎడీట్ చేసె వారందరూ కలిపీ డెస్క్ అనీ పిలవబడతారు. బ్యూరోలోనూ‌, డెస్క్ మీదా వరిష్టత బట్టి చాలా స్తరాలు ఉన్నాయి. 

ట్ర్రైనీలు ప్రొమోట్ ఐ, రాసే వారైతే రిపోర్టర్ దిద్దే వారైతే సబ్ ఎడిటర్ ఔతారు. ఈ రెండూ  ఒకే స్థాయి కాబట్టి రిపోర్టర్-కం-సబ్ ఎడిటర్ గా నియమింపబడి ఆతరవాత  అభిరుచి  ప్రకారం బ్యూరోలోకాని డెస్క్ పైనకాని నియోగింప బడతారు. రాసేవారందరూ కొంత కాలం డెస్క్ మీద ఉంటేనే మంచిది – పత్రికా రచన విథానం అలవడుతుంది. 

డెస్క పై ఉన్నతి (promotion) సీనియర్ సబ్, ఛీఫ్ సబ్, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ తరువాత సహసంపాదకులు గా అవుతారు..అలాగే బ్యూరోలో సీనియర్ రిపోర్టర్, ప్రిన్సిపుల్ కరెస్పాండెంట్ విశేషసంవాదదాత (special correspondent) ఐ, అసిస్టంట్ప్.ఎడిటర్,  సహ సంపాదకులు (deputy editor) అవవచ్చు. సాధారణంగా సంపాదకులు కానీ ప్రధాన సంపాదకులు పదోన్నతి వల్ల (by promotion) కాక యజమాని నిర్ణయం మీద జరుగుతుంది. 

  పదోన్నతి వ్ణల్ల జరిగితే తరచు డెస్క్ నుంచే ఎన్నుకోబడతారు – కారణం వారికి పత్రిక తయారు తెలుసు కనక. రాసే పత్రకారులకి సాధారణంగా తయారు (production) సాధక బాధకాలు తెలియవు..చాలా గొప్ప రచయిత అరుణ్ షౌరీ ఎక్స్ప్రెస్ సంపాదకుడిగా అట్టి కాలం కొనసాగక పోడానికి ఇది కూడా కారణం అవొచ్చు.

అతను ఐదారు కోలంలు పొడుగున్న తన రచన  పూర్తిగా మొదటి పేజీ మీద ఉండాలనే వారు. మొదటి పేజీ లో పత్రిక పేరు (masthead) పోగా సుమారు ఏడుకోలంలు మాత్రమే ఉంటాయని‌ పూర్తగా ఆ పేజిలోనే అంతా పెడితే మరే వార్తా ప్రచురించడం సాధ్యం కాదని అతనికి బోధపరచడం కష్టమయ్యేది. ఆఖరికి, “మీరు జర్నలిస్టులు  –(తను కాదన్నట్టు) – మీ ఇష్టం” అనేవారు.☺

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here