www.theTelugus.com

పెన్యురీ పట్నం-6 By సోమేశ్వర్ భాగవత్

గుడ్డి అనుకరణేనా మన సంస్క్రితి?

మన మీడియా సంస్కృతి  ఇంగ్లాండ్ కి బానిసగా ఉన్న రోజులదే. స్వతంత్రతా సమరంలో భాగంగా గాంధీ, తిలక్, గోఖలే, ప్రకాశం పంతులు వంటి ఎందరో నేతలు ఆ పని కోసమే పత్రికలు నడిపినా‌ మన ఆదర్శం లండన్ టైమ్స్, ‌‌ గార్డియన్ లాంటి బ్రిటిష్ పత్రికలో, లేక అమెరికాకు చెందిన న్యూయార్క్  టైమ్స్ వాషింగ్టన్  పోస్ట్ మాత్రం.  

జపాన్ దినపత్రిక ‘అషై షింబున్’ మొదటిసారి facsimili  సంస్కరణ  ప్రచురించిన విషయం మన పత్రకారులందరికీ తెలుసు.  కానీ మన దేశంలో మొట్ట  మొదటి సారి  ఇదే పద్ధతిలో ‘ది హిందూ’ ఎన్నో చోట్ల నుంచి  వెలువడిన విషయం చాలా మందికి తెలియదు.

ఇప్పుడు దాన్ని అనుకరించి  అన్ని పత్రికలకీ ప్రతి జిల్లాలో ఒక ఎడిషన్ .  ‘ది హిందూ’ యజమాన్యం లా తరం మారితె ద్రుష్టి కోణం (policy) కూడా మారుతుంది.  N. Ram అధ్వర్యంలో కమ్యూనిస్టు, జిహాదీ,  హిందూ వ్యతిరేక శక్తులని ఆ పత్రిక బలపరుస్తున్నదని చాలామంది నమ్మకం. దానివల్ల ఎందరో పాఠకులు (అలవాటుకి లోబడిన వారు తప్ప) మారటం సహజం. పాత దినపత్రికలు తరం మారితే బంద్ అవడమో‌, ద్రుక్పథం మారడమో సాదారణంగా జరుగుతుంది.

గుడ్డిగా అనుకరించడం, విధి మీద నమ్మకం, భారతీయుల ముఖ్య లక్షణం. అలాగే “పొరుగింటి పుల్లకూర రుచి” అనుకుని మన దేశంలోని ఏ గొప్ప విషయం ‘ఫారిన్’ వారు పొగిడితేనే మనం అంగీకరిస్తాం. ఇదే మన మీడియాలో కూడా కనపడుతుంది.

ఒక వార పత్రిక సీరియల్ నవల ప్రచురించిన వెంటనే తక్కినవన్నీ అదే పని చేస్తాయి. కొన్ని పత్రికలు ఎప్పుడు చదవడం కొత్తగా ప్రారంభించలేము — అందులో ఒక చిన్న కథ తప్ప అన్ని  సీరియల్ నవలలే —  ఒక కొత్త సీరియల్ మొదలైతే తప్ప.

ఒక మలయాళీ నటుడు 150 సినిమాల్లో నటించి ప్రపంచ రికార్డు స్థాపించాడని విని ఒక విచక్షణా జ్ఞానం ఉన్న మలయాళీ మిత్రుడు తన అభిప్రాయంగా చెప్పిన విషయం గుర్తు వచ్చింది: “కాదు, అతను ఒకే సినిమాలో 150 సార్లు నటించేడు”.  అన్నిటి కథలు రమారమి ఒకటే!

అలాగే నాతో పనిచేసిన ఒక వరిష్ట పత్రకారుడు (ఆంధ్రప్రభ విశేష సంవాదదాత ‘నాయన’ పుస్తక రచయిత కీ.శే. జి. క్రిష్ణ) అనేవారు: “మన వారపత్రికలు ఒకరి చెత్తబుట్ట మరొకరు కెలుకుతూ ఉంటారు. ఒక పత్రిక ‘ఛీ..చెత్త’ ఆని పారేసిన రచనని మరొకరు ‘ఇది మణిపూస’ అని ప్రచురిస్తారు.” (They dip into each other‘s wastepaper baskets,  one publishing as a masterpiece what another threw away as trash). 

నిన్నటి పత్రికల సంస్క్రతి గుడ్డి గా అనుకరించడం ఐతే ఈనాటి సంస్కృతి ప్రతి విషయాన్నీ సంచలాత్మకం చెయ్యడం.  కారణం  మాత్రం ఒకటే. ఇప్పడు అనుకరించేది TRPల కోసం పరిగెత్తే TV చేనల్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here