‘పెన్యురీ’ అనే పట్నం -8 By Someswar Bhagwat
శీర్షిక రాయడం: విద్య, విధానం, కళ, కౌశల్యం
సబ్ ఎడిటర్ పత్రికకీ వెన్నెముక, కళ్ళూ, మెదడు అనీ, కాళ్లు చేతులు ఐన రిపోర్టర్ తెచ్చిన వార్తను చదువరులు ఎలా చూస్తారో నిశ్చయం చేసేది తనేనని తెలుసుకున్నాం. సబ్ ఎడిటర్ (అమెరికాలో కాపీ ఎడిటర్ అంటారు. సబ్ అంటే అక్కడ జలాంతర్గామి అనగా submarine) చేసే పనులలో ముఖ్యమైనది శీర్షక రాయడం. అది ఒక విధానం, కళ. కౌశల్యం (skill) అనుభవంతో మాత్రం వచ్చే విద్య.
శీర్షిక రాయడంలో మొదటి సూత్రం: వార్తలో లేక రచనలో ఏముందో తక్కువ పదాలలో చెప్పాలి. చాలా మంది పత్రికలలో శీర్షికలు మాత్రమే చదువుతారు. శీర్షిక మొదటి వాక్యం చదివేలా చెయ్యాలి. మొదటి వాక్యం కాని వాక్యాలు కాని (intro) రచనకి ప్రాణం. రచయిత చెప్పదలుచుకున్న అంతటికీ అది సారం. దాన్ని చదవితే తక్కిన భాగాలు తప్దక చదవాలన్న ఉత్సుకత కలగాలి. అది కూడా సబ్ పనే. చాలా సార్లు రచయిత రాసిన దాన్ని అంతా చదివి intro మార్చవలసివస్తుంది. అలాటప్పుడు రిపోర్టర్ కి చూపడం మంచిది.
శీర్షిక, intro రాయడంలో ముఖ్యయంగా గమనించ వలసిన విషయం అవి ఈ ఆరు ప్రశ్నలకి జవాబిస్తున్నాయా లేదా అని:-
ఏమిటి, ఎవరు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎందుకు? ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం మన దేశం వచ్చిన Rudyard Kipling ఆనే కవి రాసిన వద్యం: ‘I have six faithful servants, who taught me all I knew. Their names are What and Why and When And How and Where and Who’నుంచి. కిప్లింగ్ ప్రకారం మనకు తెలిసినదంతా ఈ ఆరు ప్రశ్నలు అడగడం వల్లే. మొదటి పేరాలో ఏమిటి ఎక్కడ జరిగిందో తెలియాలి. ‘అతను అన్నారు’ అని పదే పదే రాసి వ్యక్తి పేరు రాయకపోతే, లేక ఏమన్నారో చెప్పకపోతే నవ్వులపాలౌతాం.
‘ఎప్పుడు, ఎక్కడ’ చెప్పే విధానంలో మార్పు మన కొత్త సంస్కృతి వల్ల వచ్చింది. ఎలా, ఎందుకు జరిగిన దాని నేపథ్యం (context) మీద ఆధారపడతాయి. ఇది దాని iinterpretation కావొచ్చు. ప్రతి ‘కాపీ’కి పూర్వం ఒక dateline ఉండేది. అందులో ఎక్కడ, ఎప్పుడు తెలిసేవి. మొదటి పేరాలో ఇక్కడ ఇవాళ అంటే సరిపోయేది.
. ఈరోజు ప్రతి పత్రిక కీ ఎన్నో ఎడిషన్లు ఉంటున్నాయి. పూర్వం డాక్ ఎడిషన్ కి తీసుకునే ప్రతి వార్తకీ తారీకు మార్చి ‘ఇవాళ’కి బదులు ‘నిన్న’ అని రాయవలసి వచ్చేది. లైనో/మోనోరోజులలో ఐతె కంపోసిటర్ చెత చేయించవలసి వచ్చేది. ఇప్పుడు ఆ పద్ధతి మారి ఊరిపేరూ రోజూ రాస్తారు.
ప్రతి పత్రికకీ ఒక రచనా విధానం (style) ఉంటుంది. అది stylebookలో కాని stylesheet లో కాని వివరించబడుతుంది. దిద్దే వారు దాని ప్రకారం పని చెయ్యాలి. కొందరు dateline పూర్తిగా తీసేస్తే మరికొందరు ఊరిపెరు మాత్రం ఉంచి లోపల వారం ఇస్తారు. దీనికి కారణం బయట ఊళ్ళ వారి దృష్టి వారి ఊరి పేరు ఆకర్షించ గలదు. హైదరాబాద్ లో ప్రచురించిన ఫత్రికే కర్నూలు కూడా వెళ్తే ఆ ఊరి వారు అక్కడి వార్తలు చదవడం సహజం.
సాంకేతిక ప్రగతి వల్ల ఇప్పుడు హైదరాబాద్ లోనే ప్రతి జిల్లాకు వేరే ఎడిషన్ తయారు చేయడానికి వేర్వేరు ‘desk’లు ఉంటున్నాయి. పెద్ద ఊరైతే ఆక్కడే కార్యాలయం పెట్టి facsimili పధ్ధతిలో కార్యాలయానికి స్థానిక వార్తల కోసం జాగా వదలి కేంద్రీయ desk నుండి పుటలు (pages) పంపుతారు. కొన్నిపత్రికలలో వేరు వేరు desk లు వేరే ఊళ్ళలో ఉండొచ్చు. ఉll ఓ ఢిల్లీ పత్రిక వాణిజ్య పుట(లు) ముంబై లొ తయారవ్వొచ్చు
-అది దేశానికి ఆర్థిక రాజధాని కనుక. ముంబైలో టెస్ట్ కాని IPL ఆటలు లేక దేశస్థ రీయ క్రీడలు కాని జరుగుతూ ఉంటే sports page ముంబైలోనే తయారు అవొచ్చు. ఒక కేంద్రంలో సిబ్బంది రాక పోతే మరో కేంద్రం చేత ఒక పేజీ సంపాదకుడు చేయించ వచ్చు. ఈ మార్పులన్నీ కొత్త సాంకేతిక జ్ఞానం (technology) వల్ల వచ్చినవి.
ఇంగ్లీషు లోనూ, భారతీయ భాషలలోను శీర్షక రాసే విధానాలు వేరైనా కొన్నింటిలో ఒకటే. ఇంగ్లీషు లో capitals వాడకూడదు అన్న నిబంధన ఉండేది. కారణం చిన్న అక్షరాల కంటే వాటిని చదవడం కష్టం..మనం ప్రతి అక్షరం చదవం.(మరీ చిన్నపిల్లలు, కొత్తగా లిపి నేర్చుకున్నవారూ తప్ప). పదం మీది ఆకారం (outline at the top of the word) చూసిన వెంటనే మెదడు ఆ పదమేమిటో నిశ్చయించుతుంది. అందుకే ఒక పదానికి బదులు అలాగే కనిపించే మరో పదం చదవడం, ప్రూఫులలో తప్పులు, జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం మన మెదడుకి సరైన పదం తెలుసు కాబట్టి తప్పు ఉన్నా సరైనదిగా చదువుతాం. అందుకే ఎక్కువ విద్య లేనివారే ప్రూఫ్ రీడర్ పనికి తెలివైన వారికంటే నయం.
Capitalsలో ఉన్న ఒక పదం మీది భాగం మూసేస్తే చదవడం కష్టం. ఉll WITH అనే ఇంగ్లీషు పదం కింది భాగం మాత్రం చూస్తే WIII లాగా కనిపిస్తుంది. మనకి భాషలో capitals లేవు కాబట్టి ఈ బాధ లేదు. ఈ నిబంధన కూడా ఈ రోజు చాలా పత్రికలు పాటించక కొన్ని శీర్షికలు అప్పుడప్పుడు కేపిటల్ అక్షరాలలో ఇస్తున్నారు.
ప్రతి పత్రికలోనూ వారి style నిర్ణయించినపుడు ముఖ్యవార్త (lead) మొదటిపేజీలో ఎలా ఉండాలో, లోపలి పుటల్లో ఎంత పెద్దది ఉండాలో మూందుగానే నిశ్చయిస్తారు. పతాక శీర్షిక (banner) అరుదుగా చాలా పెద్ద వార్తకి మాత్రం వాడాలని ఒక సూత్రం, ప్రతిరోజూ వాడితే దాని ప్రాముఖ్యత పోతుంది కనక. బేనర్ అంటే పేజిలో అన్నిటికన్నా పైన పూర్తి 8 కోలమ్లూ విస్తరించి ఉండే శీర్షక. మరీ పెద్ద వార్త ఐతే పత్రిక పేరు (Mast-head) పైన పెట్ట వచ్చు (చంద్రుడిపై మనిషి కాలు మోపినప్పడూ రాజీవ్ గాంధీ హత్య ఐనప్పుడూ…)
కొన్ని వత్రికలు కోలం సైజు మార్చి 8 కన్నా తక్కువో, ఎక్కువో చేస్తున్నారు -ఆధునిక photo composing technology వాడి. అలాగే ఈ విజ్ఞానం వల్ల ప్రతి పేజీలో రంగులు, బొమ్మలూ వాడగలుతున్నాం. పూర్వం ఒక పేజిలో అన్ని రంగులూ ఉన్న బొమ్మ ముద్రించాలంటే దానికి నాలుగు బ్లాకులు కలర్ సెపరేషన్ వాడి \చేయవలసి వచ్చేది.
వేరువేరు రంగులకి ఉన్న ఈ నాలుగూ ఓ మిల్లీమీటర్ కూడా అటూ ఇటూ అవకుండా ఒకే చోట ముద్రిస్తే కాని రంగుల బొమ్మ సరిగా కనిపించదు. దీన్ని registration అంటారు. పేజిలో ఆఖర్ని ఒక +గుర్తు లెక నాలుగు రంగు చుక్కలో చూసి ఉంటారు. నాలుగు మాట్లు ముద్రించినపుడు నాలుగు +గుర్తులూ ఒకదానిమీద మరొకటి పడి ఒకే +గా కనించాలి. ఓ అర mm అటూఇటూ ఐతే బొమ్మ చెదిరి పోయినట్టు కనీపిస్తుంది. అంటే registration బాగా లేదనమాట.
ప్రపంచంలో ఏ క్షేత్రం లోనూ లేనన్ని మార్పులు ఫొటోగ్రఫీలో , దానితోపాటు దాని మీదే ఆధారపడి ఉన్న ముద్రణలోనూ వచ్చే యి. ఒకప్పుడు ప్రతి రచనా వేరు వేరు అక్షరాలుండే చేతి కంపోసింగ్ లేక మోనోటైప్ విధానం లో కాని ఒక పంక్తి అంతా ఒకే ముక్కగా ఉండే లైనోటైప్ లో కానీ కంపోస్ అయేదనీ ఈ తరం వారికి తెలియకపోచ్చు. Upper case (u.c.) కేపిటల్ అక్షరాలని సూచిస్తుంది.
అలాగే lower case (l.c) అంటే చిన్న అక్షరాలు. ఈరెండుపదాలూ ఇప్పటకీ వాడుకలో ఉన్నాయి కాని ఈ పదాలు పుట్టినది పెద్ద (capital) అక్షరాలన్నీమీది (upper) అరలలోనూ చిన్నవన్నీ కింది (lower)అరలలోనూ ఉండటం వల్ల అనీ ఎందరికో తెలియదు. మీది అరలో టైప్ అక్షరక్రమం ప్రకారం ఉంటీ, కింంద మాత్రం టైపురైటరు కీబోర్డ్ లా ఏది ఎక్కువ వాడకం లో ఉంటి అది చేతికి దగ్గరగానూ పెద్దగానూ ఉండేవి. రచనవేపు చూస్తూ టైపుని చూడకుండానే కూర్చేవారు. ఒకప్పుడు ఇంగ్లండ్ లో (చదివేవారి సాయంతో) గుడ్డివారు కంపోస్ చేసేవారుట.
మన దేశం పత్రికలకు ఎప్పుడూ తాజా వార్తలనే ప్రచురిస్తున్నట్టు కనిపించాలని ఆరాటం. అందుకే ఇంగ్లీషు పత్రికలలో శీర్షికలు అన్నీ ప్రస్తుత కాలం (present tense)లో ఉటాయి. ‘చెప్పేరు’కి బదులు ‘చెప్తారు’ అని రాస్తారు, వార్త భూతకాలంలో ఉన్నా. అలాగే శీర్షకలో ‘ఇవాళ’ అంటే పత్రిక మీద ఉన్న తారీకు.
అదే వార్తలో ‘రేపు’ అని రాయ బడుతుంది – వార్త ముందటి రోజు రాయబడింది కనక వార్తలో ‘ఇవాళ’ అంటే జరిగినద నిన్న, శీర్షికలో జరిగిపోయిన దాన్ని జరుగుతున్నదనీ, రేపు జరగబోతోంది అని రాస్తే ఇవాళ జరుగుతుందని పెడతారు.