‘పెన్యురీ’ అనే పట్నం -8 By Someswar Bhagwat
శీర్షిక లో యతి ప్రాసలు, అలంకారాలు
దిద్దే పత్రకర్తలు చెసే అన్ని పనుల్లో ముఖ్యమైనది వ్యాకరణం, తప్పులు, సరిచేయడం మాత్రమే కాదని మంచి శీర్షిక(heading) ఇవ్వటం అని తెలుసుకున్నాం. వ్యాకరణబధ్ధంగా , ఏతప్పూ లేకుండా, ఉన్న పత్ర రచన కూడా దాని అసలు ఉద్దేశం పూర్తి చేయకపోతే చెత్తకీందే వస్తుంది. ఒక పత్రిక పని సులభమైన బాషలో అందరికీ బోధపడేట్లా జరిగినది తెలియ చెయ్యడం – రచయిత పాండిత్యం చాటడం కాదు. కాని ఆ బోధపడ్డం అది చదివితేనే కదా? శీర్షిక పని చదివే వారి ద్రృష్టిని ఆకర్షించి, ఆ విషయం మీద ఆసక్తి కలగజేసి, చదవటానికి ప్ర్రేరేపించడం.
అలా చెయ్యడానికి ఆ శీర్షిక కంటికి బాగుండే type fontలో ఉండాలి. అది సబ్ఎడిటర్ నిర్ణయించాలి. ప్రతి typeకీ ఒక ప్రత్యేకత, గుణం (character) ఉంటాయి. ఒక కోలం వెడల్పు లో ఆ size ఆ fontవి ఎన్ని అక్షరాలు పడతాయో తెలియాలి. పెద్ద సైజు అక్షరాలు తక్కువ, చిన్నవి ఎక్కువ వస్తాయి. వార్త ప్రాముఖ్యత మీద టైపు రూపం, సైజు ఆధారపడి ఉంటాయి. ఇది నిశ్చయించేది సబెడిటరే. పూర్వం టైపురూపం, సైజు రాసి కంపోసిటర్లకి పంపితే వారు కంపోస్ చేసేవారు. సబ్ కి లెఖ్ఖ కట్టడం (unit count) సరిగా తెలియకపోతే fit అవదని తిరిగి పంపేవారు. కంపోసిటర్ల తప్పు వల్ల కూడా ఇది జరగవచ్చు. (అందుకే నేను కంపోసింగ్ నేర్చుకున్నాను).
ఇప్పుడు కంప్యూటర్ మీద సబ్ తనేరాయాలి. పెద్దదైతే కింద వరసలోకి పోతుంది. ముఖ్యవార్త ఐతే పెద్ద టైపో ఎక్కువ కోలంలో అవుతుంది. ఉll రహదారిపై ఒక మనిషి మరణిస్తే గుర్తు తెలియక పోతే శీర్షిక లేని ఓకెపేరా filler కావచ్చు లేక చిన్న శీర్షక 14 పోయింట్ లో ఉండవచ్చు. అదే వింతైన దుర్ఘటన ఐతే box కావచ్చు, కొంచెం తెలిసిన మనిషి ఐతే రెండు, ఇంకా ప్రముఖులు కాని ఎందరో ఐతే మూడు కాని కావచ్చు. ముఖ్యమంత్రి లాటి ప్రముఖులు ఐతే మొదటి పేజీలో ‘ప్రధమ లీడ్’గా పెద్ద అక్షరాలతో ప్రచురించబడ వచ్చు. అంతకన్నా పెద్ద వార్త ‘పతాక శీర్షిక’ (banner) అంటే 8 కోలంలు వెడల్పు ఉన్నదవుతుంది. దశాబ్ధానికో, శతాబ్ధానికో పెద్ద వార్త ఐతే పత్రిక పేరుకన్నా మీద శీర్షిక పెట్టబడుతుంది. Banner మరీ తరుచుగా వాడితే దాని ప్రాముఖ్యత పోతుంది. పెద్ద వార్త వస్తే ఏమిటి చెయయ్యాలో తెలియక తికమక పడవలసి వస్తుంది.
ఈమధ్య శీర్షికల్లో యతి ప్రాస అలంకారాలూ (fIgures of speech like alliteration, pun) వాడడం ఒక ఫేషన్ ఐపోయింది. కొన్ని తెలుగు పత్రికలలో మరీ ఎక్కువగా. రెండు ప్రముఖ పత్రికలు రెండో మూడో పదాలు కాని ఒకే లాటి పదాలు, అలంకారభరితమైన పదాలు వాడడం ఒక style చేసుకున్నాయి. ఇది సహజంగా జరిగి మంచి సమయస్ఫూర్తి ఉపయోగించే వైతే మంచిదేకాని ‘తెగేవరకూ లాగి’తే పిచ్చిపిచ్చి శీర్షికలు రావొచ్చు. వెనకటికి ఒక కవిభార్య “ఎందరో తక్కిన స్త్రీల గురించి పద్యాలు రాస్తారు, నామీద ఎందుకు రాయరు?” అని పోరు డితే రాసి, ఆఖరి పాదంలో ఏమీ దొరక్క “ప్రాసకోమేస్తినే.కూసి ముండ” అన్నాడుట. సహజంగా రాకపోతే ఇలాగే ఉంటుంది శీర్షిక. సహజంగా ఆకస్మికంగా వచ్చిన అలంకారం వేరు deadline పరుగులో ఒత్తిడితో తట్టే అలంకారం వేరు. సబ్ఎఎడిటర్ కి చాలా స్రృజనాత్మీకత (creativity) అవసరం.
చాలా పెద్ద వార్త ఆఖరినిమిషంలో వస్తే అన్నీ తారుమారు ఔతాయి. అప్పుడప్పుడు లేటుగా ముద్రణ మొదలెట్టవలసి వస్తుంది. అలాటప్పుడు న్యూస్ ఎడిటర్ ని ఫోనుమీద సంప్రదించాలి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పెద్ద వార్త తప్పిపోడం కన్న లేటవడం పెద్ద నేరంకింద పరిగణీంపబడేది. అమెరికా అధ్యక్షుడు కెన్నడీ హత్య వార్త మొదటిపేజి తయారు ఐపోతున్న సమయంలో వచ్చింది. ఆరోజే ఒకే విమానంలో ప్రయాణం చేస్తున్న నలుగురు మనసైనికదళ జెనరల్లు ఒక ప్రమాదంలో మరణీంచారు (అందుకే అంతపెద్ద అథికార్లు ఒకే చోటికి వెళ్తున్నా వేరువేరుగా ప్రయాణీంచాలనే నిర్భందం వచ్చింది) అరోజే మహరాష్ట్ర ముఖ్యమంత్రి కన్నంవార్ మరణిచారు. ఇవికాక ఇంకా కొన్ని పెద్దవార్తలు ఉండేవి. ఇవన్నీ లీడ్ చెయ్యడానికి తగినవే. అలాటప్పడు రాత్రి 2 దాటేక కెన్నడీ హత్యవార్త వచ్చింది. ఎడిషన్ తీస్తున్న ముుఖ్న సబ్ఎడిిిటర్ మీద ఎంత వత్తిడి ఉండేదో ఊహించవచ్చు. ఆరాాత్రి డ్యూటీమీన్న సాత్విిక్ అనే ఒక ఛీఫ్ సబ్ఏడ్చేేడని చెప్తారు – కెన్నడీకోసం కాదు. ఆతనికీ న్యూస్ ఎడిటర్ కీ ఆఫీసు వైరం వల్ల మాటలు లెవు. మరి ఈవిషయం చెప్పి ఎలా పత్రిక లేటౌతుందని తెలియచేయడం అని.
అలాగే లాల్ బహదూర్ శాస్త్రి మరణవార్త పత్రిక ముద్రణ మొదలవుతుందనగా వచ్చింది. మాఊళ్ళో అన్ని పత్రికలూ ముద్రణ ఆపేరు. నేనుమాత్రం కొన్ని. నిమీషాలలో మొదటీ పేజీ మీద ఉన్న ఒక బాక్స్ తీసేసి దానిజాగాలో శాస్త్రి బొమ్మ పెట్టి పేజిలో అట్టడుగున ఉన్న వార్తలు తీసీ అంతటినీ కిందకి తోసి ఒక పతాక శీర్షిక వేసి మొదటొచ్చిన flash linoవారికిచ్చి ప్రూఫ్ తియ్యకుండా బైప్.లైన్లనే.చదివి పేజిలో పెట్టి పత్రిక వెలువరిస్తే అది నగరంలో ఏకైక పత్రిక అయింది. అప్పడు మీదివారికి తెలియజేస్తే వారొచ్చి తక్కినవారు పత్రిక తీసే సమయోనికి ఒకరెండుపేజిల బులెటిన్ తీసేరు.
ఆ పత్రిక కి రిపోర్టర్/ఫొటోగ్రాఫర్ నేనే కాబట్టి మొదటి ఎడీషన్ ఎవరో చదువుతున్న ఫొటో ఆ బులెటిన్ లో.ప్రచురించి ఆరోజు పత్రిక అమ్మకం రెండింతలు అయింది. తెలవారుతున్నపుడే పనికి వెళ్తున్న మిల్ కార్మికులు, వారికోసం తెరిచిన రోడ్ పక్క టీ దుకాణాలవారూ తెలిపిన ప్రతిక్రియలతో. ఫోటోలతో బులెటిన్ నిండి పోయింది. ఆరోజుల్లో కరిగిన సీసంతో కంపోస్ ఐన వేడీ లైనో టైప్ లైన్లే కాదు ఫొటో ముద్రించాలంటే బ్లాకులు తయారు చెయ్యవలసి వచ్చేది. దానికీ గంట. ఫొటో ఫిల్మ్ ‘కడగ’డానికి సమయం పట్టేది. మొదటి ఎడిషన్ తీసీన వెంటనే పొటోలు బ్లాకులూ తయారు చేసే మనిషిని లేపి తయారుగా ఉంచడం వల్ల ఇదంతా చేయబడింది. దానికి అన్నిటికన్నా సమయస్ఫూర్తి అవసరం. ఇప్పుడు అంతా మారి అన్నీ నిమిషాల లలో చెయ గలూగుతున్నాం.
అందువల్ల పత్రికా సంస్కృతి మారినా , సమయస్ఫూర్తి అవసరం మాత్రం మారలేదు.
ఆఖరి నిమిషం లో చాలా ముఖ్య వార్త వస్తే సబ్ ఎడిటర్ పనిచేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది –అతడి/ఆమె గొప్పతనం లేక వైఫల్యం.