మసవాడు’ ఎదిగితే మనం చూడలేము
రాజా రవి వర్మ పేరు తెలియకపోతే మీరు రాతియుగంలో జీవిస్తున్న అడివి మనిషి అనమాట. దామెర్ల రామారావా? ఎక్కడో ఎప్పుడో విన్న పేరు. కొండపల్లి శేషగిరిరావు? ఎవరతను? అందమైన అమ్మాయి ‘బాపు బొమ్మలా’ ఉందని అందరూ అంటారు కారణం అతను చిత్రకారుడవడం కంటే సినిమా మనిషి కావడమే.
‘శ్రీశ్రీ’ అంటే సినిమాలకి పాటలు రాసే మనిషిగా గుర్తించే తెలుగు వాడికి తెలుగు వాడంటే చులకన. “మనవాడు బాగుపడీపోతున్నాడురా” అని గట్టిగా ఏడ్చే తెలుగువారిది ఎదుగుతున్నవారిని వెనక్కిలాగే ఎండ్రకపీత గుణం అని అంటారు (ఈ రచన కూడా ఆ కోవకే చెందినదేమో?).
మీద చెప్పిన ఇద్దరూ తెలుగువారిగా పుట్టడం వారి దురద్రుష్టం. శేషగిరిరావు పేరు నేను తెలుగు రాష్ట్రంలో కొన్నిఏళ్ళు ఉన్నా వినలేదు.
అలాగే హైదరాబాదులో నాలుగైదు ఏళ్ళలో నిజాం తనరాష్ట్రాన్ని పాకిస్థాన్ లో కలపడానికి పన్నిన కుట్రని వ్యతిరేకించినందుకు 20ఏళ్ళ చిన్న వయసులోనే దారుణంగా హత్య చేయబడిన విషయం వినలేదు. అతని జన్మశతాబ్ధి 2020లో వచ్చినా ఎందరికో నేను చెప్పినా ఏ ఉత్సవం జరగలేదు. కారణం అతన్ని చేతులుకోసి చంపిన రజాకార్లు ఇప్పుడు MIM పార్టీ పేరుతో అధికారంలో ఉన్న పార్టీని షమర్ధిష్తూ ఉండటమే.
ఈవిషయం ఎన్నోసార్లు రాసినా ఎవరూ స్పందించలేదు. సీనిమా పిచ్చి, రాజకీయాలు, తెలుగువారికి పట్టిన తెగుళ్ళు.
మన పత్రికలూ పుస్తకాలూ మరిచిపోయినా, మీరైనా కొండపల్లి శేషగిరిరావు గురించి గూగుల్ నుంచి తెలుసుకోండి. దామెర్ల జన్మశతాబ్ధి 1997లో జరిగినట్టు నేను వినలేదు. అతని శతజయంతి 2025లో వస్తుంది. దాన్నికూడా నిర్లక్షం చేస్తారా?