‘పెన్యురీ’ అనే పట్నం -9 By Someswar Bhagwat
శీర్షికలు రాయడంలో వచ్చిన మార్పులు
నిన్న, శీర్షికలో జరిగిపోయిన దాన్ని జరుగుతున్నదనీ, రేపు జరగబోతుంది అని
పాత దినపత్రికలను ఈనాటి పత్రికలనీ.చూస్తే చాలా పెెద్ద మార్పు పత్రిక అలంకరణ (display or page setup)లోను శీర్షిక ఇచ్చే విధానం లో కనిపిస్తుంది. ముద్రణ లో వచ్చిన మార్పుల వల్ల ఇప్పుడు బొమ్మలు వెయ్యడానికి బ్లాకులు తయారు చెయ్యనఖ్ఖర లేదు. అందువల్ల ప్రతి పేజిలో ఎన్నో రంగు బొమ్మలు ప్రచురించడం మామూలు ఐపోయింది అలంకరణ గురించి వేరే అధ్యాయంలో చర్చించుదాం.
శీర్షికలు పూర్వం ఎన్నో లైన్లలో ప్రతి లైనుకి ఎన్నో పదాలతౌ ఉండడమే కాకుండా వార్తని సమ్హీకరించి ఉండేవి. ఇప్పుడు ఒకటి రెండు పదాలలో అలంకార పూరితంగా ఉంటున్నాయి. ఒకనాటి శీర్షికలు క్లుప్తంగా ఏమి జరిగిందో చెప్పేవి. అంటే శీర్షిక చదివితే చాలు ఏమి జరిగిందీ బోధపడేది. ఇప్పటికీ చాలా ఇంగ్లీషు పత్రికలలో అంతే. అందు వల్ల ఎందరో పాఠకులు పత్రికలలో శీర్షికలు మాత్రమే చదివి వారికి ఆ వార్తలో వ్యక్తిగత ఆసక్తి ఉంటే మాత్రమే పూర్తిగా చదువుతారు.
కానీ భారతీయ భాషలలో, ముఖ్యంగా తెలుగులో పెద్ద మార్పు వచ్చింది. శీర్షిక పని వార్త క్లుప్తంగా చెప్పాలన్న ఉద్దేశ్యం కన్నా వార్తని చదవడానికి ఆసక్తి కలిగించడం ముఖ్యం అని ఈనాటి పత్రికలు నిశ్చయించాయి
కొన్నేళ్లు హైదరాబాద్ లో పని చేసినప్పుడు నేను విన్నది ఈ కొత్త పోకడకి పితామహుడు సినీ గేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి సినిమాల్లోకి రాకముందు ఆయన కొన్ని తెలుగు పత్రికలలో పనిచేసారు..’ఆంధ్రజనత’ అనే దినపత్రికలో అతను సంపాదకుడిగా పని చేసే రోజుల్లో వార్తలకి ఇలాంటి శీర్షికలు ఇచ్చేవారు. ఒకసారి పార్టీ శిసప సభ్యులని సభ బయట జరిగితే “…ఆలమందలవిగో”అని శీర్షిక పెట్టి వారిని పశువుల తో పోల్చారు.
ఇలాంటి శీర్షికలు పూర్వం feature headlines అనేవారు. ఇవి ఏమి జరిగిందో తెలియ చెయ్యవు. వీటిలో హస్యం allitration, ఉపమ, యతిప్రాస, అతిహాసం మరేదేనా అలంకారం (figure of speech) వాడబడుతాయి. ఇవి ఒకప్పుడు box or feature items కి పరిమితం ఐఉండేవి. ఇప్పుడు ఏ వార్త నైనా box చేయ వచ్చు్. Box కాని వాటిని కూడా జరిగిన విషయం చెప్పకుండా. ఒకటి రెండు.పదాల శీర్షికలు ఇస్తున్నారు.
(ఆంధ్రజనత ని కాంగ్రెస్ పార్టీ కొని కొన్నాళ్ళు. ముఖ పత్రిక గా.నడిపే మూసేసారు. వేటూరి బాపు, ముళ్ళపూడి వెంకటరమణ తో కలిసి ఆంధ్రప్రభలో కూడా సబ్ ఎడిటర్ గా పనిచేశారు,.కానీ ముగ్గురినీ తెలుగు వారు సినిమా మనుషులుగానే.గుర్తిస్తారు.)
ముగ్గురూ తెలుగు పత్రికా ప్రపంచానికి చేసీన సేవలూ, వారి ప్రభావం మరిచిపోయి.
అందుకే “ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ” (public memory is phenomenally short) అనే సూక్తి వచ్చింది. అంత కంటే కూడా తక్కువ సబ్ ఎడిటర్ జ్ఞాపకశక్తి. అందుకే ప్రతి వార్తలలో ‘జరిగిన కధ’ చెప్ఫాలని అనేవారు
కాని రిపోర్టర్ రాయకపోతే దాన్ని జత పరిచే సబ్ లు చాలా తక్కువ. ఈ అలవాటు వల్లనే పేరు ముందు వారెవరో చెప్పే ఆచారం ఉండేది.. ఒకప్పడు రోజూ వార్తల్లో ఉన్న వారి హోదా కూడా వ్రాసేవారు. “భారత ప్రధాని నరేంద్ర మోదీ” అని ప్రతిసారీ రాయడం వెగటుగా అనిపించి “మోదీ ఎవరో పాఠకులకు తెలియదా?” అని అడగడం సబబే.
అందుకే ఈ విధానం చాలామటుకు తగ్గింది. మోదీ, నరేంద్ర రెండూ గుజరాత్ లో చాలా సామాన్య మైన పేర్లనీ అదే పేరున్నవారు వేలమంది ఉండవచ్చు అనీ, చదివేవారు విదేశీయులు ఆవవచ్చనీ వాదించే వారుకూడా ఉంటారు. ఇందువల్ల తెలుగు/భారతీయ భాషా పత్రికలలో నూ, ఇంగ్లీషు పత్రికలలోనూ విధానాలు వేరుగా ఉండవచ్చు. మోదీ పేరు ఇప్పటికీ ‘మోడీ’ ఆనిరాసే డింకర్లూ, డినేష్లూ ఇప్పటికీ కొన్ని పత్రికలలో ఉన్నారు –
అతను వారు పుట్టక ముందు నుంచి ప్రజా జీవితంలో ఉన్నా. కారణం వార్తా సంస్థలు ఇంగ్లీషు లో ‘Modi ‘ అని రాయడం వల్లే. అదుకే దిద్దే వారు బుధ్ధి (వారికి ఉంటే) ఉపయోగించాలి. బయటి పత్రికలు చదవడం, రేడియో/TV ప్రసారాలని వినటం అలవాటు చేసుకోవాలి. ఉఛ్ఛారణ బేధాలు గురించి ముందు అధ్యాయంలో రాసేను.
పేర్లు రాసే విధానం దేశం లో వేరు వేరు రాష్ట్రాల్లో వేరుగా ఉంటుంది. ఆ మనిషి తను రాసుకునే విధానమే సరైనది. తెలుగు ప్రాంతాలలో ఒకప్పుడు ఇంటి పేరు పూర్తిగా రాసేవారు కాదు (ఇప్పుడు మారుతోంది). అలా ఐతే తెలుగు లో M.నరేంద్ర అని రాయాలి. ఎవరికైనా ఆ పేరు ప్రధానిదని తెలుస్తుందా? మరాఠీ లో P.L.దేశ్పాండే అంటే ప్రఖ్యాత హాస్య రచయిత పు.ల. అని అనుకోరు.
అందుకే పత్రకర్తలకి సామాన్య జ్ఞానం (general knowledge) చాలా అవసరం.