తెలుగు కథా ప్రపంచానికి కలిగిన పెద్ద ఆఘాతం
by Someswar Bhagwat
తెలుగు కథా ప్రపంచానికి నిన్న (జూూన్ 4) కోలుకోోలేని దెెబ్బ తగిలింది. కారా మాస్టారుగా పేరు పొందిన కాళీపట్నం రామారావు గారి మరణంతో తెలుగు కధా ప్రపంచాానకి తీీరని లోటు కలిగిచిందని చాలామంది తెెలుగు రచయితలు, నేేతలు ఇచ్చిన ప్రకటనలలో ఏదో వెలితి ఉందనిి అనిపించింది. అన్నీ routine and stereotyped ఏమో. అంత గొప్ప రచయిత గురించి రాసే అర్హత సరిిగా తెలుగురాని ప్రవాస్రాంధ్రుడిగా నాకు లేదు. కర్ణాటక గ్రామీణ ప్రాంతంలో ఉన్న నాకు ఇవాళ తెలుగుపత్రిక రాక ఈ విషయం ఆలస్య0గా (ఫోన్ మీద చదివి) తెలియడం వల్లా, నాకు స్వయంగా తెలియని వారి శోకసందేేశాలు (౦bits)రాసే అలవాటు లేకపోడం వల్లా వెంటనే రాయలేదు.
‘కారా మాస్టర్’ని నేను కొద్ది నిమిషాలుEmergencyకాలంలో కలిసేను. Emergency వల్ల ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి, ఒక పత్రికా ప్రతినిధి వల్ల రాచకొండ విశ్వనాథ శాస్త్రి పరిచయంఐ అతను జైలునుంచి పేరోల్ మీద బైటకి వస్తే కలిసేను. ఆతను విప్లవ కవి శ్రీశ్రీ కూడా విడుదలై అబిడ్స్ బ్రుందావన్ హోటల్లో ఉన్నారని చెప్పి తనతో నన్నూ తీసుకుని వెళ్ళారు. “ఒక తాగుపోతు మాట ఎలా నమ్మావు?” అని ఎడ్వాన్సు ఇచ్చిన సినీనిర్మాతని అడిగిన శ్రీ శ్రీ అలవాట్లు తెలుసుకదా?
మేం నలుగురైదుగురు మాట్లాడుతూ ఉంటే ఒక పొట్టిగా.నల్లగా నిరాడంబరంగా పంచకట్టుకున్న వ్యక్తి తను విస్కీకి సోడా తెస్తానని బయటకి వెళ్తుంటే రావిశాస్ర్రి అడిగారు అతను తెలుసా అని. నాకు తెలుగువారు చాలా కొద్ది మంది మాత్రం తెలుసనీ అతను తెలియదనీ చెప్తే శాస్త్రి ఆన్నారు “ఆయన ప్రపంచ స్థాయి రచయిత కాళీపట్నం రామారావు గారు. ప్రపంచంలో ప్లధమశ్రేణి రష్యన్ కధకుడైన డోస్తోవిస్కీతో సమానం, మాకందరికీ గురువుగారు. కాని తెలుగులో మాత్రం రాయడం వల్ల బైటివారికెవరికీ తెలియదు”.
అప్పుడు జ్ఞాపకంవచ్చింది అతని ‘యజ్ఞం’ అనే పుస్తకం. ఆ చిన్న పుస్తకం (లేక పెద్ద కథ?) మీద ఎన్నో అంతకన్నాపెద్ద పుస్తకాలు రాయబడ్డాయి, చర్చలు జరిగాయి. తెలుగుకధ లో వాస్తు, శిల్పం (style and content) గురించి జరిగిన.ప్రతి సదస్సు లోనూ ప్రధాన వక్త అతనే.
కాని అతని ఖ్యాతి తెలుగు ప్రాంతాలకే పరిమితం. అతను ఒక బీద పల్లెటూరి స్కూల్ మాస్టరు.
అంత గొప్ప రచయిత కొన్నీ ఏళ్ళ తరవాత లిఖితపూర్వకంగా ‘యజ్ఞం’ ఇంగ్లీషు లోకి అనువదించడానికి అనుమతి ఇచ్చారు మరొక రచయిత ద్వారా. చదవడానికి తీసుకున్న పుస్తకం తిరిగిచ్చే అలవాటు మన దేశంలో అరుదు.
అప్పుడు మళ్ళీ ‘యజ్ఞం’ కోసం పుస్తక దుకాణాలు వెతికితే అదీ, దాని మీద రాసిన మరో పుస్తకం దొరికాయి. రెండోసారి ‘యజ్ఞం’ చదితే కలిగిన జ్ఞనోదయం: దాని తర్జుమా చేయడమే ఒక యజ్ఞం అని. ఆప్పటికే ఎన్నో ఏళ్ళై తెలుగు చదవని (రావిశాస్త్రి తప్ప) నాకు అంత స్తోమత లేదని తెలిసీ ఆప్రయత్నం విరమించుకున్నాను.
ఈ సందర్భంగా ఒకటి తెలిసింది. ఒకరితో ఏకీభవించక పోయినా వారి గొప్పతనం గౌరవించవచ్చు. శ్రీ శ్రీ,, రాచకొండ, కాళీపట్నం ఇంకా ఎందరో Marx విచార ధారకి చెందినవారు. Emergencyలో జైల్లో పెట్టబడ్డారు. వారితో ఏకీభవించకపోయినా వారు గొప్ప రచయితలని ఒప్పుకోక తప్పదు.
సైద్ధాంతిక విభేదాలు, శత్రుత్వం వేరు. ఈవిషయం ఇవాళటి రాజకీయ నాయకులు మరిచిపోయి విభేదాలనీ వైరంగా.మార్చి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఆదిశంకరుడు విరోధి భార్యకే నిర్ణయం అప్పగించి తర్కంతో, .వాదనతో ఏకీభావం కలిగించిన ఈ దేశంలో ఈ స్థితి రావడం చాల దురద్రుష్టకరం. దీనికి కారణం 70 ఏళ్ళలో కల్పించబడిన మన చెడు రాజకీయ సంస్కృతే. దీనికి బాధ్యులు ఎవరో ప్రజలే నిశ్చయించాలి.