www.theTelugus.com

‘పెన్యురీ’ అనే పట్నం -11 By Someswar Bhagwat

వార్త ఆంటీ ఏమిటి? 

పత్రికలో పని చేసే ప్రతి వ్యక్తికీ అన్నిటికన్నా ముఖ్యంగా తెలియవలసినది వార్త ఆంటే ఏమిటీ అన్నది. ఇది భాషమీద ఆధిపత్యం కన్నా ముఖ్యం — పని ఏదైనా..ఇంతకు ముందు ఆన్నట్టు వార్త ఏమిటో పత్రిక ద్రుష్టి కోణం (policy) మీద ఆధారపడి ఉంటుంది. ఒక పత్రికకి వార్త అనిపించేది మరొకదానికి పనికీరాని చెత్త అవొచ్చు. దినతంతీ, దినమణీ పత్రకలకీ ద్రుష్టి కోణాలు వేరనీ ముందు చూసేం.

అలాగే మార్క్సు వాదైన  ‘సనతెలంగాణా‘ పత్రికకి గఢ్చిరోలీ లో జరిగిన ఎన్కౌంటర్ పెద్ద వార్త. అదే ‘ఆంధ్రజ్యోతి’ లో రెండు మూడు వాక్యాలలో లోపలి పేజీలో వేయవలసిన వార్త. తెలుగు దేశం పార్టీకి  సంబంధించిన  చిన్న వార్త కూడా  వారికి ముఖ్యం.


ఇలా పత్రికల వార్తల ఎంపిక వేరైనా కొన్ని మాత్రం అందరికీ ముఖ్య  సమాచారం కింద పరిగణింపబడే. విషయాలు ఉన్నాయి. ప్రతి పత్రికకీ వారికి కావలసిన కన్నాఎన్నోరెట్లు వార్తలు వస్తాయి – వార్తాసంస్థల నుంచీ, విలేకరుల నుంచీ, ప్రచారం (publicity) చేసే వారి నుంచి…. ఒకే వార్త వేరువేరు చోట్లనుంచి రావొచ్చు. ఎంపిక చేసేవారు ఇవన్నీ గుర్తించాలి. లోపలి పేజీలలో ఉన్న వార్తే మరొకసారి రావొచ్చు. ఇవీ కాక ఆరోజే చాలా పెద్ద వార్తలు ఎన్నో ఉండవచ్చు.

కెన్నడీ హత్య జరిగిన రోజు చాలా వార్తలు‌ అన్నీ ముఖ్యమైనవే వచ్చిన సంగతి ఇంతకీ ముందు చెప్పబడింది. కొన్ని సార్లు ఎన్నో వార్తలు ముఖ్య స్థానానికి (lead story) పోటీ పడుతూ ఉంటాయి. రాత్రి desk కి ముఖ్యడైన మనిషి అవగాహన, విచక్షణాశక్తి మీద ఆధారపడి ఉంటుంది మర్నాటి పత్రిక గొప్పగా ఉందో‌, విఫలమైందో. కోన్ని సార్లు ముఖ్యవార్త (lead) నిర్వివాదం. కొన్నిసార్లు వెతకాలీ.


సాధారణంగా lead  కింద భాషణ (speech) కన్నా  ఏదైనా జరిగిన విషయం (action)  ముఖ్యం. అలాగే మరణం. ఒక మనిషీ మరణిస్తే చాలా చిన్న వార్త. అది చాలా ముఖ్యమైన వ్యక్తి ఐతె ప్రముఖవార్త. ఆమ్రుత్యువే మామూలు చిన్నప్రమాదం  ఆయి ఒకరిద్దరు పోతే ఒకటిరెండు వాక్యాల వార్త ఔతుంది, ఎందరో ఐతే పెద్దవార్త. ప్రమాదం అసాధారణ రీతిలో జరిగితే పెద్దవార్త. చాలామంది ‘వెంట్రుకవాసి’ లో చావు తప్ఫించుకుంటే పెద్ద వార్త. అసాధారణ ప్రమాదం ఐతె ఎవరూ పోకపోయినావార్తే. మరణవార్త అందరికీ ఆసక్తికరమే. 

ముంబై సమాచార్ అనే గుజరాతీ దినపత్రిక ఎన్నోపేజీలు పర్గీకరించిన(classifide) ప్రకటనలలా మరఢవార్తలు  (obituaries)  ప్రకటించడానికీ ప్రసీధ్ధి.. వాటిని వేరువేరు  కుల వర్గాలుగా విభజించి (పార్సీ మరణ్ నోంధ్,  పటిదార్ మరణ్ నోంధ్, మార్వవాడీ  మరణ్ నోంధ్  etc.) ఎన్నోపేజీలు ప్రతిరోజూ ప్రచురిస్తుంది.చాలామంది అవి చదువుతారు కూడా. ఆ పత్రిక అందుకే అమ్మడు పోతుంది.

 ఒక మామూలు మాట వార్త కాదు.అదే ప్రముఖ వ్యక్తి అంటే వార్త. ఒక పేరుపడని వ్యక్తి వింతైన మాట అంటే వార్త కావొచ్చు. దీన్ని నిశ్చయించడం మీదే ప్రతి సబ్ ఎడిటర్ ప్రతిష్ట‌, హోదౌ అధారపడి ఉంటాయి.  ఈ పని బాగా చెరయ్యడావికి అసబ్ కి తన పత్రిక ఎవరు చదువుతారో, ఆప్రాంతం భూగోళం, సంస్క్రతీ. ఆఖక్కడి రాజకీయాలూ, ఆన్నీ తెలిసి ఉండాలి.

ప్రపంచ జ్ఞానం ఆప్రదేశపు ఇతిహాసం, తెలియాలి  ఒక్క భాషాజ్ఞనం చాలదు. అందుకే పత్రకారులకి చాలా తెలివితేటలు అవసరం. చాలా విషయాలు ఎన్నో ఏళ్ళు పని చేసే నేర్చుకోవాలి. పుస్తక జ్ఞానం చాలదు.అన్నిటీకన్నాముఖ్యం ఇవన్నీ చాలా తక్కువ సమయంలో చెయ్యగలగాలి. హెడ్ లైన్లు య(శీర్షికలు) మాత్లమేకిధు. డెడ్ లైన్లు (నిర్ణిత సమయం) కూడా ముఖ్యం.. Headlines and Deadlines పత్రకారుల జీవితం లో చాలా ముఖ్యం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here