‘పెన్యురీ’ అనే పట్నం -13 By Someswar Bhagwat
” డెడ్ లైన్లూ హెడ్ లైన్లూ”, నడుమ నలిగే పత్రకర్తలు
‘నారీ, నారీ, నడుమమురారీ’ అన్న పాత పాట గుర్తుందా? అలాగే ఒక పత్రకర్త జీవితంలో ‘హెడ్ లైన్లూ డెడ్ లైన్లూ’ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఈరెండిటి మధ్యా పరిగెడుతూ పత్రకారులు తమ స్రుజనశక్తీ {creativity) సమయస్ఫూర్తీ (spontaneity) రెండూ కోల్పోకుండా ఉండాలి. దీనికోసం మేలుకున్న ప్రతిక్షణం వారు పత్రకారులుగా ఉండాలి, ఒక్క పని సమయంలోనే కాదు. తక్కిన వారికి 8 గంటలైనా వారికి మాత్రం 6 గంటలే. duty. కాని ఇది కాగితం మీదే.
పత్రకారులు మేలుమకున్న ప్రతి సమయం చుట్టుపక్కనున్న ప్రపంచం నుంచి వివిధ విషయాలు గ్రహిస్తూ ఆ విషయాలు తమ పనిలో వాడగలగాలి. వారు చదివిన పుసస్తకాలూ, చూసిన సినిమాలూ, వెళ్ళిన ప్రదేశాలూ అన్నీ వారు తమ పనిలో రాణించడానికి పనికి రావాలి.
ఉదాహరణకి అంతర రాష్ట్రీయ నదీ జల వివాదం వార్తకి “జగనన్నా గంగ విడువు” అని శీర్షికపెట్టిన పత్రకర్తకి వర్షాలు పడని రాయలసీమ మహాకవి శ్రీనాధుడు తన దాహం తీర్చడానికి నీరు దొరకక శివుడిని ఒంటికి బూడిద పూసుకునే సన్యాసిగా వర్ణించి నీకు ఇద్దరు భార్యలెందకు అని అడిగి, “జగదీశా గంగవిడువు.పార్వతి చాలున్” అని నదీ జలాలకోసం అర్ధించడం తెలిసి ఉండాలి. ఆ విషయం గుర్తుకి వచ్చిన ఏ తెలుగు వాడేనా ముఖ్యమంత్రి జగన్ ని ‘జగనన్న’ ఆని ప్రచారం చేయడం, ప్రతి నదినీ గంగ అనడం తెలిసి ‘శభాష్’ అనకుండా ఉండగలడా? అది తెలియని పాఠకులు కూడా ఈ శీర్షిక చదివితే ఆ వార్త నదీ జలాల గురించి అని తెలుసుకుంటారు.
రెండు వర్గాలనీ ఆకర్షించేలా రాయడం ఒక ప్రత్యేక సామర్ధ్యం. డెడ్లైన్ల హడావుడిలో ఇది చెయ్యడం ఇంకా ముఖ్యం.
‘డెడ్ లైన్లూ హెడ్ లైన్లూ’ అన్న పేరు ఒక జర్నలిసం పుస్తకానికి పనికొస్తుంది. నేను 64ఏళ్ళక్రితం స్వతంత్ర. భారత దేశంలోని మొదటి జర్నలిసం విద్యా విభాగంలో చదివిన రోజులలో ఆపేరున్న ఒక పాఠ్య పుస్తకం ఉన్నట్టు జ్ఞాపకం. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా బాల్యావస్థలో ఉండేది. అలాఅని వారికి ఈ బెడద ఉండేది కాదనుకోకండి. రేడియో లో ‘ముఖ్య వార్తలు’, టివీలో ‘breaking news’ రాయడం దానితోనే సమానం.
“రేడియో కోసం రాయడం” అని ఒక ప్రత్యేక పాఠ్యక్రమం ఉండేది. వినడానికి (tv, radio కోసం) రాసేటప్పుడు వాక్యాలు వేరేలా ఉండాలి. పొడుగైన వాక్యాలు రాయకూడదు్ అలాగే నాలుక తడబడే (tongue twister) పదాలు కూడా వాడకూడదని నెర్పే వారు. వినడానికి రాయడం విధానం వేరు. కంటిచూపు లేనివారి కోసం మామూలు లిపిలో రాయలేం కదా? వారికోసం బ్రైల్ లిపి వాడాలి. అలాగే వారు ఊహీంచలేని (అంటే మనోనేత్రాలకి తట్టని) పదాలను వాడకూడదు. రాసినది చెవులకింపుగా ఉండాలి. ఇదేవిధంగా కొత్తగా నేర్చుకున్న వారికోసం రాయడం (writing for neo literates) విధానం వేరు.
ప్రౌఢవిద్యా పాఠకుల కోసం రాయడం ఆరోజుల్లో చాలా ముఖ్యం. ప్రతి వాక్యానికీ readability count చూడడం నెర్పేవారు — అది ఎంతవరకూ చదవబడుతుందో నిశ్చయిచయించడానికి. అందుకే “వినసొంపుగా” రాయాలనే వారు. ఇప్పండు కూడా “does it read well?” అని మనని మనం ష్రశ్నించుకోడం అనాలోచితంగా అలవాటవాలి. ఇది ప్రక్రుతి సిద్ధంగా కాక ప్రయత్నించి చేస్తే క్రుత్రిమంగా చెవికింపుగా కాకుండా ఉండవచ్చు. అలాకాకుండా చూడాలి. ఇది, నేర్పితే రాత్రికి రాత్రీ వచ్చేదికాదు. దీనికి అనుభవం అవసరం.
అందుకే “జర్నలిజం నేర్పబడుతుందా, పుట్టకతోటే రావాలా అన్న ప్రశ్న తర తరాలుగా చర్చింప బడుతున్నాది. దానికి జవాబు – రెండూ నిజం కాదు. రెండూ అబధ్ధంకాదు. కొన్ని విధానాలు (skills} నేర్ప వచ్చు, కాని అవి నేర్చుకోడానికి కావలసిన మనస్తత్వం మాత్రం పుట్టుకతోటే రావాలి. అంటే విధానాలు (skills and techniques) నేర్ప వచ్చు కాని మనస్తత్వం మాత్రం స్వతహాగా ఉండాలి.
ఐతే జర్నలిస్ట్ కి కానలసిన ముఖ్య లక్షణాలు ఏమిటి? ఒక పత్రకర్తకి వ్రపంచంలోని ప్రతి విషయం లోనూ ఆసక్తి ఉండాలి. “ఇది నాకు తెలియదు. నాకు దీనీలో ఆసక్తి . లేదం కనక నేను చదవను” అనే మనస్తత్వం ఉండకూడదు. మరి ఈ తరం స్పెషలిస్టులది కదా? అన్ని విషయాలమీదా ఏమీ తెలియని వాడు మూర్ఖుడు, ఏమీకాని విషయంమీద అన్నీ తెలిసిన వాడు స్పెషలిస్టు అని ఉంది ఒక నిర్వచనం (one who knows nothing about anything is a fool and one who knows more and more about less and less till he knows everything about nothing is a specialist).
దీనికి అన్ని విషయాల మీదా అంతా తెలిసిన వ్యక్తి పత్రకర్త ఆవి కొందరు జోడిస్తారు. కానీ ఇది అసాధ్యం. ప్రపంచంలో ఉన్న మొత్తం జ్ఞానంలో మనిషికి తెలిసీనది ఒక సముద్ర తీరంలో ఉన్న ఇసుక ఆంతటిలో ఒక కణానికి మాత్రమే సమానం ఆని మహా మేధావి ఐన న్యూటన్ అన్నారు. అన్నిటి గురించి అంతా తెలిసిన వాడిని సర్వజ్ఞుడంటారు. కొందరు పత్రకారులు సర్వంతెలిసినట్టు నటించి ప్రతి విషయం మీదా రాయడం జరుగుతున్నా అది సాధ్యం కాదు.
ఒక వైద్యుడిని ఎవరో అడిగారుట, “డాక్టరు గారూ, ఈ కరోనా వ్యాధి ఎప్పుడు అంతరిస్తుంది?” అని. అతని జవాబు: “ఏమో. నాకు తెలియదు. నేను డాక్టర్ని, జర్నలిస్ట్ ని కాదు.” (డాక్టర్ల విషయానికొస్తే ఈ specialization చాలా విక్రుతరూపం దాల్చింది. పూర్వం ఒక రోగిని ENT specialist దగ్గరికి వెళ్ళి ముక్కు చూపించుకో అని చెప్తే అడిగాడుట “ఏ స్పెషలిస్టు? కుడి ముక్కతనా ఎడమ ముక్కతనా?”)
మన పురాణాలలో భగవంతుడుకాక, ఒక్క నారదుడే ప్రస్తుత, భూత, భవిష్యత్తులు తెలిసిన త్రికాలజ్ఞుడని అంటారు. అందుకే అతన్ని దేవలోకపు ప్రధమ పత్రకారి అంటారు. అతనిలాగే పత్రకార్లు కూడా అక్కడి సమాచారం ఇక్కడ, ఇక్కట్నించీ ఆక్కడికీ చేరవేస్తూ ఉంటారు. నారదుడు చేసే సమాచార వితరణ కొన్నిసార్లు కలహాలుకూడా కలగజేసేవి అంటారు. అది నిజం తెలపడం వల్ల ఐతే ఈరోజులలో అబధ్ధపు వార్తలు ప్రసారం చెసే సామాజిక మాధ్యమాలు (so called ‘social’ – in fact anti-social — media) చేస్తున్నాయి.
కాని సరయిన సమాచారం తెలిసిన కన్నా అసత్య వార్తలు ప్రసారం అవడం వల్ల జరిగిన అనర్ధాలే ఎక్కువగా ఉంటాయి. వార్తా సంస్థలు వృత్తిపరంగా వార్తలు ప్రసరిస్తాయి. వాటిలో పనిచేస్తున్న వారు జర్నలిజం skills నేర్చుకున్నవారు కాని వాటికన్నా ఎక్కువ వేగంగా అసత్యవార్తలు (fake news) ఈ రోజు ప్రసారం ఔతున్నది కొన్ని సార్లు సామాజిక మాధ్యమాలు. ఈ మాధ్యమాలనుంచి నిజమైన వార్తలు కూడా ముందు తెలుస్తున్నాయి.
ఇవి వార్తా సంస్థల కన్నా ముందు ఎలా తెలియజేయగలుగుతున్నాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనివెనక వాటి కి వ్రేరేపణ (inspiration) ఎక్కడ నుండి వస్తున్నదీ అన్నది చూడాలి. వార్తాసంస్థలలో బాధ్యతగల పత్రకారులు వారి వ్రుత్తిపరంగా వార్తలు పంపిణీ చేస్తారు. వారికి duty time ఉంటుంది. బధ్ధకం ఉండవచ్చు వారు ప్రతి అంశాన్నీ పరీక్షించి, నిజమో కాదో నిర్ధారణ చేసి, ఆ ఘటన గురించి తెలియజేసినందువల్ల కలిగే లాభనష్టాల గురించి (its social implications) ఆలోచించి రాయాలి. సామాజిక మాధ్యమాలకి ఇలాటి బాధ్యత లేదు. వాటివెనక ఉన్న వ్యక్తికి ఎలాటి శిక్షణా (skill and training) ఆవసరం లేదు. ఉద్యోగం పోతుంది ఆన్న భయం లేదు. ఆ మాధ్యమాలు ఎలా వాడాలో తెలుస్తే చాలు.
ఈ రోజులలో ఇవి తెలియని వారు అరుదు. చిన్నపిల్లలకి కూడా WhatsApp, Instagram phone camera వాడడం తెలుసు. అలాగే twitter, facebook, Snapchat. Moj. Reddit లాటి ఎన్నో మాధ్యమాలు వాడడం ఈనాటి సంస్క్రతి. ఇవి ఎప్ప్పుపుడేనా చూసేరా? ఏ సామాజిక మాధ్యమం చూసినా అశ్లీల, హనీకరమైన విషయాలే ఎక్కువ. అపవాదంకీ, నిజఘటనకీ ఉస్న బేథం తెలియనఖ్డరలేదు. వారికి మాజిక ద్రుక్పధం (social awareness), బాధ్యత, అఖ్ఖర లేదు. . సామాజిక మాధ్యమాలు ఎవరేనా ఉపయోగించ గలరు సామాజిక మాధ్యమాలలో వచ్చిన విషయాలు కూడా వార్తలు అవడం పత్రకారిత ప్రపంచంలో వచ్చిన పెద్దమార్పు, కొత్త సంస్క్రు తి.