‘పెన్యురీ’ అనే పట్నం -14 By Someswar Bhagwat
కొత్త సంస్క్రుతిలో మాధ్యమాల పాత్ర
ఈరోజులు పత్రికలలో, సామాజిక మాధ్యమాలలో ప్రముఖులు ఏమి ప్రకటన చేసినా ప్రచురింపబడుతోంది. అంటే మాధ్యమాలని చూడని వారికి కూడా తెలుస్తున్నాది. డోనాల్డ్ ట్రంప్ ట్విటర్ వల్లే అమెరికా రాష్ట్రపతి ఐనట్టు చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పుడు దేశాధిపతులని ఏమీడియాలో ఎంతమంది అనుసరిస్తున్నారో పత్రికలకి ఒక పెద్ద వార్త. ఓ వార్త ప్రకారం అందరికన్నా ఎక్కువ అనుచరులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్నారు.
దేశ నేత ఎంత జనప్రియుడో కొలవడానికీ ఇది మాపదండంగా పరిగణిస్తున్నారు. అతను ప్రధాని అవ్వడానికి “పాతకాలపు రూఢివాదులు” అనిపించుకొనే నరేంద్ర మోదీ, RSS, విదేశీ చదువులున్న ‘నవతరం’ లోని ‘యువ’ నేతలకన్నా బాగా ఈ మాధ్యమాలని ఉవయోగించుకున్నారన్నది విదితమే. ఇప్పటి నేతలకి ప్రెస్ సేక్రటరీలాగే సోషల్ మీడియా మేనేజర్లు కూడా ఉంటున్నారు. సాధారణంగా ప్రముఖ పత్రకారులే ప్రెస్ సెక్రటరీ పదవికి ఎన్నుకోబడతారు. కొందరు దీనివల్లే ప్రసిద్ధి పొందేరు. ఒక పత్రకాకర్తకి ఆన్నిటికన్నా (సంపాదకుడి కన్నా కూడా) పైమెట్టు ఇదేనేమో.
వి. వి. గిరిగారి ప్రెస్ సెక్రటరీ హమీద్ ముస్లిమ్ ఐనా హిందూ పౌరాణీక విషయాల మీద ఎంతో ఎక్కువ తెలిసినవారని అనుకునేవారు. నేను ఢిల్లీలో పని చేసేటప్పుడు ఏ పురాణం గురించి సందేహం వచ్చినా అతన్నే ఆడిగేవాళ్ళం. అప్పుడు ఈ మాధ్యమాలు ఉండేవికావు.
ఈకొత్త సంస్కృతి వల్ల వచ్చిన ముఖ్య పరిణామం పత్రికల మీద పాఠకుల నమ్మకం పోవటం. ఎక్కడ ఏమి జరిగిందో చాలాసార్లు ఈ మీడియాలవల్లకాని టెలివిజన్, రేడియోవంటి ఎలక్ట్రానిక్ పరికరాలవల్ల కాని ముందు తెలుస్తున్నది. కాని ఇందులో ఒక లొసుగు ఉంది. దీనివల్ల చాలాసార్లు అబధ్ధాలు కూడా నిజాలుగా చలాఘణీ ఆవుతున్నాయి. ఎన్నోసార్లు పుకార్లు కూడ అతిత్వరగా వ్యాపించడం, దానిల్ల మతకలహాల వంటి దుర్ఘటనలూ దేశరక్షణకి హానీ కలుగుతున్నాయి
కొందరు అసామాజిక తత్వాలు వీటిని ఉపయోగించి అరాచికం సృష్టిస్తున్నాయి. కొందరు తెలియక కూడా వీటికి దోహదం చేస్తున్నారు. పిల్లలని ఎత్తుకు పోతున్నారనో, గోహత్య చేసేరనో పుకార్లని నమ్మి కొందరు మూర్ఖులు హత్యలు కూడా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
పత్రికలు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోడానికీ, వాటి ప్రాధాన్యత తగ్గడానికీ కారకులెవరు? , ప్రపంచవ్యాప్తంగా వార్తా పత్రికలు ప్రచారం (circulation) కోల్పోయి చావుబతుకుల సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నాయి, తమ మీద నమ్మకాన్నిపోగొట్టుకుని తమ వినాశనం వైపు వెళుతూ వాటి చావు బతుకులు, భవష్యత్తులో అస్తిత్వాలకే ముప్పుగా వచ్చే దిశలో పత్రికలు ఎలా ప్రయాణిస్తున్నాయి?
ఈ ప్రశ్నకి జవాబు ఒకటే: అది స్వయంకృతమైనది. సులభ మార్గాలలో డబ్బు గణించడానీకి కొన్ని అడ్డదార్లు పట్టాయి. తమ మీద నమ్మకాన్ని పోగొట్టుకుని తమ వినాశనం వైపు వెళుతూ వాటి చావు బతుకులు, భవష్యత్తులో అస్తిత్వాలకే ముప్పుగా వచ్చే దిశలో పత్రికలు ఎలా ప్రయాణిస్తున్నాయి? ఈ ప్రశ్నకి జవాబు ఒక్కటే: అది స్వయంకృతమైనది. సులభ మార్గాలలో డబ్బు గణించడానీకి కొన్ని అడ్డదార్లు పట్టాయి.
ఇంతకు ముందు చెప్పిన ఆన్నిటికన్పాముఖ్యమైన ‘వార్తలలో నిస్పక్షపాతoగా ఉండటం’ కోసం ‘facts are sacred, comment is free’ (సత్యం పవిత్రమైన ది, వ్యాఖ్యలు నిర్భయంగా ఉండాలి) అన్న సూక్తిని మరిచిపోకూడదు. ఈరోజులలో ఏ పత్రిక కూడా ఈ సూక్తిని పాటించడం లేదు. ప్రతి పత్రికా ‘పోలిసీ’ పేరుతో ఏదో ఒక పార్టీ వేపు మొగ్గు చూపుతున్నది
పెద్ద ప్రకటన దార్లు పత్రికల మీద వత్తిడి తేవడం మాములే. తమకి అనుగుణంగా వార్తలు ప్రచురించడం కన్నా తమకి హాని కలిగించే వార్తలని తొక్కి పెట్టడానికి వారు ప్రయత్నిస్తూ ఉండడం సహజమే. వాటిని పొగిడితే పాఠకులు నమ్మకపోవొచ్చు కాని వారి విరోధంలో రాయకపోతే అదేమిటో ఊహీంచలేరుకదా? ఈ వత్తిడిని బాగా డబ్బున్న పెద్ద పత్రికలే ప్రతిఘటించ.లేకపోతున్నాయి, చిన్నవాటి సంగతి మరి చెప్పఖ్ఖరలేదు.
పత్రిక నడీపేది సామాన్యంగా పెద్ద వ్యాపారులే. కారణం ఇప్పుడు పత్రిక నడపడానికి కోట్లు అవసరం. ఒకప్పుడు స్వాతంత్ర్య సమరంలో భాగస్వాములై ఆప్రయత్నాలలో ముందువరుసలో ఉండే పత్రికలు ఇప్పుడు పెద్ద వ్యాపారాలు. వాటికి ‘వ్యాపార ఆవసరాలు’ ముఖ్యమైపోయేయి…
నేను పత్రికలలో పనిచేసేరోజులలో .’ఆపత్కలీన సహాయం’ (disaster management) కి సంబంధించిన ఉద్యమంలో పాల్గొని ఎన్నో NGO (ప్రజా సంస్థ) సభలలో మాట్లాడేవాడిని. (వీటి ప్రయత్నం వల్లనే ఆవిషయం వ్యవసాయ శాఖనుంచి వేరుచేయబడి మరొక మంత్రిత్వశాఖ పుట్టింది. ఆప్పటి వరకూ ఈ విషయం agriculture ministry కింద ఉండేది.) అలాటి ఒక సభ హైదరాబాద్ దగ్గరున్నరాజేంద్రనగరి లోని ఇండియన్ పోలీస్ ఎకాడమీలో జరిగి నన్ను మాట్లాడడానికి పిలిచారు.
నాపేరు, వృత్తీ, బైట బోర్డులో రాయబడం వల్ల ఆ సభలో పాల్గొన్న DIG స్థాయి అధికారులు అసలు విషయం పక్కన పెట్టి తము పనిచేసిన చిన్న ఊళ్ళలో ఎలా ఊరూపేరూ లేని చిన్న పత్రికలకు తాము ‘సంపాదకులు’ అని చెప్పకునే వ్యయక్తులు తమని ఎలా బెదిరించేవారో చెప్పసాగేరు. తమదగ్గర వారి వీరోధంలో చాలా సమాచారాలు ఉన్నాయనీ, వారడిగిన డబ్బు ఇవ్వకపోతే ప్రచురిస్తామనీ వారిని blackmail చెయ్యడానికి బెదిరించేవారుట. ప్రతి ఊర్లోనూ ఇలాటి పత్రికలు కుక్కగొడగుల్లా ఉన్నాయి. కారణం వాక్స్వాతంత్రం పేరున ఇవి పెట్టడానికి ఎవరేనా చాలు — వారు నిరక్షరాస్యులైనా ఏ అర్హతా లేకపోయినా.
నేను ఇలాంటి పత్రికలకి ప్రజాదరణ, ప్రచారం ఉండవనీ, వాటికి భయపడ కూడదనీ చెప్తే ఎవరూ నమ్మలేదు. ఆ అధికారులు చెప్పిన దాన్లో కూడా చాలా నిజం ఉంది. ఈ దేశంలో ముద్రిత పదానికి (to printed word) చాలా విలువ ఉంది. రెండు మూడు కాపీలు మద్రించబడినా, వాటికి ప్రచారం లేక పోయినా, పైఅధికారులు కనీసం సంజాయిషీ ఐనా అడగవచ్చు కదా. ప్రతి కార్యాలయంలో రాజకీయాలూ ఎన్నో తెగులూ ఉంటాయి. వాటికి ఈ ఫత్రకలు వాడబడవచ్చు. ఆదీ నిజమే.