www.theTelugus.com

‘పెన్యురీ’ అనే పట్నం -15

 By Someswar Bhagwat

పత్రికలకీ ఆచార సంహిత, నీతి, చట్టాలు

చిన్నపత్రికల సంపాదకులు కొందరు బెదిరింపు, బ్లాక్మైల్ చర్యలకు పాల్పడుతున్న సంగతి ప్రస్తావించేనంటే దాని అర్ధం వారు మాత్రం అలాచేస్తున్నారని కాదు. మన సామాజిక వ్యవస్థ లో చీన్న చిన్న పత్రికలు ఎన్నో ఉండడంవల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒకే పత్రికకి ఆప్రాంతంలో monopoly ఉంటే ఒకే దృక్పధo  మాత్రం ప్రచారంలో ఉంటుంది.

ఇంగ్లీషు లో ఒక లోకోక్తి ఉంది – ప్రతి మనిషికీ ఒక ధర ఉంటుంది (everyone has a price) అని. అంటే ధర ఎక్కువ పెట్టి ఐనా ఒకరిని ఏ రాజకీయ నేత ఐనా,  పెట్టుబడిదారైనా కొనీ వచ్చు. ఆ అమ్ముడు పోయింది ఒక monopoly ఉన్న పత్రిక ఐతే ప్రజాభిప్రాయాన్ని గుప్పిటిలో పెట్టుకోవచ్చు. అదే ఎన్నో ఉంటే వారిలో అమ్ముడు పోని తలతిక్క మనిషి ఉండే అవకాశం ఎక్కువ. అంటే వేరే అభిప్రాయం ప్రచలితం అవవచ్చు. నేనెప్పూడూ పెద్ద monopoly ఉన్న పత్రికలని వ్యతిరేకించి చిన్న పత్రికలనే ఎన్నుకున్నాను — వాటిలోనే పని చేసేను. ఎన్నో పత్రికలుంటే ఒకే విషయాన్ని వేరు-వేరు కోణాలలో చూడవచ్చు. 

కాని చిన్న పత్రికలతో ఒక చిక్కు ఉంది. అవి ఆర్ధికంగా బలహీనంగా ఉండటం వల్ల సాంకేతికంగా వెనకబడి ఉంటాయి. అంటే అత్యాధునిక చాలాప్రయమైన మెషిన్లు కొనలేవు. వాటిలో పనిచేసేవారి సంఖ్యకూడా తక్కువే. మన దేశంలో నే కాదు‌ అమెరికా లోకూడా ప్రతి ఊరికీ  స్థానీయ పత్రికలు, ఇంగ్లండ్ లో  కౌంటీ పత్రికలూ ఉన్నాయి.

విశ్వవిఖ్యాత రచయిత చార్లెస్ డికెన్స్ మనవరాలు మేరీ డకెన్స్ రాసిన ఒకపుస్తకంగరించి నేను ఎప్పూడూ చెప్తూ ఉంటాను. మేరీ ఒకచిన్న పత్రిక రిపోర్టర్. ప్రతి పత్రికలోనూ ప్రతి రోజూ ఒక పొద్దుటి మీటీగు ఉంటుంది. (అవెళ పత్రిక post mortem -మరణోత్తర పరీక్ష  – ఇందులో జరుగుతుంది కాబట్టి కొందరుఈ morning conference ని శోకసభ (mourning conference) అనికూడా అంటారు. బంట్రోతుల వ్యవస్థ ఒక భారత దేశంలోనే (ఒకప్పటి బానిస రోజుల గుర్తుగా) ఉంది.

ఈ సభలలో అందరికన్నా చిన్న అవడం వల్ల మేరీయే అందరికీ టీ కలిపేది. (పెద్ద కార్యాలయంలో ఈపని బాస సెక్రెటరీది).  ఒక రోజు మీటింగ్ లో ఆనుకుంటారు  ఈ పని ఒక్క మేరీయే చెయ్యడం బాగులేదు కాబట్టి వంతుల వారీగా అందరూ చెయ్యాలని. ఆ పత్రికలో పనిచెసేవారు చాలామంది  (మేరీతప్ప) ఒకే కుటుంబానికి చెందినవారు. కుటుంబ పెద్ద ఐన తండ్రి సంపాదకుడు.

సంపాదకీయంతో అతను వ్యస్తంగా ఉండటం వల్ల అతని వంతైనా మేరీయే టీ చేస్తుంది. మర్నాడు తల్లి వంతు.  ఆవిడ ప్రకటనా విభాగం (advertisement) మేనేజర్ గా ఒక మీటింగ్ కీ వెళ్ళడం వెళ్ళడం వల్ల  మేరీయే టీ పెడుతుంది.  మర్నాడు కొడుకు ఛీఫ్ రిపోర్టర్ గా  ఎవరినో interview చెయ్యడానికి వెళ్తే ఆతని వంతు మళ్ళీ మేరీకే అ పని పడింది. ఇలా ప్రతిరోజూ మేరీయే టీ చేస్తున్నా ఒకరోజు అనుకుంటారు ఇలా వంతులవారీ గా చేసుకోడం బాగుంది‌ ఒకరిమీదే భారం పడకుండా, అని. ఆ పుస్తకం పేరు My Turn to Make The Tea.

 అది ఆ పని గురించి పితూరీ కాదు, ఒక చిన్న పత్రిక లో జీవితం గురించి. ఈ పుస్తకం చదివి 60 ఏళ్ళైనా ని మనసు మీద ముద్ర చెరగలేదు. చాలా చిన్న పత్రికలు ఇలాగే ఒక కుటుంబంకి చెందినవే. చిన్న ఊళ్లలోనూ‌ గ్రామాలలోనూ ఉన్న పత్రికలే కాదు, పెద్దవాటిలో కూడా paid news జబ్బు ప్రవేశించింది.

ఒక ప్రయాణంలో కొందరు  మరాఠీ లో (నాకు ఆ భాష రాదనుకొని) పత్రకారుల గురించి మాట్లాలాడు కుంటూ ఉంటే నేనూ అదే పనిలో ఉన్నానని చెప్పి మాట కలిపాను. వారు చెప్పిన ఫ్రకారం ఒక పెద్ద తెలుగు పత్రిక వారి  (అప్పటి ఆంధ్రప్రదేశ్ లో)జిల్లాకి జిల్లా ప్రతినిధిగా  నియమించబడిన తరువాత ఒక వ్యక్తి కొద్ది కాలం  లోనే లక్షాధికారై ఇల్లు కట్టుకున్నాడు. ప్రతి అధికారినుంచీ  వారు తీసుకొనే లంచాలలో ఆతనికి కొంతశాతం  దొరికేదట. 

 నేను కూడా  జర్నలిస్ట్ అని తెలిసి వారు ఆ వృత్తి లోఎలా ఆవినీతి ఉందో చెప్పసాగేరు. నాకప్పండే తెలిసింది మా గురించి ప్రజలు ఏమిటనుకుంటున్నారో. అప్పడే నా మొదటి పుస్తకం గురించి ఊహ కలిగింది. కొంత అధ్యయనం చేస్తే తెలిసినది – ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ‘పత్రకార్ల ఆచార సంహిత’ (Journalists’ code of  ethics) తయారు చేసినట్టు తెలిసినవారు చాలా తక్కువనీ‌, ఒకరిద్దరే దాన్ని చూసినా ఎవరూ చదవలేదనీ.

అదికాక ఎన్నో అంతర్జాతీయ సంస్థలు, Times of India వంటి కోన్ని పెద్ద పత్రికలు వారి సభ్యుల కోసం వేరీ codes తయారు చేశారు.  అది తెలిసినవారు చాలా తక్కువ‌.

Journalism: Ethics, Codes, Laws అనే చిన్న పుస్తకం రాయడానికి మరో కౌరణః  ఆ విషయం మీద ఒకే ఒక బరువైన పెద్ద పాఠ్య పుస్తకం, అదీ వకీళ్ళ కోసం చట్టపు భాషలో రామబడనది మాత్రం. ఉండేది – ఉట్పి చట్టాల మీదే ethics, codes ప్రస్థావన లేకూండా.

కొత్తగా వచ్చిన  సామాజిక మాధ్యమాలకీ పత్రికాప్రపంచానికీ ఉన్ప పెద్ల తేడా ఇదే. పత్రికలకీ విద్యావిథానం‌, నేర్పడం (training) కాక ఆచార సంహిత, నీతీ, ఉల్లంఘిస్తే శిక్షించడానికి చట్టాలూ ఉన్నాయి. 

సొమాజిక మాధ్యమాలకి  ఏమీ లెవు – ఒక్క  ఉఛ్ఛ తమ న్యాయాయపు కోపానికి గురైన  బ్రిటిష్ రోజుల వలసకాలపు  (colonial) రాజద్రోహ చట్టం తప్ప.  ఇదే మన వారసత్వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here