www.theTelugus.com

‘పెన్యురీ’ అనే పట్నం -16

 By Someswar Bhagwat

పత్రికలకీ సంస్కృతి కీ ఏం సంబంధం? 

చాలా మంది అడుగుతారు: పత్రికా ప్రపంచానికీ సంస్కృతి కీ సంబంధం ఏమిటి? ఒకదేశంలో నిజం మరొకదేశంలో ఆసత్యం ఔతుందా?  ఒక భాషలో శీర్షిక జరిగింది చెప్పి‌ మొదటి వాక్యంలో ‘ఎవరు‌ ఎక్కడా‌ ఏమిటి’ చెప్తే అదే.వార్త మరొక సంస్కృతి లో వేరుగా ఉంటుందా? పత్రికారచన మూలసిధ్ధాఃతాలు (basics) మారతాయా?

మూలసిధ్ధాంతాలు ఒకటైనా వేరువేరు దేశాలలోనీ‌, ఒకే దేశంలో వేరువేరు సమయాలలోనీ సంస్కృతి మారినప్పుడు దృకపధాలు కూడా మారుతాయి.

అమెరికాలో పిల్లలు పెద్ద అఅవ్వగానే వేరవటం సహజం — దాన్ని empty  nest పరిస్థితి అంటారు. అదే ఒక  బాలసుభ్రమణ్యం పాటలో ‘గూడు పాడైనందుకు’  ఎగిరిపో ఓపిట్టా ఆంటాడు. ఆపాటనే హిందీలో తర్జుమా చేసీ రఫీ పాడీతే గూడేకాదు తోటే నాశనం ఐంది    కాబట్టి  పిట్టని ఎగిరిపోమంటాడు. ఒక సంస్కృతిలో గూడు ఖాలీఆవడం సామాన్యం. మరొకదానిలో ఆగూడు మాత్రం పాడైనది అనుకుంటే‌, మూడవ దాంట్లో పూర్తి తోటే పాడు ఐపోయింది.  ఒకే సంఘటన మూడు వేరువేరు దృక్పథాలలో వేరువేరుగా చిత్రీకరించబడింది. 

పత్రరచనలో సంస్కృతి ప్రభావం.ఇదోక్కటే   కాదు. ఇప్పడు ప్రతివార్తా సంచలనాత్మకంగా ఉండాలి ఆనే కొత్త ప్రవృత్తి వచ్చింది – TV రేడియోలతో. పోటీవల్ల. ప్రతివార్తా sensation కలిగిచకపోతే breaking newsకి పనికిరాదు, TRPలు పెంచదు. ఈ రోజుల్లో ఏమిజరిగిందో మొదట TV, రేడియోల వల్ల తెలుసుకుని వివరణ, నేపథ్యం కోసమే పత్రికలు చూస్తన్నారు కాబట్టి జరిగిన దాని నేపథ్యం, లాభనష్టాలు, సమాజం మీద ప్రభావం (background, impact, interpretation) పత్రికలు  చెప్పవలసి వస్తున్నాది. ఒకప్పుడు దిహిందూ (TheHindu)లో ‘నమస్కారం’ నుంచి ‘జై హీంద్’ వరకూ పూర్తి .ఉపన్యాసాన్ని  ప్రచురించేవారు. ఆప్పటి రిపోర్టర్ మంచి స్టెనోగ్రాఫర్లుగా  ఉండేవారు- అంటే 5౦-60 ఏళ్ళ  కింద వారికి షార్ట్-హేండ్  రాడం ముఖ్యం. క్రమేణా ఈ ఆలోచన మారి షార్ట్-హేండ్ రాడం వల్ల కష్టం పెరుగుతుందనే అనుకుంటున్నారు. కారణం అలాటి వారు అలోచించకుండా ప్రతి వాక్యం రాసుకోడం వల్ల తరవాత అసలు విషయం కోసం వెతుక్కోవలసీ వస్తుంది.

ఎక్కువ సమయం పడుతుంది. ఈరోజు  ఒకప్పుడు వార్తాసంస్థల (news agencies) మధ్య ఉఃడే పోటీ (ఎవరు ముందు వార్త వంపారా అని) ఇప్పుడు దినపత్రికలలో కూడా వచ్చింది — అన్నిప్డత్రికలకీ ఆన్లైన్ ఎడిషన్లూ‌ , న్యూస్ ఎలర్ట్  సేవలూ ఉండడం వల్ల. పత్రికలూ ఎలక్ట్రానిక్ మీడియా కలీసిపోడం వల్ల మరొక పరిణామం వచ్చింది. ఇప్పుడు పెద్ద దిన పత్రికలన్నీ వార్తలని పొద్దటి సిటీ ఎడిషన్లే కాకుండా వేర్వేరు సమయాల్లో online సంస్కరణలు (editions) కాక  Express Explained (వార్తలని బోధవరిచి చెప్పడానికి) Times Health, Times Entertainment, ETMoney (ఒకేవిభాగం – ఆరోగ్యం, సినిమా‌, ఎకనమిక్ టైమ్స  నీర్వెషణ– వంటివి) వంటి సేవలూ ఉన్నాయి. ఇవికాక New York Times. Huffington Post వంటివి వారి ముఖ్య రచయితల రచలనీ‌, స్పషల్ విషయాల వార్తలనీ online, నిశ్శుల్కంగా ఎవరికి ఏది కావలిస్తే అదే‌ , పంపంతున్నాయి.  దీనితో  పాతికేళ్ళకిదటే జర్నలిస్ం మాత్రమే కాకుండా “న్యూ మీడియా” చదువులు మొదలయ్యాయి. వీటిలో electronic వస్తువలు వాడి వార్తలు ప్రసరించడం గురించి ఎక్కువ చెప్పడం మొదలు అయింది. ఇప్పుడు పత్రికా ప్రపంచం మరొక ముందడుగు వేసింది. చాలా ఏళ్ళై గూగుల్ సెర్చ్, బింగ్,  యాహూ సెర్చ్ వంటీ ‘సెర్చ్ ఇంజిన్ లు ఉఃడేవికదా? ఇప్పుడు వాటీలాగే algorithmలు వాడి ప్‌త్యేక అవసరాలకు పనికివచ్చే ప్రత్యేక సెర్చ్ ఇంజిన్లు తయారు చేసుకోవచ్చు. ఇవికూడా కొద్ది సెకండ్లలో world wide Web అంతా వెతికి కొన్ని వేలుకానీ వందలు కానీ linkలు అందిస్తాయి.

ఒకప్పుడు  ప్రతిదీ  రాసుకుని ప్రచురించడం మామూలు.    పత్రకారులు తమ తెలివి‌, ప్రత్యేక ఆధ్యయనం ఉపయాగించి వార్తలలోని అర్ధాన్ని కనుకొని రాయడం వరకూ ఎదిగాం. ఇప్పుడు ఎల్గోరిథాలు వాడి ప్రపంచంలోనీ ఏవిషయం గురించేనా ఉన్న అంత జ్ఞానాన్నీ క్షణాలలో కనుగోగలుగుతున్నాం. మెదడు మీద ఏభారాన్నీ మోపే అఖ్ఖరలేదు. ఈ వెతికే పని ఎక్కవ ఉపయోగించడానికీ ఇప్పుడు search engine optimization కంప్యూటర్ మీదే నెర్చుకోవచ్చు. ఇప్పుడు ప్రతి విషయం మీదా డేటా కొనుక్కోవచ్చు. కొన్ని IT కంపెనీలు ‘నిశ్శుల్క’ సేవలు అందిస్తూ మీగురించి ఆన్ని విషయాలూ తెలుసుకని ఆజ్ఞానాన్ని అమ్మి కోట్లు గణిస్తున్నాయి.  ఈ డేటాని.వాడటం నేర్పడానికి   డేటా మైనింగ్ (తవ్వి బైటకి  తియ్యడం – గసులలోలాగ), డేటా ఎనాలీసిస్, ఇంకా informatics తయారు ఆయేయి.

 ఇలా డేటా   లీక్ అవడం వల్లో‌, అడగకుండా అమ్భబడటం వల్లో – ఏ స్థితికి వచ్చామంటే మీరు ఎక్కడెక్కడకి వెళ్లేరో, ఏమిరంగుల బట్టలు.ఇష్టపడతారౌ. ఏమిటి తింటారో ఇలా అన్ని విషయాలూ ఈ సంస్థలకి తెలిసి ఉంటాయి,  మీ  bank  account నంబరు పహితం్గ మీ.గో్పనీయథ  (privacy)ని కాపాడ్డానికి cyber security అనబడే విజ్ఞానం,  కంప్యూటర్ వల్ల జరిగేనేరాలని అరికట్టడానికి .సైబర్ పోలీసుస్టేషన్లు వెలిసాయి

ఇంకా ఎన్నో కొత్తసంగతులు రోజురోజుకూ వస్తున్నాయి. మీకు ఏదైనా విషయంలో పత్రికలలో ఏమిటి  ప్రచురితం ఔతున్నాయో తెలుసుకోవిలంటే దాని మీద మీరు జీమైల్ లో ఒక. alert పెడితే.ప్లతి రోజూ ఆవిషయంమీద ఎన్నో పత్రికలలో ఏమిటి వచ్చిందో వాటి లింక్ లూ మీ email inbox లోకి వస్తాయి. కొత్తగా  aggregators వచ్చి ప్రపంచంలో ఎన్నో వత్రికలలో వచ్చిన రచనలకి.links వస్తాయి. మీరు .కావలసినవి   దిగుమతి  చేసుకోవచ్చు.

దీనికి పత్రికా రచనకీ సంబంధం  ఏమిటి అసి.మీ రడగవచ్చు. పూర్వం చదివే వారికి అన్ని  “విదితమే” అనుకుంటే ఇప్పుడు ‘పాఠకులకు ఏమీకం ఉండదనీ‌, దేశ ప్రధాని  పేరు కూడా ఎరగరని అనుకుంటున్నారు. (ఇది నిజం కూడా.. ఇప్పటికీ అతని పేరు మోదీ ఆనీ తెలియక.’మోడీ’ ఆని రాసే డీంకర్లూ, డినేష్ లూ మన పత్రికలలో ఉన్నారు.)

ప్రతిపత్రికకీ తన సగటు పాఠకుడు తెలిసి ఉండాలని ఒకసారి అనుకున్నాం కదా. ఇప్పుడు వారి ఆర్ధిధిక పరిస్థితే కాదు‌, ఆన్నివిషయాలూ తెలిసిపోతున్నాయి. ఈజ్ఞానం  వారికి కావలసింది  వారికి చేర్చడానికి కాక వారి బేంక్ ఎకౌంటునుంచి డబ్బు దొంగిలించడానికి కూడా ఉపయోగిస్తారు.  దాన్ని ఆపడానికి పై ఎత్తులు వేయ్యాలి. 

ఒక పాత కధ ఉండేది. ఒక సన్యాసికి ఒక కౌపీనం (గోచీగుడ్డ)   మాత్రమే ఆస్థి ఉండేదిట. దాన్ని ఎలుకల నుండి కాపాడడానికి ఒకపిల్లి, దానికీ పాలకోసం ఆవూ,  దాన్ని మేపడానికి ఒక కాపరీ వచ్చారు.  ఆ  ఆవునీ  ఇద్దరు మనుషులనూ చూసుకోడానీకీ పెళ్ళీ‌,  పెళ్ళైతే.పిల్లలూ ఇలా కౌపీనం కోసం గృహస్తుగా మారాడుట.. అలాగే ఈవిషయం లో కూడా ఒకదానివల్ల మరోకటి, దానివల్ల మూడవదీ‌,  ఇలా పటాటోపం పెరుగుతోంది. కాని ఇది మంచికో‌  చెడుకో తెలియడం లేదు.ఇది ప్రగతి అనుకోవాలా మనం కాలమానంలో తిరోగమనం అవుతున్నామనుకోవాలా? 

ఛార్లెస్ డార్విన్ ప్రకారం జంతు జాతి మనిషిగా  evolve ఔతున్నప్పుడు వేల ఏళ్శు. ఉపయోగంలో లేని అంగాలు క్రమేణా మాయం ఐపోతాయి. మెదడు వాడడం రోజురోజుకీ   తగ్గిపోతున్నాది. రాబోయో artificial intelligence యుగంలో ఇంకా తగ్గతుంది. దీని పరిణామాలు ఎలా ఉంటాయి?

భారతదేశం లో ఎంతో జ్ఞానం  వేదాలు ఉపనిషత్తులు, పురాణాలు , స్మ్రతులుగా నోటిమాటతో జ్ఞాపక శక్తి వల్ల ఎన్నో  వేల సంవత్సరాలు  తరతరాలుగా దిగి వచ్చాయి. ఈ oral tradition వల్ల మనిషి మేధాశక్తి పెరిగి అవధానం, వేదపఠనం‌ వచ్చి ఎన్నో  శాస్త్రాలలో మనదేశం మానవజాతికి మార్గదర్శి అయింది. కొత్తగా వస్తున్న పరిశోధనల వల్ల తెలుస్తున్నది  రాతా‌‌, పుస్తకాలూ వచ్చేక మేధస్సు  తగ్గుతున్నట్టు — calculator వచ్చి సంఖ్యా జ్ఞానం, కంప్యూటర్ spellcheck వచ్చేక చాలా  చిన్న పదాల spelling కూడా తప్పు రాస్తున్నట్టు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here