www.theTelugus.com

‘పెన్యురీ’ అనే పట్నం -17

 By Someswar Bhagwat

ఆలోచన,  రచన  ఒకే భాషలో  

పత్రికలలో రాయడం పాండీత్యాన్ని చూపించడానికి కాదు, విషయం ప్రతి వ్యక్తికీ బోధపడేలా communicate చెయ్యడం అని ముందు అనుకున్నాం కదా? అది చెయ్యడానికి రాసేభాషలోనే ఆలోచన అవసరం.  ఇప్పుడు తెలుగు లో  కాని మరో భారతీయ భాషలోకాని రాయడానికి మన ఇంగ్లీషు చదువులు అడ్డు వస్తాయని కొందరి అనుమానం.

దీనికి కారణం  ప్రతి భాషకీ వేరువేరు  వ్యక్తపరిచే   విధానాలు‌ ఉంటాయి. ప్రతి భాషకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎవరి గురింఛైనా మాట్లాడుతూ ఉండగా ఆవ్యక్తే వస్తే ఇంగ్లీషు లో ఐతే think of the devil… అంటాం . అదే మన భాషలేవైనా ఐతే ‘వందేళ్ళు ఆయుష్షు’ అంటాం   (హిందీలో సౌసాల్ జియో). అన్ని భారతీయ భాషలలో ఇలాటివే వదాలు ఉంటాయి.  ఇంగ్లీషుకీ  మన భాషలకీ ఎంత వ్యత్యాసం!  ప్రశ్న ఒకటి మంచి మరొకటి చెడు అనికాదు. మన భాషలకన్నిటికీ మూలం ఒకటే.. ఆలోచనా విధానాలకి సంస్కృతీ‌, ప్రక్రుతీ‌‌  వాతావరణం భూగోళం (geography) ఇలా చాలా కారణాలు ఉంటాయి   

ఏదేనా శుభకార్యం మనం దీపం ప్రజ్వలించో,  ప్రార్థనతోనో మొదలు పెడతాం. అదే పాశ్చాత్య దేశాలలో పుట్టిన రోజవంటి శుభ అవసరాలకి కొవ్వొత్తులు ఆర్పడమో రిబ్బన్ కత్తిరించడడమో చేస్తొరు.  మన సంస్క్రతి లో ఆరిపోడం మ్రుత్యువుని సూచిస్తుంది. (మన సినిమాలలో చావుని దీపం ఆర్పే సూచిస్తాం). అలాగే తెగిపోడం కూడా.    మనకి ‘చల్లని’ కబురు కావాలి‌,  వారికి ‘వెచ్చటి’ శుభేఛ్ఛలు (warm greetings) తెలుపుతాం. ఇది మనం రాసేటప్పుడు గుర్తు ఉంచుకోవాలి. మనం ఆలోచించే భాషా  రాసే భాషా వేరు కాకూడదు. 

దెబ్బ తగిలితే మనం  అమ్మో అనీ‌ , ఆశ్చర్యంతో బాబోయ్ ఆని మాత్రు భాషలో తలుచుకుంటాం,  కాబట్టీ ఆ భాషలోనే ఆలోచిస్తామని కొందరు అంటారు. గుడ్డి మనిషికి రంగులనీ చెముడు-మూగ మనిషికి మధుర రాగాన్నీ బోథపరచలేము, కాబట్టి మనం మనో ద్రృశ్యాలలో ( in mental imagery) ఆలోచిస్తాం ఆసి కొందరి అభిప్రాయం. ఏదినిజమైనా ఒకరికి తెలిసిన. భాషలోనే చెప్తే తెలుస్తుంది. కాబట్టి మామూలు భాషలో  ‘కళ్ళకి కట్టే’లా రాయాలి. మనకి (సుబ్రమణ్య స్వామిలా) చైనీస్-మండారిన్ వచ్చి, తెలుగు గ్రామస్తండికి అందులోనే చెప్తాం అంటే కుదరదుగా?

మనోద్రుశ్యాలలో ఆలోచించి ఆతి సుళువైన భాషలో రాయడం ఒక కళ. రాసే ముందు మనకే విషయం బాగా  తెలియాలి. ఆ విషయం మీద (అప్పటి వరకూ) ఒక తాత్కాలిక విశేషజ్ఞుడు (temporary  expert) అవ్వాలి. కాబట్టే నిజం పూర్తిగా .తెలుసుకుని కాని రాయకూడదు అన్నది పత్రరచనకి ప్రధమ సూత్రం. మిడిమీడి జ్ఞానంతో ప్రతి విషయం తనకి తెలుసుననుకునే జర్నలిస్ట్ గురించి  ( “నేను డాక్టర్ని‌ మాత్రం, జర్నలిస్టుని కాదు”) అన్ని జోకులు పుట్టాయి. అలాంటి పత్రకారులు ఎప్పుడో ఒకప్పుడు బయటపడి పరిహాసానికి గురి ఔతారు. వీరివల్లే ఈరోజులలో పత్రికలు వాటి విశ్వశనీయత  కోల్పోతున్నాయి.

ఒకే దుర్ఘటనకి వేరువేరు పత్రికలు మ్రుతుల సంఖ్య వేరువేరుగా ఇవ్వడం., చదివేవారు దేన్నీ నమ్మక,  “వీళ్ళు 50 మంది పోయారంటే కనీసం 100మంది మరణించి ఉండాలి,”  (లేక అటు నించి ఇటు)  అనుకోవడం మామూలయింది.  రాను రాను ప్రజలు పత్రికలని  నమ్మకుండా , సామర్ధ్యం, శిక్షణ,   లేని (unskilled,  untrained) వ్యక్తుల  సామాజిక మాధ్యమాలనీ‌, పుకార్లనీ నమ్మడం  జరుగుతున్నది.  దీనివల్ల చాలా అనర్ధాలే జరుగుతున్నాయి.

పత్రిక మొదలెట్టడానికి ఏ చదువూ‌ అఖ్ఖర లేదు.  కనీసం  సాక్షరులేనా అయే అవనవసరం లేదు. కొందరు పెద్ద చువులున్న వారిని జీతాలు ఇచ్చి నౌకర్లుగా పెట్టుకోడానికి డబ్బు ఉంటే సేఠ్జీ.కూడా  ‘సంపాదకుడు’ అవొచ్చు. అందుకే నా పుస్తకంలో Who is the editor? I is the editor.  Oh Are you? Yes I are అని చెప్పే సేఠ్జీ సంపాదకుల గురించి రాసేను. గుజరాత్ లో  ఒకప్పుడు (ఇప్పుడు కూడా నేమో) ప్రతి దినపత్రికకీ సంపాదకుడుగా (అక్కడ ‘తంత్రి’  అంటారు) యజమానిపేరే ఉండేది. 

అసలు సంపాదకుడు ఒక  నౌకరు మాత్రం.  ఒక కధ ప్రకారం The Times of India దినపత్రిక ఒక ప్రకటన ఇచ్జిందట: Wanted  Editor, Journalists need not apply అని (సంపాదకుడు కావాలి‌, జర్నలిస్ట్ లు అర్జీపెట్టవద్దు). ఇది ఒక మానసికత.

ఇది ఈ దేశపు కటు సత్యం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here