‘పెన్యురీ’ అనే పట్నం -18
By Someswar Bhagwat
మీ ఎంపిక: పలక్ కోహ్లీయా తైమూర్ డయాపర్లా?
ఈ మధ్య ఒక విడియో వచ్చింది: అది పలక్ కోహ్లీ అనే 18 ఏళ్ళ పిల్ల ఒక చెయ్యి లేకుండా పుట్టి తన దురదృష్టానికి జీవితాంతం ఏడుస్తూ గడపకుండా ఆ లోపాన్ని తనకి కలిగిన.దురదృష్టం కాక అద్రుష్టం కింద మార్చుకుని అంగవైకల్యాన్ని ఒక పేరాఒలింపిక్ ఆటగత్తెగా మలుచుకున్న ధైర్యవంతురాలి అద్భుత గాధ.
ఇలాటి నిజం ‘కధలు’ చప్పడమే పాత్రికేయుల అసలు పని —- ఏ వార్త వల్ల సంచలనం కలిగి TRP, లేక పత్రిక అమ్మకం పెరుగుతుందో చూడడం కాదు. కాని ఇలాటి వార్తలు మన దేశంలోని పాత్రికేయులకి ఇలా బయలుపరచడం ఇష్టం లేదు. “ఇందులో నా కేమిటి ఒరుగు తుంది” ఆని ఆలోచించే కొత్త సంస్కృతి, మనస్తత్వం, వల్ల. విజయ్ మాల్యా గుణగానం చేసిన పాత్రికేయులకీ, వేలకోట్ల రుణాలు ఇచ్చిన బేంకర్లకీ బీరుసీసాల క్రేట్లు ఫ్రీ గా దొరకొచ్చు, కాని ఒకే చెయ్యి ఉన్న ఆడపిల్ల.ఏమివ్వగలదు?
అందుకేనేమో ఈ వార్త వీడియో ప్రపంచం లో అందరికీ తెలియజేసినది ఏ భారతీయ వార్తా సంస్థా, పత్రకర్తా కాదు. భారత దేశం ఒక ముష్టవాళ్ళూ, పాములు ఆడించేవారి దేశం ఆని ప్రచారం చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇంగ్లీషు వారి BBC News. మన దేశంలో అందరు పాత్రకేయులూ అవినీతి పరులు కాదు. కాని ప్రజా మాధ్యమాలన్నీ డబ్బు చేసుకునే సేఠ్జీల చేతులలో ఉన్నాయి. ఆ స్థాయిలో పత్రికలు పెట్టడానికి ఎవ్నో వందల కోట్ల రూపాయలు అవసరం. తక్కువ వనరులతో పెట్టబడిన పత్రికలు జీవించలేవు. కాబట్టే పత్రిక యజమానులు అలాటి వార్తలని ప్రచురించరు.
BBC News, అలాగే ఇంగ్లీషు వార్తాసంస్థ రోయ్టర్ బ్రిటన్ స్వప్రయోజనాలకి హానికరంకాని విషయాలలో చాలా నిస్పాక్షికం. ఐలాటి విషయాలలో వాటి పాత్రికేయులపై ఏనిర్బంధం లేదు. బ్రిటన్ స్వౌర్ధానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే అవి రెండూ బ్రిటన్ వేపే మొగ్గుతాయి. అందుకే ఆవి నిస్పక్షపాతం అని పేరుతెచ్చుకున్నాయి.
పాత్రికేయుల ముఖ్య బాధ్యత రెండు రకాల వార్తలలో ఒకటి ఎంచుకోడం: తైమూర్ ఖాన్ ఇంటికి వెళ్లి కరీనా ఖాన్ వంటి అందమైన సితార ఆతిధ్యం స్వీకరిచడం వారి చెత్తబుట్టలు కెలికి తైమూర్డవి పారేసిస డయాపర్లలో ఏముందో చూడడం, ఎలా, ఎప్పడు, ఎవరు మార్చారో్ అడిగి తెలుసుకోడం, సులభం మరియు సౌఖ్యకరం. పిల్లో, పిల్లడౌ చచ్చిపోయి ఏడుస్తున్న తలితండ్రుల మొహాలలోకి మైక్ పెట్పి “ఇప్పుడు మీకు ఎలా ఉంది?” అని ఆడిగే రిపోర్టర్ లు ఎందరో! ‘మాకు చాలా సంతోషంగా ఉంది” అని ఎపరేనా అంటారా? అంటే ఆవార్త సంచలనం కలిగిస్తుంది కదా?. ఇంకేం కావాలి?
దీనీ నుంచి వచ్చిన మరో జర్నలిజం పాఠం – విషాదం హాస్యానికి విషయం కాదు (never make fun of a tragedy). అలాటిపాత్రకేయులకి ఒక sensitisation training పెట్టాలని కొన్నిసొర్లు అందుకే అనిపిస్తుంది. ఏ మంచి పత్రికలోనూ మ్రృత్యువుమీద, అలాగే.ఒకరి దురదృష్టం మీద. హాస్యపూరతమైన వార్త కానీ శీర్షిక కానీ రాయరు, రాయకూడదు
.
తైమూర్ డయాపర్లు కెలకడం ఎంత.సులభమో పలక్ కోహ్లీ తన దురదృష్టం తో ఎలా సంఘర్షించి, విజయం సాధించి, పారా ఒలింపిక్స్ వరకు ఎదిగిందో సరిగా చూపించడం అంత కష్టం. ఆరెండు దారులలో ఒకటి ఎన్నకునే అవకాశం వస్తే సులభమైన, సౌకర్యకరమైన దారిలో ప్రయాణించులనుకోడం సహజం, సామాన్యం. కష్టమైన దారిని ఎన్నుకోడం అసాధారణమే కాదు దానికి ధైర్యం సామర్ధ్యం కూడా ఆవసరం.
ఈగుణాలే ఒక.మంచి పాత్రికేయుడీకీ మామూలు వ్యక్తికీ ఉన్న తేడా. కష్టమార్గాన్పి ఎన్నుకోడం మంచి పత్రకర్త లక్షణం. ఈ విషేషం రిపోర్టర్లకే పరిమితంకాదు. సబ్ ఎడిటర్లు ప్రతినిమిషం ఎదుర్కునే సమస్య ఇదే.పాత్రికేయులపని సరైన విషయాన్ని ఎంపిక చేసుకోడంతో ముగియదు…. మొదలెడుతుంది. బెళ్ళారి జిల్లాలో. ఒకప్పుడు రాఘవేంద్రమఠం (ఇప్పుడు కర్నూలు జిల్లా) ఉండేది.ఆంగ్లేయుడైన మన్రో ఆనే జిల్లా కలెక్టర్ కి దైవదర్శనం కలిగింది అంటారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక నియమం పెట్టింది.. .. ఎవరేనా మఠాధిపతి పోతే ఆమఠానికి చెందిన ఆస్థి. కంపెనీది ఐపోతుందని. అప్పుడు పత్రికలు, obits ప్రచురించడం ఉండేది పత్రకర్త.కాదు్ రాఘవేంద్ర స్వామి పోయారని తెలిసిన అతను నిజం తెలుసుకోడానికి స్వయంగా ఆమఠానికి వెళ్ళారట. — ఎవరో చెప్పింది నమ్మడానికి అతను పత్రకర్త కాదు మరం దగ్గరకువెళ్ళిన వెంటనే మందిరం. గోడలు గాజుగామారి లోపల రాఘవేంద్రుడు.కనిపించి ఎంతో మంచి ఇంగ్లీషు భాషలో మన్రోతో చాలా సేపు మాట్లాడాడట. అతనితో వెళ్ళినవారు కలెట్లెక్టర్ గోడతో మాటలాడటం చూసి ఆశ్చర్య పడ్డారు. వెంటనే అతను వెనకకి వచ్చి, స్వామితో స్యయంగా మాటలాడేననీ, అతను బతికే ఉండడంవల్ల ఆ ఆస్థి జప్తుచేయటం కుదరదని రిపోర్ట్ పంపేడట. గోడలు క్రిస్టల్.గాజుగా మారడం సంచలనాత్మకమే. కాని సామాజిక మాధ్యమాలలో అలా తగలియగానే పనిమొదలు ఔతుంది.
ఆంగ్ల లేఖకుడు.H.H. Munroe పేరు ఎరిగినవారు అతను మున్రో అనుకుంటారు. లేకపోతే మన్రో. మన దేళపు భాషలైతే spelling సమస్యే లేదు. ఇంగ్లీషు ఐతే Munroeవా Munroవా లేక చెన్నైలో విగ్రహం ఉన్న.గవర్నర్ Munrowవా నశ్చయించాలి. ఏదైతే. ఏమిటి అని కొందరు ఐనుకుంటారు, పేరులో ఏముంది :’కుడి ఎడమచతే పొరపాటు లేదోయ్’ అని. కాని. మరికొందరు Shakespeare లా పేరు ఏదైనా గులాబీ పరిమళం మారదు అని ఊరుకోక.సరైన పేరుకోసం వెతుకుతారం. ప్రతి విషయంలో ఠంచనంగా సరిగా ఉండాలి అనుకోడం ఒక అలవాటు ఒక..మంచి సంస్కృతి. పాత్రికేయులు ఈ.సంస్కృతి ఆలవాటు చేసుకోడం మంచిది.