‘పెన్యురీ’ అనే పట్నం -19
By Someswar Bhagwat
ఏమిటి విషేషాలు? ఎలా తెలుస్తాయి?
ఏమిటి విషేషాలు? ఎలా తెలుస్తాయి? బెంగళూరుకి నాలగైదు దశాబ్దాల కింద నేను ఒక కొత్త ఇంగ్లీషు దిన పత్రిక మొదలెట్టడాని.కి వచ్చినప్పుడు ఒక విషయం గమనించాను:
ఎవరు, ఎక్కడ , ఎప్పుడు, కలిసినా మాటలు తిండి గురించి మొదలు పెట్టేవారు: మధ్యాహ్నం. ముందైతే “ఊటా ఆయత్తా?” (భోజనం అయిందా?). మధ్యాహ్నం ఐతే “తిండి (టిఫిన్) ఆయత్తా?” (టిఫిన్ చేశారా?). సమయం ప్రకారం ఇవి మారినా ప్రధమ.ప్రశ్న .ఎప్పుడూ తినడం గురించే. ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది.
అలాగే తెలుగువారు ఎవరు కలిసినా “బాగున్నారా?” (ఇంగ్లీషు వారి How are youని అనుకరించి) తరవాతి ప్రశ్న “ఏమిటి విశేషొలు?” అంటే అక్కడి వార్తలు ఏమిటని. పురాణ కాలంలో నారదుడు మొదటి జర్నలిస్ట్ అని అన్నాను కదా? ఏ ఊరికెళ్ళినా అక్కడీ వార్తల గురించి కుతూహలం ఉండేది.
నారదడు ఎలాగూ కనిపించడు కనుక ఊరిలో ఏం జరుగుతోందో మంగలి వారినుంచి తెలిసేది. జుత్తు కత్తిరించడంతో పాటు ఊరికబుర్లు అన్ళీ చెప్పేవారు. ఇంట్లో ఏశుభకార్యం నిశ్చయమైనా మంగలితో చుట్టుపక్కల ఊర్లలో నిర్ణయం బంధువులకి ఆ విషయం కబురు పెట్టేవారు. అందుకే నేను పత్రకారుల పూర్వీకులు మంగలి వారని అనేవాడిని (కులం కాదు, వ్రుత్తి). రాను రాను మార్పు వచ్చింది. క్షవరాలు సైలెంట్ సినిమాలైపోయేయి. వృత్తి కులం ఐపోయి అందరూ ఆరక్షణలకి సంఘర్షణలు మొదలు పెట్టేరు.
వార్తలు పత్రికల నుంచి తెలిసేవి. ఆపధ్ధతి మారి వార్తలు మొట్టమొదట రేడియో కాని