‘పెన్యురీ’ అనే పట్నం -20
By Someswar Bhagwat
తోబుట్టువులు అరుదు; తమ పిల్లలు ఇంకా తక్కువ
పత్రికా ప్రపంచంలో తోబుట్టువులు అరుదు. కాని లేకపోలేదు. కాని.అంతకన్నా అరుదు తమ సంతానాన్ని జర్నలిస్టు చేసే పత్రకారులైన తల్లితండ్రులు, దీనికి కారణాలు ఉన్నాయి.ఈ ఉద్యోగాలలో ఉన్న సాధకబాధకాలు తెలిసిన తలితండ్రులు తమపిల్లలు ఈ ఉద్యోగాలలో చేరాలని కోరుకోరు. అదే తెలివితేటలు, సామర్థ్యం, ఉంటే IAS లో కాని, ప్రైవేటురంగంలోకాని, మంచి హోదాలో చాలా ఎక్కువ గణించలరు. మరీ మందబుధ్ధులు ఈ వృత్తిలోకి రారుకదా? చాలామంది తోబుట్టువులు ఒకే తరానికి చెంది.ఒకే ఆదర్శం, ఒకే దృక్పథం ఉన్నవారవడం సహజం. కిందటి శతాబ్దంలో ఐతే ఆకలి ఆదర్శ వాదంతో స్వతంత్రతా సంగ్రామంలో భాగంగా పత్రికలలో చేరేవారు.తలితండ్రులూ, పిల్లలూ వేరే తరాల వారు. వారి విలువలు వేరు.
నేను పని చేసిన అన్ని పత్రికల సంపాదకుల్లో ఎక్కువ పుస్తకాలు రచించిన D. R. Mankekar ఒక పుస్తకం రాసేరు. ఆయనా, భార్య కమలా కలీసి ఒకే పత్రిక లో వివాహపూర్వం పనిచేసేరు. ఆ పుస్తకం No, My Son Never. అందులో పత్రికలలోని ఆఫిసు రాజకీయాలు, కుట్రలు, యజమానుల కుళ్ళు బుధ్ధులూ తక్కిన పత్రకారుల ప్రవర్తన అన్నీ తెలిపి, ఎందుకు అక్కడ చేరకూడదో వివరించారు.కాని “రాయడం పురుగు” కరిచినవారు ఎవరూ అది మానలేదు.
మంకేకర్, కమలా ఉద్యోగాలు మానలేదు. ఆయన ఆఖరి వరకూ పత్రికలలోనే ఉన్నారు. అన్నతమ్ములు పత్రికలలో పని చెయ్యడం.గురించి చెబితే మొట్ట మొదటి పేర్లు వచ్చేవి కోటంరాజు రామా రావు అతని అన్న పున్నయ్యజవహర్ లాల్ నెహ్రూ పెట్టిన ఇంగ్లీషు దినపత్రికకి మొదటి సంపాదకుడు రామారావం. “పేరుకి మాత్రం ఈ పత్రిక నాది. నిజంగా ఇది రామారావుదే” అని నెహ్రూగారే అనేవారు. ఆఖరివరకూ ఆయన అక్కడే పనిచేసేరు. వారితో కలిసి త్రిపురీ (జబల్ పూరు) కాంగ్రెస్ లో ప్రెస్ కేంపులో ఉన్న మానాన్నగారుచూసిన ప్రకారం అన్నతమ్ములు ఎన్నో ఏళ్ళ తరవాత కలిసారు.
పున్నయ్య కొందరు బంధువులగురించి పేరు పేరునా అడిగితే వారు పోయి ఎన్నో సంవత్సరాలయిందని తమ్మడు చెప్పే వారుట.పున్నయ్య కరాచీ (ఇప్పుడు పాకిస్తాన్) లో సింద్ అబ్సర్వర్ (Sind Observerat Karachi)కి.సంపాదకుడిగా చాలా ఏళ్ళు ఆంధ్ర కివెళ్ళలేదు. ఆహోదాలో అతను ఒక విషయంలో ప్రపంచంలో ఏకైక వ్యక్తి అయారు. అతని పత్రిక యజమాని ఒక సింధీ సేఠ్. నెహ్రూ సింధ్ ప్రాంతం షర్యటించబోతున్నారని యజమాని ఒక ఉత్తరువు జారీ చేసాడుట:
నెహ్రూ సభల వార్తలు తన పత్రికలో ప్రచురించకూడదు అని. అన్నతమ్ములు ఇద్దరూ రాష్ట్రవాదులే. పున్నయ్య ఒకలేఖ అందరు విలేఖరులకీ పంపి నెహ్రూ సభలన్నిటి వార్తలూ పూర్తిగా సేకరించి ప్రచురించితే యజమానికి కోపం వచ్చి తన ఎడిటర్ కే బిల్లు పంపారట — ఆ వార్తలన్నీ ఆక్రమించిన జాగాకి ప్రకటన రేటున. పున్నయ్య అప్పుడు సభలు.ఫెట్టి, విరొళాలు సేకరించి ఆడబ్బుతో పత్రిక యజమాన్యం కొనీసేరని ప్రసిధ్ధి. ప్రపంచం లో ఇలాటి సంఘటన ఇది ఒక్కటే.
(contd)