‘పెన్యురీ’ అనే పట్నం -21
By Someswar Bhagwat
ఇవాళ ఇక్కడ, రేపు ఎక్కడో?-1
కొన్ని జనజాతి దళాలు ( tribal groups) ఒక జాగాలో స్థిరఫడకుండా జాగాలు మారుతూ ఉంటాయి. వీటిని నోమాడిక్ ట్రైబ్స్ (nomadic tribes) అంటారు. ఉద్యోగాలలో ఇలాటివారు పత్రికా రచయితలు. దేశంలో అన్నిటి కన్నా పెద్ద నోమాడిక్ ట్రైబ్ ఈ పత్రికా రతయిత (జర్నలిస్టు)లేమో.
నండూరి పార్థసారథి గురించి రాస్తూ అన్నాను కదా, ‘నిన్న ఎక్కడో , రేపు ఎక్కడో ‘ అని? తక్కిన వారి కంటే ఇది జర్నలిస్టుల లోనే ఎందుకు ఎక్కువ? నాకుతెలిసిన ఒకాయన IISc నుంచి మెటలర్జీ ఇంజనీరింగ్ పాసైన మర్నాడు ఒక కొత్త కంపెనీలో చేరి 48 సంవత్సరాలూ అక్కడే పని చేసీ ఆ కంపెనీకి Jt. MD and CEOగా అక్కడే (కొన్నేళ్ళ క్రితం నాకు పరిచయం ఐనప్పడు) ఉన్నారు. కాని 64 ఏళ్ళుగా పత్రికా వ్యవసాయంలో ఉండి అలా ఒకే పత్రికలో జీవితాంతం ఉన్నవారిని చూడలేదు. నేనే 14 ఉద్యోగాలు మారి 6 నగరాల్లో పని చేశాను.
ఇలా మారుతూ ఉండే నోమాడిక్ ట్రైబ్స్ ఈ రంగంలోనే కాదు. ఒక పెద్ద ఊరిలో ఒక 5-స్టార్ హోటల్ మేనేజర్ని అదేజాగాలో ఐదేళ్ళ తరవాత చూసిఒకరు ఆశ్చర్య పోయి ఆడిగారు “ఏం? మీకీంకా.ఆఫర్లు రాలేదా?” అని్ అలాగే ఒకే ఏడ్ ఏజెన్సీలో నాలుగేళ్ళ కన్నా ఎక్కువ. ఎవరేనా ఉంటే వింతే. పెద్ద ఎకౌంట్ లు చూసేవారైతే ఆ కంపెనీలతో మంచి సంబంధాలు పెంచుకుని వాటితోనే బైటకొచ్చి మరో కొత్త ఏజెన్సీ పెట్టడం మామూలే.ఈ దేశంలో నూటికి 98 ఏడ్ఏజన్సీలు ఇలాగే పుట్టాయి.
జర్నలిజంలో ఉద్యోగ స్థిరత్వం లేక పోడానికి ఎన్పో కారణాలు ఉంటాయి. పత్రికలు బందవడం చాలా సాధారణం. రెడోది ఒక హోదాలో ఉంటే అంతకంటే పెద్ద హోదాలో రమ్మని మరో పత్రిక పిలవవచ్చు. పత్ర ప్రతినిధులు తక్కినవారితో తరచుగా కలుస్తూ ఉండడంవల్ల ఈ ఆఫర్లు వారి ద్వారానే వస్తాయి. మరో కారణం అభిప్రాయ బేధంవల్ల కాని ఆఫీసు రాజకీయాల వల్లకాని రాజీనామా చెయ్యడం.
ఇలాటప్పడు పత్రిక యాజమాన్యం గిడుసుబేరం పెట్టడం మామూలే. ఒక ఉద్యోగంలో ఉంటే అంతకన్నా పెద్ద హోదాకి పిలుస్తారు. ఆదే ఖాళీగా ఉంటె పూర్వం కన్నా తక్కువ ఇస్తామంటారు. కాబట్టి మరొక ఉద్యోగం చూసుకునే రాజీనామా చెయ్యడం మంచిది. ఆలాగే వదిలేటప్పుడు సంబంధాలు బాగా ఉండాలి — ఇలాటి వ్యాపారం లో మళ్ళీ అదే యాజమాన్యంతో పని చెయ్యవలసి రావొచ్చు. నా 14 ఉద్యోగాలలోనూ ఎన్నోచోట్ల రెండేసి సార్లు. ఒక ఉద్యోగానికీ మరోదానికీ మధ్య కొంత సమయ0 ఉండవచ్చు.
No good journalist is unemployed, but (s)he may be ‘free’ from time to time అని అంటారు. అలాటి సమయాలకోసం తయారుగా ఉండాలి- ఇల్లు గడియడానికి డబ్బుతో.
ఇన్ని సాధక.బాధకాలున్నా ఈ రంగంలో వేలమంది పనిచేస్తూ ఉండడానికి కారణాలు రెండే కనిపిస్తాయి. పాతకాలం వారి రాయాలనే తపన, కొత్తవారు ఇందులో కూడా డబ్బు చేసుకునే అడ్డదారులు ఉన్నాయని తెలుసుకోడం.
ఈ పాత కొత్తలకి వయసుతో పనిలేదు — పాత ద్రృక్పథం కొత్త వారిలోనూ, లోభం పెద్దవారిలోనూ ఉండవచ్చు. ఇదే పత్రికాప్రపంచం వచ్చిన కొత్త సంస్కృతి.
To be continued